Conversations on contemporary literature from across the world, in translation.
Harshaneeyam Podcast

Harsha's Stories Episodes

A collection of Telugu stories written by Harsha, showcasing unique narratives and local culture.
85
Aug. 3, 2020

తాత రాత

"చిన్నయ్య! ఈ రోజు నువ్వు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్లి రావాలి. నీతో పాటు, మీ అక్క, బావ, మా చిన్నమ్మ వస్తారు"

ఆ రోజు ఉదయమే, మా అన్న పెళ్లి అయ్యింది. మేము ఇవ్వాల్సిన రిసెప్షన్ కూడా అదే రోజు రాత్రి, పక్కరోజు వినాయక చవితి అవటం తో,

డిన్నర్ కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూసుకొని, సాయంత్రం నాలుగప్పుడు ఇంటికి చేరుకున్నా, వళ్ళంతా నొప్పులు , పులిసిపొయ్యినట్టుంది ఎడ తెగని తిరుగుళ్ల వల్ల.

కాస్త నడుము వాలుద్దామని ఇంటికొచ్చా, లేక పోతే వంట వాళ్ళ దగ్గరే సరిపోయుండేది నాకు ఆ సాయంత్రమంతా.

అంత అలసట లో కూడా, నాకు...
July 31, 2020

నేనెక్కాల్సిన బస్సు!

"అమ్మా ! ఎందుకమ్మా! ఎన్ని సార్లు నాన్న చెయ్యెత్తినా ఏ బస్సూ ఆగట్లేదు" ?

మిట్ట మధ్యాహ్నం పన్నెడున్నర . ఎండాకాలం . హైవే పక్కనే నిల్చొని వున్నాం నేను అమ్మా నాన్న.

“ ఇంక ఆగలేనమ్మా ఇంటికి పోదాం !, ఇంటికి పొయ్యి రాజయ్య తో ఆడుకుంటా!"

"లేదు చిన్నా! నీకు ఒంట్లో బాగ లేదు కదా , నెల్లూరు పొయ్యేసి డాక్టర్ దగ్గర మందు తెచ్చుకుందాం. నెల్లూళ్ళో బొమ్మల పుస్తకం కూడా కొనిస్తా ! బస్సొచ్చే లోపల , అక్కడ పొయ్యే గూడ్స్ రైలు కి ఎన్ని పెట్టెలో లెక్క పెట్టి చెప్పు, అమ్మకి"

అది ఇంటికెళ్లి పోదాం అనే నా గోల భరించలేక , మా ...
July 31, 2020

ప్రణవం ప్రణయం పరిణయం

చక్కగా టేపు వేసున్న కవర్ కొరియర్ లో వస్తే వెనక్కి తిప్పి చూశాను. పంపిన ఊరు అందరికీ తెలిసిన మదనపల్లె అయినా పంపివాయన పేరు నాకు తెలియని ఆనందరావు. ఆ ఊళ్ళో మనకు ఎవరూ పరిచయం లేరే అనుకుని వచ్చిన అడ్రస్ చూస్తే నా పేరు మీద కరెక్టుగానే ఉంది.

ఎవరబ్బా అనుకుంటూ జాగ్రత్తగా టేపులన్నీ దాటి కవర్ మెల్లగా తెరిస్తే లోపల ఒక ఫోటోలో బాటు ఏదో లెటర్ ఉంది. ఫోటోలో ఓ అమ్మాయి!! మస్తిష్కంలో ఏవేవో ఆలోచనలు. అలా చూస్తూ ఉండాలనిపించే అందం నన్ను ఓ తెలియని ఏకాంతానికి తీసుకెళ్ళింది.

ఇంతలో పక్కనే ఉన్న రెడ్డినాయుడు 'ఏందియ్యో' కధ అంట...
July 26, 2020

లీలా కాలనీ

తలుపులు దబదబా బాదుతున్న శబ్దం .

గడియారం చూస్కుంటే సాయంత్రం ఆరున్నర అయ్యింది..

డోర్ ఓపెన్ చేస్తే, బయట నిలబడున్నాడు నీటు గా డ్రెస్సు అయ్యి తన స్టాండర్డ్ నిశాచర వస్త్రాలు - బ్లాక్ జీన్సు, బ్లాక్ టీషర్ట్ లో రామకృష్ణ.

"మంచి నిద్ర పాడుచేశావ్ ! కొంపలేంమునిగాయనీ" ?

"బైకు తాళాలిస్తావా, ఇప్పటికే లేట్ అయిపోయింది." ?

తాళాలు ఇస్తూ చెప్పాను , " పొద్దున్నే ఫ్యాక్టరీ నించి వస్తూంటే రిజర్వు లోకి వచ్చింది , పెట్రోల్ చూసుకో" అని.

సమాధానం గూడ చెప్పకుండా తాళాలు తీస్కొని పరిగెత్తాడు రావకృష్ణ.

వెనకనించి అరిచాను...
July 25, 2020

పెద్దంతరం - చిన్నంతరం

"కొంచెం అన్నం పక్కన పెట్టుకొని అందులో పప్పు కలుపుకోండి!"

"ఆ! ఆ ! అంతా పప్పే కలిపేసుకున్నావ్, నేను కొంత అన్నము లోకే కలుపుకోమన్నానా!"

"కొంచెం అన్నం మిగుల్చుకుంటే అరటికాయ కూర వేద్దామనుకున్నా!"

"ఇంక ఇక రసం వేసుకొని, అరటికాయ కూర నంజుకో, ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకుందురు కానీ!"

నాకర్థమయ్యింది మా అమ్మ మా నాన్న కి భోజనం వడ్డిస్తుందని, కాదు, కాదు, ఏమి తినాలో ఎంత తినాలో ఓ బొమ్మరిల్లు భార్యలా ఆయన చేయి పట్టుకునే ఉందని.

"అమ్మా! ఆయన ఏమి తినాలో కూడా నువ్వే శాసిస్తే ఎలా? ఆయన అడగ గలరు గా ఏమి కావాలో అప్పుడు...
July 25, 2020

అర్థాంతర ప్రయాణాలు.

అమ్మ పొట్టలోనే ఇంకొన్ని రోజులు హాయిగా వుందామనుకున్న నన్ను, అలా ఉండటం కుదరదు అంటూ ఫోర్సెప్స్ లాటి పరికరాలు వాడి మరీ ఈ లోకం లోకి తీసుకొచ్చారు అమ్మ తో పని చేసే సహ డాక్టర్లు.

కళ్ళముందు, హాస్పిటల్ లో వాడే టూల్స్ కనిపించీ కనిపించక, శబ్దాలు వినిపించీ వినిపించక నా అయోమయంలో నేను ఉంటే, ఏవో మాటలు కూడా, "వీడు తెల్లగా బొద్దుగా భలేగున్నాడు అంటూ".

అలా ఓ నాలుగు చేతులు మారాక, "ఇంకా ఎన్ని చేతులు మారాలి రా నాయనా అనుకుంటూ, ఉన్న పళాన నాలుగు ఆవులింతలు అరువు తెచ్చేసుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నా".

ముప్పావు వంతు...
July 23, 2020

ఈ కథకి టైటిల్ పెట్టటం నా వల్ల కాదు!

నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని చేపట్టాము. అదేమియనగా మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి కొత్త డేటా బేస్ కి వలస యొనర్చటం. ఈ క్రమంలో మేమిద్దరం కలిసి ఒక ఇరవై లక్షల ఖాతాదారుల వివరాలలో దాదాపు ఒక లక్ష (అక్కడ లక్ష అనకూడదు, ఓ వంద వేలు అనాలి) ఖాతాదారుల వివరాలని కృష్ణార్పణం చేసేసాము. ఒక లక్షే ...
July 18, 2020

చిన్నీ వాళ్ళ చంద్రత్త!

"చిన్నీ ! నీ పెళ్ళికి చంద్రత్త వాళ్ళు రావట్లేదు, ఇందాక నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు, మావ ఫోన్ చేశారు, చంద్రత్త కి ఒంట్లో బాగాలేదు అనిచెప్పి" అన్నారు నాన్న.

"నా పెళ్ళికి చంద్రత్త లేకపోతే, ఎలా ! అయినా క్రితం వారమే కదా, మీరు ఢిల్లీ కి ఎదో పని మీద వెళ్లి , అత్తా వాళ్ళను చూసొచ్చింది. అప్పుడు బాగానే వుంది కదా అత్తకి ?" అడిగాను నేను నాన్నని.

నా ప్రశ్న కు ఏమీ సమాధానం చెప్పకుండా, నాన్న అమ్మ వైపు చూసారు.

అమ్మ చెప్పింది, "అత్తకి, నెక్ పెయిన్ వల్ల, బాగా ఇబ్బందిగా ఉంది, చిన్నీ! మాట్లాడితే ఇంకా ఎక్కువ అ...
July 15, 2020

దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే!

నిజామాబాద్ కి చెందిన నర్సింలూ కన్నా, నా సహోద్యోగి సీటెల్ లో ఒకప్పుడు. మనిషి చాల చలాకీగా, ఆరోగ్యంగా మరియు క్రీడాకారుల కుండే దేహదారుఢ్యంతో వుండే వాడు. కమా వాళ్ళు ఆడే సరదా క్రికెట్ కి, నాయకుడు కూడా. తనకి ఇద్దరు పిల్లలు - ఒక అమ్మాయీ మరియు ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మాయి మా చిన్నదానికన్నా వయస్సులో రెండు నెలలు చిన్న మరియు మా పెద్దదానికంటే పొడవులో రెండు అంగుళాలు మిన్న. మేము సహోద్యోగులము మరియు మా చిన్నది, వాళ్ళ పాప సహాధ్యాయులు అవటం మూలాన మేము క్రమం తప్పకుండా వారాంతరాలలో కలిసే వాళ్ళము.

అట్టి నర్సింలు చెప్పా ప...
July 12, 2020

నెల్లూరు ట్రంక్ రోడ్డు నందలి నా 'జాతక' కథ!

ఆ రోజు, ఒంగోల్లో ఏదో పెళ్లి ఉందని, వారం రోజులు కని, మా ఆవిడ బయలు దేరుతూంటే, ఆవిణ్ణి, రైలు ఎక్కించి, ట్రంకు రోడ్డుకొచ్చాను.

మా రోజు వారీ సమావేశానికి నేను ఓ అరగంట లేటు.

అప్పటికే, మా వాళ్ళు, విశ్వనాధం, సుబ్బారాయుడు, వెంకటరామన్ సర్, ట్రంకు రోడ్డు, సదాశివ మెడికల్ హాల్ మెట్ల మీద, చేరి పోయి వున్నారు.

మా విశ్వనాధం ఎదో విషయం సీరియస్ గా చెపుతూంటే, వెంకట రామన్ గారు, సుబ్బారాయుడు ఆసక్తిగా వింటున్నారు.

నేను రావడం చూసి మా విశ్వనాథం సడన్ గా మాట్లాడ్డం ఆపేసాడు.

"ఏవయ్యింది" అడిగాన్నేను విశ్వనాధాన్ని.

సమాధా...
July 8, 2020

నేను, నా ఉషాయణం!

ఈ మధ్య ఒక కథ చదివా, అది అచ్చు నా కథే, నా కథే కాదు మీ అందరి కథే. ఆ కథ ప్రేరణతోనే ఈ కథ చెబుతున్నా. నేను మరియు ఉషా, ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ క్లాస్ మేట్స్. బాగా తెల్లగా, చలాగ్గా అచ్చు మన హీరోయిన్ జయప్రదకు నకలుగా ఉంటుంది ఉష. స్కూల్ మరియు ట్యూషన్ లో పక్క పక్కనే కూర్చోవాల్సిందే. హోమ్ వర్క్ సబ్మిట్ చేసినా ఆ పిల్ల పలక మీద మన పలక లేక ఆ పిల్ల నోట్స్ మీద మన నోట్స్ ఉండాల్సిందే, పక్క వాళ్ళవి తోసేసి అయినా. స్కూల్ నుండి రావటం, స్నానం చేయటం, తెల్లగా పౌడర్ కొట్టడం, మా అక్కని మా అమ్మని ఒకటే ఊదరకొట్టటం నేను...
July 7, 2020

పాపం, మా సీన మావ!

నేను ఆ రోజు బడి నుండి వచ్చేసరికి ముసునూరి నుండి మా సీన మామ వచ్చున్నాడు. ఈ సీన మామ వస్తే ఆయన వెంట పడి వూరు మీద లేక పోతే గుంజి పళ్లకోసమో లేక టేకు పళ్ళ కోసమో మా ఊరి హై వే కి ఆనుకొని వున్న చిట్టడవుల వెంట పడి బలాదూర్ తిరగటం నాకు చాలా ఇష్టం.

అలా వూరి మీద పడి తిరిగే మా సీన మామని కనపడ్డోళ్లంతా ఆపి, అబ్బయ్య నువ్వు మా బాబయ్య కొడుకువి కదా, ఎప్పుడొచ్చినావు అంటూ తెగ పలకరిచ్చే వాళ్ళు. ఊర్లో పడి తిరిగే నాకు యింత గుర్తింపు ఎప్పుడొస్తాడబ్బా అని నాకు భలే దిగులేసి పోతావుండేది. కానీ ఈ సీన మామని బాబ మామ కొడుగ్గానే ...
July 5, 2020

మా ఉలవపాళ్ళ స్వామి!

నాకు ఐదేళ్ల వయస్సులో మా ఉలవపాళ్ళలో, మామిడేళ్ల కిష్ట, అక్కిశెట్టి శేషగిరి మరియు మా వూరి పూజారి కొడుకైన స్వామి అనే ముగ్గురు స్నేహితులు వుండేవాళ్ళు. మా ఆటలు, పాటలు మరియు తిరుగుళ్ళు అన్నీ కలిసే ఉండేవి. వీటిల్తో పాటు మాకు ఇంకో ముఖ్యమైన రోజువారీ, లేక రోజుకు పలుమార్లు వుండే కార్యక్రమం ఉండేది. అదేమిటంటే తిన్నది అరిగాక, వూరికి వెనకాల వుండే చెరువు దగ్గరకో, లేక వూరికి ముందు వుండే వాగు దగ్గరకో వెళ్లి అరగక మిగిలినదాన్ని దించుకొని రావటం.

మా నలుగురి మధ్య వుండే ఒప్పందమేమిటంటే, మాలో ఎవరికీ ఆ అవసరముంటే, మిగతా ము...
July 2, 2020

నవ్వితే నవ్వండి

హర్షణీయం మొదలు పెట్టి 3 మాసాలు అయ్యింది. ఈ కొద్దికాలంలోనే ఐదు వేల మంది పాఠకులు మా బ్లాగ్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా 'హర్షాతిధ్యం' అనే కొత్త శీర్షిక మేము మొదలుపెడ్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశ్యం, తెలుగు బ్లాగ్ ప్రపంచంలో వుండే చక్కటి కథల్ని, హర్షణీయం పాఠకులకు ప్రతి నెలా మొదటి వారంలో పరిచయం చెయ్యడం.

ఈ శీర్షికన, మా ప్రథమ అతిధి గా విచ్చేసిన , శ్రీయుతులు బులుసు సుబ్రహ్మణ్యం గారి మా హార్దిక స్వాగతం. ఆయన రాసిన ' వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి' అనే హాస్య రచన తెలుగు బ్లాగ్ ప్రపంచపు అభిమానులకు...
June 29, 2020

మనసున్న మారాజు!

నాకు మా నెల్లూరులోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి లోనే దొరికిన మరో స్నేహ సుమనుడు లక్ష్మిపతి రాజు. సూటిగా సుత్తిలేకుండా మాటలాడటం వీడి నైజం. అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఆశించి భంగపడతాడు. అలా భంగపడినప్పుడు ఒక అపరిచితుడిలా వీడికి తెలియకుండానే గోదావరి జిల్లా వెటకారపు రాజు బయటకొచ్చేస్తాడు వీడి నుండి. అందుకే వీడు మా బడి యొక్క యాంగ్రీ బాయ్.

మా బడికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వుండే నవాబ్ పేట నుండి సైకిల్ తొక్కు కుంటూ వచ్చే అలసట వలన కలిగే చిరాకుతో కోపమే లక్షణంగా వుండే వాడు. కానీ వాడి...
June 23, 2020

మా స్నేహ రమణీయం!

మా ప్రభుత్వ ఉన్నత ఆదర్శ పాఠశాల యిచ్చిన సన్నిహిత మిత్రులలో మా రమణుడు ముందు వరుసలో ఉంటాడు. బిక్కు బిక్కు మంటూ ఎనిమిదవ తరగతి బి-సెక్షన్ లో చేరిన నన్ను వీడు వెంటనే ఆదరించాడు. ఆ రోజుల్లో మా స్నేహాలు మొదట మనిషి గుణ గణాలని బట్టి కాక వారికొచ్చిన మార్కులను బట్టి మొదలయ్యేవి, అటు పిమ్మట కొంత కాలానికి స్నేహాలు స్థిర మవ్వటమో లేక ఒడిదుడుకులకు లోనవ్వటమో జరిగేవి.

వీడు ఏడవ తరగతిలో ద్వితీయ స్థానంలో వచ్చినా, ప్రధమ స్థానములో వున్న మల్లిగాడికి వీడికి మార్కుల లో తేడా ఓ వంద మార్కులకు పైనే. అప్పటి వరకు మా మల్లిగాడు ఎద...
June 10, 2020

మా నెల్లూరోళ్ల కథలు కంచికి చేరవబ్బా!

ఓడమ్మా భడవా ఐదు నిమిషాల్లో నెల్లూరుని కళ్ళకు కట్టినట్టు విన్పించావు కదరా సామి, అన్నారు మా నెల్లూరోళ్లు వాళ్ళ కథవిని. కొందరైతే నేను ఏమేమి కవర్ చేయలేదో వాటిల్ని అన్నిటిని రాసి పంపించారు, అబ్బయ్య అసలు నీవు ఈటిల్ని ఎట్టా మర్చిపోయినావు అని. సో బాహుబలి పార్ట్ 2 మాదిరి మన నెల్లూరోళ్లు పార్ట్ 2 తయారు చేశా.

మొదలుగా గుర్తు చేసుకోవాల్సింది కమ్యూనిజంకి అసలు సిసలు అర్థం చెప్పి జనాల సేవే, జనార్థన సేవ అనుకొని మనకి సేవలు చేసిన రామచంద్రా రెడ్డి ఆసుపత్రి మన నెల్లూరికే కాదు రాష్ట్రానికే గర్వకారణం.

అట్టానే జమీన్ ...
June 5, 2020

మా ఇంట్లో ప్రజాస్వామ్యం పని చేయలేదు!

చేతిలో ఓ పది రూపాయలు ఆడినప్పుడు, మా అమ్మ అడిగేది మా ముగ్గురిని, ఈ రోజు ఏమన్నా తింటానికి చేసుకుందాం, మీ ఇష్టప్రకారం ఏమి చేయాలో మీరే తేల్చుకోండి అని.

వెంటనే మా అన్న, "నాకు గులాబీ జామున్ కావాలి", అనే వాడు. మా అక్క పాపం కొంచెం తక్కువ ఆశ కలది అయ్యి, "నాకు మినప వడలు మరియు పులుసు అన్నం కావాలి", అనే కోరిక వెలి బుచ్చెడిది.

మరి నేను తక్కువ తిన్నానా, "ఊహు! నాకు ఖచ్చితం గా సుకీ లు కావాలి" అనే వాడిని.

మా అమ్మ సర్ది చెప్ప బోయెడిది, పోనీ లేరా వాడు ఇంటికి పెద్ద వాడు ఈసారికి వాడు అడిగినట్టే చేద్దాము అని, దాని...
June 3, 2020

ఇసుకే బంగారమాయెనా !

మనకి రామాయణ మహాభారత కథలు చెబుతూ మన పెద్దలు కొన్ని పిట్ట కథలు చెప్పేవారు. ఈ పిట్ట కథలు చాలా వరకు గ్రంధస్తం అవ్వవు మరియు ఇవి చాలా వరకు ప్రాదేశికాలు (లోకలైజ్డ్ అని నా ఉద్దేశ్యం). మా తెలుగు అయ్యవారు చెప్పిన చాలా పిట్ట కథల్లో నాకు చాలా ఇష్టమైన కథ ఇది.

యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేసి అనంత మైన సంపదను ప్రోగు చేసుకున్న తర్వాత ఆయనకీ ఒక ఆలోచన వచ్చిందట. వెంటనే బావ శ్రీకృష్ణుడు తో పంచుకున్నాడట, 'కృష్ణా !, నేను మరియు నా తమ్ములం సకల రాజులను జయించాము, ఇంత సంపదను పోగేసాం, మేము ఒక సూతుడు మరియు ఒక సామంత రాజు అయిన, ...
May 25, 2020

ఆవూ, దూడా చేలోనే మేస్తున్నాయి, మాలాగా !

చెన్నై లో నివసించే వాళ్ళము మేము 2009 వ సంవత్సరములో. పిల్లలిద్దరూ వెళ్ళాచ్చేరీ లోని నవదిశ మాంటిస్సోరి స్కూల్ లో ఏడూ మరియు ఐదవ తరగతుల్లో చేరారు. ఆరు నెలలు గడిచాకా మా చిన్నది వాళ్ళ తరగతిలో రెండు సమూహాలు ఉన్నాయనీ, ఆ రెండు సమూహాలకి ఎప్పుడూ పడదని, ఒకరు ఎడ్డెము అంటే ఇంకొకరు తెడ్డెమని చెప్పటం మొదలెట్టింది.

కొన్ని రోజుల తర్వాత యీ రెండు సమూహాల మధ్య తనే సమన్వయ కర్తనని, ఆ మరి కొన్ని రోజుల తర్వాత తాను లేక పోతే ఆ సమూహాలు కొట్టుకొనేస్తారు అని డప్పులు కొట్టుకోవటం మొదలెట్టింది. రోజు వినే వాడిని అడిగి తెలుసు కొన...
May 22, 2020

నా కూతుర్ల, భావప్రకటన!

నా పెద్ద కూతురు అమృత, చిన్ననాటి నుండి తనలోని ఆలోచనలు చాలా స్పష్టంగ వ్యక్త పరిచేది. మా స్నేహితుడు గిరిగాడి భాషలో చెప్పాలంటే భావవ్యక్తీకరణ మరియు భావప్రకటన. తన మూడవ ఏటనే మేము తనని డెన్వర్ కి కొనిపోయాము.

దానికి అప్పుడు చేపలు అంటే చాల ఇష్టం, పెంచటం కాదు సుమా. ఒక రోజు మేము తనని తీసుకొని చైనీస్ మార్కెట్ కి వెళ్ళాము. అక్కడ మంచి మంచి తిలాపియా చేపల బ్రతికున్నవే దొరుకుతాయి. వాటిల్ని పెద్ద పెద్ద గాజు తొట్టెల్లో వేసి ఉంచి, మనం ఎన్నుకున్నవాటిని తీసి ముక్కలుగా కొట్టి ఇస్తారు. అమృత ఆ చేపల్ని తొట్టెల్లో ఈదుతూ ఉ...
May 21, 2020

మనోభావాలు దెబ్బ తీసిన ఐదేళ్ల అమృత!

మేము డెన్వర్ లో వున్నరోజులు అవి. ఒకరోజు నేను ఆఫీసులో ఉండగా అమృత వాళ్ళ ఉపాధ్యాయురాలి నుండి ఫోన్ వచ్చింది, వచ్చి వెంటనే కలవమని. ఆవిడని అడిగాను నేను మరుసటి రోజు వచ్చి కలవవచ్చా అని, దానికావిడ ఈరోజే వచ్చి కలిస్తే మంచిదని చెప్పటం తో ఆఫీసు నుండి బయలుదేరాను. దారిలో ఎన్నో ఆలోచనలు, అమృతాని ఉదయమేమన్నా అరిచానా? అదేమన్నా బడికి వెళ్లి మా నాన్న అరిచాడు ఈరోజు అని వాళ్ళ ఉపాధ్యాయురాలికి చెప్పిందా అని?

సుప్రియాకి కూడా ఫోన్ చేసి అడిగాను, తనేమన్న అన్నదా అమృతాని ఈరోజు కానీ లేక గత రోజుల క్రితం గాని అని? అసలే ఈ అమెరిక...
May 18, 2020

మా బడి మిత్రుని కబుర్లు!

నా కథలు ఎక్కువగా నా బాల్యము, స్నేహితులు మరియు కుటుంబము ఇతివృత్తము గా సాగుతుంటాయి. ఈ మధ్య ఎక్కువగా కాలేజీ స్నేహితుల గురించే సాగ దీసి మిమ్మల్ని విసిగించాను. ఈ సారి మార్పుగా నా చిన్న నాటి స్నేహితుడి గురుంచి రాయాలనుకుంటున్నాను. వాడు ప్రస్తుతము అమెరికా సంయుక్త రాష్ట్రము లోని ఉత్తర కరోలినా లో ఉద్యోగపర్వం వెలగపెడుతున్నాడు

పేరు దాడి ప్రతాప్. ఏ కొత్త విషయం కనిపించినా నేర్చుకోవడానికి వాటి మీదకి దాడి చేసేస్తాడు. మా అమ్మ, మా పెద్దమ్మ కూతురైన మా బాడుగ అక్క మరియు ప్రతాప్ వాళ్ళ అమ్మ గార్లు కావలిలో పి.యూ.సి చద...
May 17, 2020

మరవ కూడని వారు!

నేను మన సూరి కథ రాశాక, ఇప్పుడల్లా అనారోగ్యాల మీద రాయకూడదు అని అనుకున్నా, కానీ ఆ నియమం వెంటనే పక్కన పెట్టి ఈ కథ రాస్తున్నా. ఎందుకు రాశానో ఈ కథ చివరలో రెండు మాటలుగా చెప్పాలనుకున్నా.

నేను 2012 న ఉద్యోగ నిమిత్తం చెన్నై నుండి హైద్రాబాదుకు బదిలీ అయ్యాను. ఇంకా విద్యాసంవత్సరం పూర్తి కాకపోవటంతో కుటుంబం చెన్నై లోనే ఉండిపోయింది. నా మకాం మా అన్న దగ్గర. ఏవో సెలవులు ఉండటంతో సుప్రియ, పిల్లలు మరియు అమ్మ కూడా హైదరాబాద్ వచ్చి వున్నారు.

ఒక శనివారం ఉదయం లేచి, మా అన్నా వాళ్ళ బాల్కనీలో వేప చెట్టు నీడలో కూర్చొని పేప...
Talk to us!