Conversations on contemporary literature from across the world, in translation.
Harshaneeyam Podcast

Harsha's Stories Episodes

A collection of Telugu stories written by Harsha, showcasing unique narratives and local culture.
March 31, 2020

చిన్నప్పుడే చితికిపోయిన నా చిన్నమెదటి, భేతాళ ప్రశ్న

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, ఎప్పటిలా చెట్టుపైనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, "ఓ! రాజా ఇంత అర్థరాత్రివేళ, భీతిగొలిపే ఈ స్మశాన వాతావరణం లో, ఎదో సాధించాలన్న నీ పట్టుదల కారణంగా, నీవు చేస్తున్న ఈ పని నీకు అత్యంత సహజంగా కనపడుతున్నట్టు నా కనిపిస్తుంది. నాకెందుకలా అనిపిస్తుందో, ఉదాహరణగా నీకు అచ్చు నీలాటి పట్టుదల చూపిన భగీరథుని కథ చెపుతాను శ్రమ తెలీయకుండా విను", అంటూ ఇలా చెప్పసాగాడు.

"భగీరధుడు మహాజ్ఞాని, ...
March 29, 2020

మా నెల్లూరోళ్లు, ఎంతైనా ప్రత్యేకమబ్బా!

మా నెల్లూరోళ్లు చాల ప్రత్యేకమబ్బా. ఓర్నీ పాసు గూలా, ఏందిరా! అబ్బయ్యా అంటూ భోళాగా పలకరిచ్చేస్తారు. ఆటో గాని రిక్షా అతను కానీ ఎక్కండి అనరు, బేరం కుదరగానే ఎక్కు అంటారు అలాగే ఎవర్నైనా నువ్వు అంటారే గాని మీరు అనరు. కొంచెం బయట ఊర్ల నుండి వచ్చినోళ్ళకి మా ఏకవచన సంబోధన కొంచెం కష్టమే.

మా వాళ్ళకి నచ్చేది సినిమాలు, భోజనాలు మరియు పాలిటిక్స్. ఒకప్పుడు మాకు అదిరే హాల్స్ ఉండేవి. మూడు హాళ్లు, నర్తకి, అర్చన మొదటి శ్రేణి అయితే, సుందర్ డీలక్స్, రాధామాధవ్, శ్రీనివాస, అనిత, లీలమహల్ లాటి ద్వితీయ శ్రేణి, వినాయక, న్యూట...
March 28, 2020

ఆఫీసు పని ఇంట్లో చేస్తున్నారంటే!

మిస్ వైజ్ మా పెద్ద పాప అమృత క్లాస్ టీచర్, సీటెల్ లో వున్నప్పుడు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో కలిసాము ఆవిడని, అకడమిక్ ఇయర్ మొదటలో . "నేను కావాలనే ఒక క్లాస్ పీరియడ్ కి, ఇంకో పీరియడ్ కి మధ్యలో పదిహేను నుండి ఇరవై నిముషాలు గ్యాప్ ఇచ్చాను. స్టూడెంట్స్ ఆ గ్యాప్ లో నేను ఇచ్చిన వర్క్ చేసుకోవచ్చు లేక పోతే వాళ్ళు వేరే ఆక్టివిటీస్ చేసుకోవచ్చు. నేను వాళ్ళను కంపెల్ చెయ్యను. కానీ వాళ్ళు ఇంటికొచ్చాక ఎక్కువ క్లాస్ వర్క్ చేస్తుంటే, వాళ్ళు నేను ఇచ్చిన గ్యాప్ లో వర్క్ చేయటం లేదు అని అర్థం. సో అమృతని కొంత కాలం మానిటర...
March 28, 2020

అమ్మలందరు అంతే ! మా అమ్మ కూడా !

ఒరే హర్షాగా! "మీ అమ్మకి నేను ఇక ఏమీ చెప్పానురా", అంటూ కణ కణ లాడి పోయాడు మా నారాయణ రెడ్డి వాళ్ళ షడ్డకుడి కొడుకు రిసెప్షన్ అయ్యాక. ఎదో అయ్యింది ఆ రిసెప్షన్ కి మా అమ్మ అటెండ్ అయ్యాక అని నవ్వుకున్నా. మంచి నీళ్ల గ్లాస్ ఇచ్చి, "చెప్పరా ఏమయ్యిందో అన్నా", వినటానికి సిద్దపడుతూ. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ అమ్మ అడిగార్రా, అమ్మాయి ఏమి చదివింది, ఎలా ఉంటుంది అని. "పర్వాలేదమ్మా బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం బొద్దుగా ఉంటుంది, అని చెప్పా!. నిన్న రిసెప్షన్ లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నల ముందు, అదేమి...
March 28, 2020

మా లక్ష్మీ పెద్దమ్మ పెద్ద అదృష్టవంతురాలు!

మా అమ్మమ్మకి వాళ్ళ నాన్నగారు తన చెల్లెలి కొడుకు తో పెళ్లి నిశ్చయించాడు. ఆ వరుడు తనకన్నా వయస్సులో చాలా పెద్దవాడు అవటం తో, ఛీ ! నాకు వద్దు అని తన ఈడు వాడైనా మా తాతని వివాహమాడేసింది. ఆ రోజుల్లో నాయన మాట ఎదిరించి వివాహం చేసుకోవటం మహా సంచలనం. వాళ్ళ నాన్న గారు తన మాట ఎక్కడ పోతుందో అని, మరీ చిన్నపిల్ల, లక్క పిడతలతో ఆడుకుంటున్న మా అమ్మమ్మ చెల్లెల్ని తీసుకెళ్లి తన అక్క కొడుక్కిచ్చి పెళ్లి చేసేసాడు. ఆయన అప్పటిలోనే బెనారస్ హిందూ యూనివర్సిటీ లో మెట్రిక్యూలేషన్ చదివాడు, హిందీ ప్రచారసభ వారి విశారద కూడ ఫ్యాన్ ...
March 28, 2020

నా మొదటి అమెరికా యాత్ర, అచ్చు ఆచారికి మల్లె!

ఆచారి! అమెరికా యాత్రలా, నా మొదటి అమెరికా యాత్ర గురుంచి, తప్పకుండా రాయాలి. నేను, సుప్రియ, ఇద్దరు పిల్లలతో క్రీస్తు శకం 2000, మార్చ్ 31 వ తేదీ ముంబై నుండి కొలరాడో లోని డెన్వర్ కి బయలుదేరాము. అమ్రుకి రెండు నిండి మూడేళ్లు, ఆముకి మూడు నెలలు. ఇంతకు ముందు దక్షిణాఫ్రికాలో మూడేళ్లు ఉండటంతో ఈ ప్రయాణాన్ని చాలా ఆత్మవిశ్వాసం తో మొదలుపెట్టాము, మాకేంటి అనే ధీమా తో. జె .ఎఫ్ .కే లో మార్చ్ 31 వ తేదీ సాయంత్రం ఐదున్నరకి దిగేసాము. డెన్వర్ కి మా కనెక్టింగ్ విమానం, తర్వాత రోజు ఉదయం ఏడు గంటలకు, పక్కనే ఉన్న లాగార్డియా వ...
March 27, 2020

స్పర్ధయ వర్ధతే విద్య!

ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలో మా అక్క సుమతి, రవణమ్మ, హైమావతి, దొరసాని మొదలగు వారు నాకు ఒకసంవత్సరం సీనియర్స్. నిజముగా నాకు గుర్తు లేదు సీనియర్స్ అయిన అబ్బాయిల పేర్లు. కావాలంటే నా క్లాస్ అమ్మాయిల మరియు అబ్బాయిల పేర్లు చెప్పగలను, కరుణాకర్, మురళి, ప్రభాకర్, ఉష, హిమ మరియు జయమ్మ వగైరా వగైరా అని.

మా సీనియర్ అయిన రవణమ్మకి చాల మంచి పేరు, చక్కని అమ్మాయి అని, బాగా చదువుకుంటుందనియు, మరియు ఆటల్లో కూడా చురుకుగా ఉంటుందని. తాను అవడానికి మా అక్క వాళ్ళ సహాధ్యాయిని అయినా వాళ్ళ తరగతి వాళ్ళకంటే వయస్సులో ఓ సంవత్సరమో ల...
March 27, 2020

స్నేహనాథుడు మా రఘునాథుడు!

మీరెప్పుడన్నా విన్నారా, "కొత్త బిచ్చగాడు పొద్దెరగడు", "పాడిందే పాడరా పాచి పళ్ళ దాసరి", "పిచ్చోడికి పింగే లోకం" లాటి సామెతలు. వినలేదా అయితే సుప్రియని అడగండి, ఇంకా నాలుగు చెప్పి వాటికీ ఉదాహరణ గా నన్ను చూపిస్తుంది.

నేను అదే పనిగా మా పెదపుత్తేడు జిల్లా పరిషత్ పాఠశాల స్నేహితుల, ప్రభుత్వ ఆదర్శ పాఠశాల స్నేహితుల, మా వాకాటి ఇంజనీరింగ్ స్నేహితుల గూర్చి రాస్తుంటే తాను నా రాతల్లోని యాంత్రికతను తట్టుకోలేక పై సామెతలు నేను వినేలా పాటల రూపంలో పాడుతుంది యీ మధ్య.

"నా స్నేహితుల గూర్చి రాయాలంటే పెట్టి పుట్టాలి సు...
March 27, 2020

ట్రాఫిక్ తో ఆత్మ సాక్షాత్కారం!

మొన్ననగా వెళ్లారు సుప్రియ మరియు పిల్లకాయలు, జూబిలీ హిల్స్ లో వాళ్ళ అక్క వాళ్ళింటికి. నేనెళ్ళి నసపెట్టి తీసుకురాక పోతే, వాళ్లకు నేనొకడ్ని వుండానని గుర్తుకే రాదు. టాకీ టౌన్ దగ్గర హైవే 65 మీదకి ఎక్కా, ట్రాఫిక్ స్మూత్ గానే ఉండడంతో కొంచెం స్పీడ్ పెంచా, అంతలోనే మియాపూర్ బస్సు స్టాండ్ దగ్గర, ఒక గుంపు రోడ్ ని అడ్డంగా దాటుతూ, అందులోనూ ఒకడు చెయ్యెత్తి మరీ, మీ వెహికల్స్ అన్నీ ఆపండెహె అన్నట్టు. నాలుగడుగులు ముందుకేస్తే, మియాపూర్ సర్కిల్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జి వుంది, లిఫ్ట్ కూడా ఉందిగా, ఏమి మాయ రోగం వీళ్ళకి...
March 27, 2020

లక్ష్మి, లేకపోవటం చాలా చేదు నిజం!

నాన్న వాళ్ళది ఉలవపాళ్ళ. నేషనల్ హైవే లో నెల్లూరు నుండి కావలికి వెళ్తుంటే సున్నబ్బట్టి , అల్లూరు గేట్ దాటిన తర్వాత హైవే నుండి ఒక కిలో మీటర్ లోపలి కెళ్ళాలి. ఒకప్పుడు బిట్రగుంట లోకో ఇంజిన్ మైంటెనెన్సు కి ఫేమస్. ఆ చుట్టు పక్కల ఊర్లలో సగం మంది రైల్వే ఎంప్లాయిస్. డ్రైవర్స్, ఫిట్టర్స్, గ్యాంగ్ మెన్ ఎవరి అర్హతల్ని బట్టి వారు ఆ చుట్టుపక్కల గ్రామాలనుండి బాగా సర్వీసెస్ లో వుండే వారు. మా తాత గారు కూడా అక్కడ ఫిట్టర్ . పక్కా కమ్యూనిస్ట్. ప్రజాశక్తి న్యూస్ పేపర్ చదవటమే కాక పది మందికి రోజూ చదివి వినిపించనిదే ఆయన...
March 27, 2020

నా స్నేహితుల కథా క్రమం లో మా సుబ్బూ గురించి!

నేను కథలు రాయాలనుకున్నప్పుడు, మొదట స్నేహితుల గురుంచి రాద్దామనుకున్నాను. కానీ ఇలా రాయటం లో తెలియని ప్రమాదముంది. మొదట యీ రాయటం సరదాగా మొదలయినా, పోను పోను అవి నా అభిప్రాయ వ్యక్తీకరణ సాధనాలుగా మారుతాయేమో అన్నది నా భయం. అప్పటికీ నేను నా స్నేహితులతో వాదించవచ్చు ఈ కథ నేను నా కోణంలోనుంచి మాత్రమే రాస్తున్నాను అని. అలా వాదించటం నన్ను నేను మోసం చేసుకున్నట్టే అవుతుందేమో. కాబట్టి నాకు తెలిసినంత వరకూ తటస్థం గానే రాస్తాను. మా శ్రీధర గాడు మాత్రం దీనికి మినహాయింపని మీకిది వరకే బోధపడిందను కుంటా. వాడో మంచి స్నేహిత...
March 27, 2020

మా పల్లెటూరోళ్ల, గత కాలపు వినోదాలు!

నేను చాల రోజుల నుండి మన మధ్య నుండి మాయమై పోయిన ఒకప్పటి వినోదాల గురుంచి రాయాలనుకుంటున్న. కాక పోతే గత పల్లెవాసిగా నావన్నీ ఒకప్పటి గ్రామాల్లో కనిపించి ఇప్పుడు మాయమయ్యినవి అయ్యుంటాయి. మొదట మనందరికీ ఇష్టమైన ఆసక్తికర మైన రికార్డింగ్ డాన్స్ లతో మొదలెడుతా. మా వూరిలో శ్రీరామనవమి నాలుగు రోజులో ఐదు రోజులో జరిగేది. ఒక్కో రోజు ఒక్కొక్కరి ఉభయం. ఒక రోజు బలిజ వాళ్ళది , ఒక రోజు గొల్ల వాళ్ళది , ఒక రోజు సాలె వాళ్ళది , కళ్యాణం రెడ్లది ఇలా అన్న మాట. ఉభయం ఎవరిదైతే ఆ రోజు దేవుడి అలంకరణ , అన్న ప్రసాదాలు , వినోదాల ఏర్పా...
March 27, 2020

ఉజ్జ్వల మైత్రి అనుబంధం కి నాంది!

మా సూరిని తీసుకు రావటం, వాడిని రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చటం మరియు వాడు కూడా బుద్ధిగా చికిత్సకు సహకరిస్తూ వుండడటంతో మా మిత్రబృందపు ఆత్మ విశ్వాసం ఇనుమడించింది, మనము కూడా అనుకున్నపనులు అనుకున్నట్టుగా సాధించగలం అని.

ఈ లోపల మాతో వాకాటిలో చదివిన ఇంకో మిత్రుని అమ్మగారికి శస్త్ర చికిత్స అవసరం అయ్యింది, మా వాడు కూడా ఉద్యోగం మారే సంధికాలంలో ఉండటంతో ఇన్సూరెన్స్ ద్వారా అందవలసిన సహాయం అందక పోవటముతో ఇబ్బందుల్లో పడిపోయాడు. ఈ విషయం తెలిసిన మా ప్రశాంత్ గాడు స్పందించి మా అనీల్గాడిని కార్యరంగంలోకి దిగమని ఆజ్ఞా...
March 27, 2020

గడ్డు కాలంలో నాతో నేను!

ఈ రోజు తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తుంటే మా ఇంజనీరింగ్ అయ్యాక మాకు లభించిన ఒక సంవత్సరం ఖాళీ మనకు చాలా జీవుతానుభవాలనే నేర్పించి ఉంటుందని అనిపించింది. ఈ మధ్య ఒక సినిమాలో చూశా డిగ్రీ అయ్యి బయటకి రాగానే నెక్స్ట్ ఏంటి అని ప్రతీ వాడూ అడిగేవాడే అని కథానాయకుడు బాధగా పాడుకొనే పాటని. మేము బయటకు రావటం అందరిలా కూడా రాలేదు కదా, మీరు మర్చిపోయారా, పరీక్షలు ఎగ్గొట్టి ఒక్క సంవత్సరం కాజేసుకొని వచ్చిన బ్యాచ్ మాది అని.

అసలు మాకీ పరిస్థితిఎందుకు వచ్చిందబ్బా అని కొంచెం వెనక్కి వెళ్లి ఆలోచిస్తే, ఎక్కడో మేము మా నాలుగవ సం...
March 27, 2020

మా పంచింగ్ ఫలక్ నామ!

నాకు రామ్ అని ఒక సహోద్యోగి ఉండేవారు చెన్నైలో. ఆయన సందర్భోచితంగా వేసే పంచ్ లు అంటే నాకు చాలా సరదా, కానీ ఎప్పుడు నా మీద ప్రయోగిస్తారేమో అని జాగ్రత్తతో ఉంటా. వాళ్ళ టీంలో ఒక నిష్ టెక్నాలజీల నైపుణ్యముండే పిల్లకాయలున్నారు. అదే నిపుణత వేరే కస్టమర్కి కూడా అవసరమయ్యింది. బయట ఎక్కడా దొరకటంలా. కావాల్సిన కస్టమర్ ఏమో ఎక్కేస్తున్నాడు. అలా రోజూ ఎక్కిచ్చుకోలేక ఆ కస్టమర్ కి పని చేసే ఇంకో మా మేనేజర్ నా దగ్గర కొచ్చి, హర్ష, ఆ రామ్ తో మాటలాడి కొంచెం ఆ పిల్లకాయలు హెల్ప్ తీసుకుందాము అన్నాడు. నేను సరే అని, ముందే రామ్ కి...
87
March 27, 2020

మా గిరిజక్క పిచ్చి చిట్టాలు!

"మా నాయన పేరు మీ పేరు ఒకటే, సుందర రామయ్య, అందుకే నిన్ను ఇక నుండి నాయనా అనే పిలుస్తాను" అంది మా పక్కింటి గిరిజక్క , మా నాన్నతో.

" సరేనమ్మా నువ్వు ఆర్డర్ వేసింతర్వాత , కాదనే ధైర్యం ఎవరికీ ఉందమ్మా" అన్నారు నాన్న.

మా నాన్న, కాట్రాక్టింగ్ పార్టనర్ అయిన గోవింద రెడ్డి అంకుల్ భార్య గిరిజక్క. ‘చండశాసన గండర గండి’ మాటల్లో మటుకు.

"ఏమే! మాధవీ, వాసవీ, ఇకనుంచీ, మా నాయిన్ని మీరు తాత అనే పిలవాలి, అర్థ మయ్యిందా" అంది తన కూతుళ్ళ వైపు.

వాళ్లిద్దరూ అయోమయంగా మొహం పెట్టారు, ఈయన్ని తాతా అని పిలవడం ఏంది? అనిచెప్పి.
...
March 27, 2020

ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా!

నేను ఎనభైయ్యవ దశకంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అనుకుంటా మా సంతపేటలోని తూకుమానుమిట్టలో రాత్రికి రాత్రే ఆరుముగం & కో అనే కుంపిణి అదిరిపోయే వ్యాపార ప్రణాళికతో వెలిసింది. "ఇందు మూలముగా అందరికి తెలియ చేయటమేమనగా మీరు గాని మా దగ్గరకు వచ్చి మా వస్తు పట్టికలో కనపడ్డ వస్తువును కనపడినట్టు ఆత్రముగా మూడవ వంతు ధర పెట్టి టిక్కు పెట్టుకుంటే మీకు ఆ వస్తువు రెండు నెలల్లో పువ్వుల్లో పెట్టి అప్పచెప్పబడును" అనే వాళ్ళ ప్రకటన సారాంశం నాకైతే అర్థం కాలా నాకు లెక్కలు రావు కాబట్టి.

మా నెల్లూరోళ్లు, లెక్కల్లో మహా ఘటికుల...
March 26, 2020

మా వాకాటి కథల్లో, సూరి గాడు!

సూర్య ప్రసాద్ మా మెకానికల్ ఇంజనీరింగ్ తరగతి సల్మాన్ ఖాన్. కానీ ఆ ఖాన్ కన్నా మంచి పొడగరి, ఎప్పడూ ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కళ కళ లాడుతూ ఉండేవాడు. వాడి ఆ పిచ్చిని ఎక్కువ చేస్తూ మా భార్గవ్ గాడు, ప్రశాంత గాడు మరియు మా అనీల్గాడులు తరగతిలో వాడి వెనక వరుసలో కూర్చొని, ఏ ఇండియా టుడే మ్యాగజిన్ లాటి వాటిని తెరిచి, వీడు వినేలా అబ్బా! ఈ మోడల్ చూడరా! అచ్చు వీడు మన సూరిగాడిలా వున్నాడురా అని వాళ్లలో వాళ్లే వీడికి కితాబులిచ్చేలా మాటలాడుకోవటం, వాడు ఆ మ్యాగజిన్ లో మోడల్స్ వుండే పేజీలను కత్తిరించుకొని, వాళ్ళలా తయ...
80
March 26, 2020

అప్పుడప్పుడూ 'ఉదయించే' మా సుడిగాడు

“బాస్, ఏ బ్రాంచ్ నీది”, అడి గాడు రామారావు, నన్ను, నేను మా హాస్టల్ మెస్సు లోకి ఎంటర్ కాంగానే.

“ఫౌండ్రి ఇంజనీరింగ్”

“అదేంటి బాస్, పోయి పోయి, ఆ బూజు పట్టిన బ్రాంచ్ తీసుకున్నావా?, ఇక్కడ మెకానికల్ వాళ్లకి మెషీన్ టూల్స్ బ్రాంచి అన్నిటికంటే బెస్టు. నేనదే తీసుకున్నా!”

నేను ఖరగ్పూర్లో పీజీ చేరిన ఐదు రోజుల్లోనే, నాకీ ఉపదేశం చేసిన పదో కృష్ణుడు – రామారావు.

ప్రొడక్షన్ ఇంజనీరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్లల్లో చేరిన ప్రతీ వాడూ నాకెదురైతే చెప్పేవాడు – “ఫౌండ్రి ఇంజనీరింగ్ ఓ బూజు పట్టిన కోర్స్” అని.
...
March 26, 2020

మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!

నేను ఏడవ తరగతి ఉత్తీర్ణుడను అయ్యాక, మా కుటుంబము ఉప్పలపాటి నుండి నెల్లూరికి వలస వచ్చేసింది. నెల్లూరిలో మా మకాం సంతపేటలో అని ముందే నిశ్చయించబడింది మా నాన్నగారి వ్యాపార భాగస్వాములు అప్పటికే అక్కడ నివసించే వారు అవటంతో.

సంతపేట లోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల అప్పుడు బాగా పేరుగాంచినది కావటంతో నన్ను అక్కడ మరియు మా అక్కను అమ్మగార్ల బడి అనబడే సెయింట్ జోసెఫ్ బడిలో వేయాలని మా వాళ్ళు నిర్ణయం చేసేసారు. మా అక్కకి ప్రవేశం సులువుగానే దొరికింది, అమ్మగార్ల బడి కేవలం అమ్మాయిల బడి కావటంతో.

నా ప్రవేశం అంత సులువుగ...
March 26, 2020

మా దేవళపు ఇసిత్రాలు!

నాకు ఈ మధ్యన మా ఉప్పలపాడు చాలా గుర్తుకొస్తోంది.

నాకు దిగులేసినప్పుడల్లా అలా గుర్తుకొస్తోంది, ఎందుకో!

నేను చిన్న చిన్న కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు నాకు తెలుసు నా ప్రెపంచం చాలా చిన్నదని.

నాకు తెల్సు, నేను, నా కుటుంబం, నా స్నేహితాలు లేక జీవితంలో నాతో పాటూ పరిగెట్టినోళ్లు, నన్నొదిలేసి ఎల్లిపొయ్యినోళ్లు, ఈళ్ల గురించే రాయగలనని.

అదేగాదు, నేను చూడలేని వాటి గురించి, చూడనోళ్ళ గురించి రాయలేనని.

అట్టా అనుకున్నప్పుడు, ఇవన్నీ గబా గబా రాసేస్తే, ఇంక రాయడానికి యింకేం మిగులుద్ది, అని అనిపిస్తే, ఆ దిగులింక...
March 26, 2020

నా మొదటి ప్రవాస జీవనానుభవం!

నా మొదటి ప్రవాస జీవితం దక్షిణాఫ్రికా లోని జోహనెస్బర్గ్ లో మొదలయ్యింది. ఆనాడు దక్షిణాఫ్రికా లో రెండు ప్రధాన బ్యాంకు సమూహాలుండెడివి, ఒకటి ఏ.బి.ఎస్.ఏ మరియు రెండవది నెడ్కోర్. నేను ఏ.బి.ఎస్.ఏ బ్యాంకు వాళ్ళ అసెట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లో పని చేసే వాడిని. మా బస మరియు రవాణా అంత మా కంపెనీ నే ఏర్పాటు చేసింది. జోహనెస్బర్గ్ కంతటికీ అందమైన సాండ్ టన్ అనే ప్రదేశంలో సాన్మారియో అనే గృహ సముదాయం లో. చాలా అందమైన దేశం దక్షిణాఫ్రికా, విశాలమైన రహదారులు, రహదారుల మీద ఖరీదైన బి.ఎం.డబ్ల్యూ లు బెంజులూ, ఫోల్క్స్ వాగెన్ లు, ఎక...
95
March 26, 2020

బెల్లంకొండ వెంకటేశ్వర్లు!

ఆరవ తరగతి మొదలయ్యి మూడు నెలలు అయ్యింది. ఆరు ఊర్ల కు కలిపి ఒక జెడ్.పి ఉన్నత పాఠశాల మా బడి. వేరు వేరు ఊర్ల నుండి వచ్చిన పిల్లకాయలందరమీ ఒకరికొకరు అప్పుడప్పుడే అలవాటు పడుతున్నాము

ఒక రోజు బడికి వచ్చేసరికి, మా తరగతిలోనే ఓ కొత్తమొహం కనిపించింది నాకు. మధ్యాహ్నమయ్యేసరికి ఆ వచ్చిన అబ్బాయి వివరాలు తెలిసి పోయాయి.

పేరు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు. అప్పటిదాకా బుచ్చి లో చదువులు వెలగబెట్టి,యీ రోజే మా బడిలో చేరాడు. వూరు మాత్రం మా వూరే, ఉప్పలపాడు.

వారం లోపులే సావాసం గాడు అయ్యాడు, వాడి కి తెలియని విద్యే లేదు. వాడ...
March 26, 2020

స్కై ల్యాబ్, మా గడ్డివాములో పడింది!

నా చిన్నతనపు ఇంకో కథ. మేము ఎక్కువ మా అమ్మమ్మా వాళ్ళ ఊరిలోనే గడిపేశాం చిన్న తనమంతా. మా ఇల్లు పెద్ద స్థలం లో ఆస్బెస్టాస్ రేకులు కప్పిన ఒకే ఒక్క పెద్ద గది, ముందు పంచ, పక్కన ఒక తాటి ఆకులు కప్పిన వంటగది. ఇంటికి కుడి పక్క పెద్ద బాదం చెట్టు వెనక ఒక ఉసిరిగి చెట్టు, ఎడమ పక్క పెద్ద స్థలం లో గడ్డి వాము, ఆ వాముకి ఆవల పెద్ద ఎరువు దిబ్బ. ఆ దిబ్బ నానుకొని ప్రహరీ, ప్రహరీకి ఆవల పంట పొలాలు. మా ప్రహరీకి పంట పొలాల మధ్య ఒక పంట కాలువ. ఒక రోజు మేము గడ్డి వామి మీద కెక్కి దిబ్బలోకి దూకుతూ ఆడుతున్నాం. అలా ఆడటంలో నాకు ఆ ద...
Talk to us!