Harsha's Stories Episodes
A collection of Telugu stories written by Harsha, showcasing unique narratives and local culture.
March 26, 2020
నేను పగలకొట్టిన పిచ్చుకను నాకు ఇవ్వండి తెచ్చి!
నాకు నా చిన్నప్పటి రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే. నాలుగేళ్లు వుంటాయనుకుంటా నాకు అప్పుడు. మా పెద్దమ్మతో నెల్లూరు వెళ్ళినప్పుడు, సతాయించి సతాయించి ఒక కారు బొమ్మ కొనిపిచ్చుకున్నా. కాస్త అదిమి పెట్టి వెనక్కి లాగితే స్ప్రింగ్ ముడుచుకొని, వదలగానే రయ్యిమంటూ ముందు కెళ్లే ఎర్ర కారు అది. కొన్ని రోజులైతే దానితోనే నా లోకం. ఉన్నట్టుండి ఒకసారి దాని ముందు చక్రం ఊడి పోయింది. సరి చేసి పెడితే కొంచెం దూరం వరకు చక్రం ఉండటం, తర్వాత ఊడి, కుంటి గుర్రం లాగా ఒక పక్కకి పడి పోవటం. అలా చక్రం ఊడిన కారు నాకు నచ్చలా. ఒక రాయి తీసుక...
March 26, 2020
కథా సరిత్సాగరం!
మా అమ్మమ్మ చెప్పే కథల గురించి ఇంతకుముందు చెప్పా కదా!
మాకు కథలు చెప్పటం అనేది, తన రోజూ వారీ దినచర్యలో ఆవిడకి అన్నిటికంటే ఇష్టమైన ప్రక్రియ.
కానీ మేము అడిగిన ప్రతీసారీ ఆవిడ, తన దగ్గరినించీ ఈ కథలు, అంత తేలిగ్గా బయటకి తీసేది కాదు.
ఒక్కోసారి ముందుగా పొడుపు కథలు చెప్పేది.
అంటే, పొడుపు కథ మేము విప్పితే గానీ అసలు కథ బయటకి రాదన్నమాట.
ఇదంతా అయ్యిన తర్వాత, ఆమె కథ చెప్పడానికి రెడీ అయితే బోనస్, లేక పోతే ఆవిడ, ఆ పొడుపు కథనే ఆరోజుకి పొదుపుగా వాడేసుకుంది , అని మేము అర్థం చేసుకోవాలి.
అలా ఆవిడ తన అమ్ముల పొది...