Harsha's Stories Episodes
A collection of Telugu stories written by Harsha, showcasing unique narratives and local culture.
201
June 18, 2021
సిక్స్ ప్యాక్ అనబడే నా కౌపీనం : హర్ష
అబ్బా నా చేతిలో సైకిల్ వుంటే, పొట్ట యిలా పెరిగిపోయేనా, రాకుండా ఆగున్న సిక్స్ ప్యాక్ ఈ పాటికి వచ్చి పొడి పొయ్యేనా , అని జోరీగలా పోరగా పోరగా, యిక వీడిని యిలా ఉపేక్షిస్తే కందిరీగలా కుడతాడు అని డిసైడ్ అయ్యి ఓ నెల కిందట మా ఆవిడ నాకు ఓ పదమూడు వేలు పెట్టి ఓ హైబ్రిడ్ సైకిల్ కొనిచ్చింది. అదే చేతితో, ఒక బెల్, గాలి కొట్టుకొనే పంప్, మెత్తగా వుండే సీట్, అలాగే రాత్రిళ్ళు కూడా తొక్కేస్తా అనే ఉత్సాహం చూపి, ఒక నైట్ లాంప్, రెండు రిఫ్లెక్టర్స్ కూడా కొనిపిచ్చేసుకున్నా.
మా ఆవిడ తరవాత రోజు ఆ సైకిల్ కి పసుపు పూసి, కు...

197
June 3, 2021
'పేరులోనేమున్నది' - హర్ష
"రేయ్! గిరి బావా! నువ్వూ, మీ తమ్ముడు వంశీ గాడు దేవళం దగ్గరకు రండిరా, ఆడుకుందాం" అని కేక వేశా నేను.
మా బ్యాచ్ లో ఏ రోజు ఏ ఆట ఆడాలో డిసైడ్ చేసేది వాడే. ఒక్కో రోజు గుడ్లు ఆట లేక గోళీలాట, లేక బొంగరాలాట, లేక కుందుడు గుమ్మ, పల్లంచి ఇవన్నీ కుదరక పోతే ఒక గదికి అంతా దుప్పట్లు కట్టేసి చీకటి చేసేసి బూతద్దం ఉపయోగించి ఫిలిం గోడమీద ఫోకస్ చేసి చూడటం. ఈ ఆటలకి పిల్లకాయల్ని తోలుకురావటం, పనిలో పనిగా పెద్దోళ్ల చేత అక్షింతలు వేయించుకోవటం మా ఇద్దరికీ అలవాటే.
"ఈ రోజు ఉప్పు ఆట ఆడుకుందాం రా కిరణు! నేను రఘు గాడిని వాడి...

195
May 28, 2021
'బ్లూ అంబ్రెల్లా'
పిల్లల సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఇరవై ఐదు , ఎంపిక చేసి , వాటి కథలను పరిచయం చేస్తూ ' పిల్లల సినిమా కథలు ' అనే ఒక పుస్తకం రాసి ప్రచురించారు రచయిత అనిల్ బత్తుల.
ఈ పుస్తకంనించి, 'బ్లూ అంబ్రెల్లా' అనే సినిమా కథా పరిచయాన్ని మీరు ఈ ఎపిసోడ్లో వింటారు.
'Blue Umbrella' కథకు రచయిత శ్రీ రస్కిన్ బాండ్.
అనిల్ గారు రాసిన పిల్లల సినిమా పుస్తకం కొనాలంటే ఈ లింక్ ని ఉపయోగించండి. :
http://bit.ly/anilbattulapillalacinemakathalu
భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోని ఒక గ్రామంలో 9 యేళ్ల బ...

189
May 14, 2021
'జెన్' - పతంజలి శాస్త్రి గారు
రిటైరై, కొడుకూ కోడలితో జీవించే నాయుడు గారు. వృత్తి రీత్యా ఒక మెకానిక్. చుట్టూ వుండే ప్రపంచాన్ని ఆశావహ దృక్పధంతో చూస్తూ, ఓపిగ్గా, చుట్టూవుండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ, జీవించడాన్ని ఇష్టపడతారు.
ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం వుండే ఆయన కొడుకు కృష్ణ , తన జీవితంలో వుండే అసంతృప్తిని వస్తువులపై చూపించడమే కాక , తన భార్యను కూడా వాటి గాటన కట్టేసే మనిషి.
కథలోవుండే ఇంకో ముఖ్యపాత్ర ‘అమ్మతల్లి’ - స్నేహితుడు పనికి రాదని పారేస్తూంటే నాయుడుగారు అతన్ని ఆపి తన ఇంటికి తెచ్చుకున్న, పాడుబడ్డ ఒక మెషీను...

188
May 14, 2021
Part - ii : సంపెంగ పువ్వు - గోపీచంద్ గారు.
కొంచెం సేపయిన తర్వాత ఆమె ఒక్క నిట్టూర్పు విడిచి ఇలా అంది. “మీ ఊరు చాలా వెనకబడి ఉందండీ!”
నాకేమీ తోచక, “శాస్త్రి కూడా వస్తే బాగుండేది” అన్నాను.
ఆమె ఒక క్షణం ఆగి, “చాలా వెనకబడి ఉంది” అతని తనలో తాను అనుకుంటున్నట్లు అన్నది.
“లేకపోతే బొంబాయి ఉన్నట్లు ఉండమంటే ఎట్లా ఉంటుంది!” అన్నాను.
“ఊరు సంగతి కాదు. మనుషుల సంగతి. నేను వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. మీరు మాంధాత కాలంలో ఉన్నారు. అబ్బా, మీ ఊళ్ళో ఎలా బ్రతుకుతున్నారో. ఒకరితో మాట్లాడితే యింకొకరికి కోపం, అందరితో మాట్లాడితే అందరికీ కోపమే! దీన్నే ఈర్ష్య అంట...

187
May 5, 2021
Part - I : సంపెంగ పువ్వు - గోపీచంద్ గారు.
‘సంపెంగ పువ్వు’ గోపీచంద్ గారు రాసిన కథ . 1971 వ సంవత్సరం, జనవరి నెల యువ మాస పత్రిక లో ప్రచురింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.
ఈ కథను మీకు అందించదానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు.
ముందుగా, రజని గారు గోపీచంద్ గారి గురించి , ఈ కథ గురించీ మాట్లాడతారు.
హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana...

186
May 5, 2021
part ii - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన
ఆగదిలో యింకోవస్తువేదో ఉన్నట్టు రావుగారికి కనిపించింది. తెరచిన తలుపులోనుంచి లోపలికేదో ప్రవేశించినట్లుగా, చేతిలో దీపం వెలిగించి ఆయన ఆవేపు చూశారు. ముష్టి ఆమె గజగజ వణకుతూ నీరు కారుతూ వొకమూల నిలబడివుంది. ఆమె తడివెంట్రుకలు ముఖాన్నీ చెక్కులనీ అంటుకున్నాయి. వాటివెంట నీరు కారుతోంది.
‘బాబుగారు! తలుపు ముయ్యలేదే! కొంచెం వెచ్చగా వుంటుంది’ అంది ఆమె గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలులయ్యారు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియవేశారు. కాని గాలి ఒక్కసా...

185
May 5, 2021
part I - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘గాలివాన ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి పొందింది.
పుస్తకం కొనడానికి కావాల్సిన web link
Palagummi Padmaraju Rachanalu -Vol1
కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు.
ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.
హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaa...

176
April 10, 2021
పార్ట్ 2 - 'చిట్టి తల్లి' - పాలగుమ్మి పద్మరాజు గారి రచన
అతనికి మెలకువ వచ్చేసరికి పెట్టి తలుపు తెరిచుంది. అవతల పొద్దుటి కనుచీకటిలో కంటి కలవాటుపడ్డ పట్నం దృశ్యాలు మసగ్గా కనబడ్డాయి. గుమ్మంలో సందేహిస్తూ నిలబడ్డాడు ఇంటి నౌకరు, దొర. ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు దక్షిణామూర్తి. దొర పక్క చుట్టేస్తూ అన్నాడు.
“చిన్న శెట్టియా రొచ్చారు సార్.”
“ఎక్కడికీ?”
“ప్లాట్ఫారం మీదున్నారు సార్.”
ఒకసారి బాత్ రూములోకి వెళ్ళి ముఖం చన్నీళ్ళతో కడిగి తుడుచుకున్నాడు. తల దువ్వుకున్నాడు. దొర తెచ్చిన కాఫీ తాగాడు.
ఈలోగా దొర, సామానంతా కూలీచేత మోయించుకుపోయాడు.
ఆ తరువాత అతను పెట్టెలోంచి...

175
April 9, 2021
పార్ట్ 1 - 'చిట్టి తల్లి' - పాలగుమ్మి పద్మరాజు గారి రచన
న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘చిట్టి తల్లి’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది .
పుస్తకం కొనడానికి కావాల్సిన web link
Palagummi Padmaraju Rachanalu -Vol1
కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. కథను రెండు భాగాలుగా ఆడియో చెయ్యడం జరిగింది, నిడివి ఎక్కువ కావడం వల్ల .
ఎపిసోడ్లో ముందుగా వారి తండ్రి గారి గురించీ , కథ గురించీ పాలగుమ్మి సీత గార...

165
March 20, 2021
Part ii - 'జాన్ పాల్ చేసిన బీరువా కథ'
ఈ'జాన్ పాల్ చేసిన బీరువా కథ', తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది.
ఈ కథను అరసం వారు ప్రచురించిన 'ఆర్.వసుంధరాదేవి కథలు' అనే పుస్తకంలో చదవొచ్చు.
ఈ పుస్తకం కొనాలంటే - https://www.anandbooks.com/R-Vasundhara-Devi
“టేపులో నీ పాట తీసేసి కొత్త పాట, జానీ మేరా నామ్ లోది. మంచిది పెట్టేశాడు. అన్న..." పాప చెప్పింది.
గబగబా ముందు హాల్లోక...

164
March 19, 2021
Part I - 'జాన్ పాల్ చేసిన బీరువా కథ'
మనం చాలా ప్రేమించే మనుషులు మనకు దూరం అయితే, అస్తిత్వానికి అర్థం లేకుండా పోయినట్టు అన్పిస్తుంది. చుట్టూ వున్న ప్రపంచం అర్థరహితంగా అనిపిస్తుంది. సుప్రసిద్ధ రచయిత్రి వసుంధరాదేవి రాసిన ఈ'జాన్ పాల్ చేసిన బీరువా కథ', తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది.
ఈ కథను అరసం వారు ప్రచురించిన 'ఆర్.వసుంధరాదేవి కథలు' అనే పుస్తకంలో చదవొచ్చు.
ము...

161
March 13, 2021
'ద్రణేవుడు' పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథ
హర్షణీయంలో మీరు వినబోతున్న కథ పేరు 'ద్రణేవుడు ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన వేలూరి కౌండిన్య గారికి కృతజ్ఞతలు.
ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన సుబ్బరామయ్య గారు , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా.
1938 సంవత్సరంలో గుంటూరు లో జన్మించిన ఆయన తన జీవిత కాలంలో 350కి పైగా కథలు , 8 నవలలు రాసారు. ఆయన రచన...

158
March 6, 2021
హర్ష రాసిన ‘ఎండమావి’ – 'సారంగ' పత్రిక నుంచి!
ఈ కథ ‘ ఎండమావి’ హర్ష రాసింది , సారంగ’ వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితమైంది.
కథ చదవడానికి – https://magazine.saarangabooks.com/%e0%b0%8e%e0%b0%82%e0%b0%a1%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf/
‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)
హర్షణీయం కు సబ్ స్క్రైబ్ చెయ్యడానికి...

134
Jan. 2, 2021
గ్యాపకాలు
"భలే గట్టోడు రా మీ రాం మావ, అటెండన్స్ తక్కువయిందని ఎఫ్.ఏ ఆఖరి పరీక్షలకు కూర్చోనివ్వలా ఆయన్ని ! అప్పుడు సంవత్సరం పాటు తాత తో పాటే ఉండి, గొడ్ల పేడ ఎత్తడం నుంచి కోతల దాకా పనులన్నీ బ్రెమ్మాండంగా నేర్చుకొని, మళ్ళీ ఎఫ్.ఏ పరీక్షలు రాస్తా, ఏ.జీ.బీ.ఎస్.సి చదువుకుంటా అని తాతని ఒప్పిచ్చి, మళ్ళీ పరీక్షకు కూర్చొని పాస్ అయ్యాడు.
లెక్కల గ్రూప్లో వాడు, ఏ.జీ.బి.ఎస్.సీ ఎట్టా చదవతావురా అని జనాలందరూ నవ్వితే, కాలేజీ వాళ్ళని ఒప్పించుకొని మరీ బాపట్ల కాలేజీ లో చేరాడు.
మీ పెద్దమ్మ లిద్దరి కంటే గూడా నేనంటేనే ఇది.నాక్కొ...

120
Nov. 14, 2020
మా బస్సు భాగోతాలు
"ఒరే ఎంకా ! యెందాకరా ఒకటే లగెత్తుతుండావు?"
"ఉండరా! సుబ్బా! పడవెళ్లి పోతుందిరా! నేను నీతో యవ్వారం పెట్టుకుంటే కుదరదు. గెండారం దాకా పోవాలా" అంటూ ఎంకడు హడావిడి పడిపోతాడు.
"మా ఉప్పలపాటి గురుంచి ఏమన్నా మీకు ఉప్పు వుండి వుంటే మీరే తెగ ఆశ్చర్య పోవాల! ఉప్పలపాటి కి గెండారానికి మధ్య పిల్లకాల్వ కూడా లేదు, ఈ ఎంకడు ఎలా పడవెక్కుతాడు అని"
అయితే మీకు బొత్తిగా మా ఉప్పలపాటి వాళ్ళ ఎకసెక్కాలు బొత్తిగా తెలీవన్న మాట.
ముందు వెనక కర్వ్డ్ రూఫ్ తో ఒక ఇన్వర్టెడ్ పడవలాగా వుండే బస్సుకు మా వాళ్ళెట్టుకున్న ముద్దు పేరు.
అ...

108
Oct. 23, 2020
జన జీవన స్రవంతి
జన జీవన స్రవంతి :
చీకటి ఊరిని, నెమ్మదిగా కమ్ముకోడం కనిపిస్తోంది, కిటికీలోంచి చూస్తే.
దూరాన కనపడే మావిడి తోటల వెనకాల్నించీ సూర్యుడు ఎవరో తరుముతున్నట్టు హడావిడిగా కిందికి దిగిపోతున్నాడు .
చదూతున్న పాత ఆంధ్రభూమి మూసి పక్కన పడేసా నేను . మిద్దె మీద గదిలో కూర్చోనున్నా.
అమ్మమ్మ వాళ్ళ వూరు, పమిడిపాడు కొచ్చి రెండు రోజులైంది.
ఎంసెట్ రాసి రిసల్ట్ కోసం వెయిటింగ్. పన్నెండు మైళ్ళు పమిడిపాడు గుంటూరుకి.
మా అమ్మ ఏకైక తమ్ముడు, గంగాధరం మావ, ఆయన భార్య రాజత్త , అమ్మమ్మ వుంటారు ఇక్కడ.
నేను వొచ్చిన రోజు సాయంకాల...

97
Sept. 20, 2020
మా ఐ.టి వాళ్ళు కొండను తవ్వారు, ఎలుకను పట్టారు!
"ఎవరక్కడా!" అని కోపంగా అరిచాడు మహారాజు.
"తమరి ఆజ్ఞ మహారాజా" అంటూ గజ గజలాడుతూ వచ్చాడు, అంతరంగ రక్షకుడు అయిన భద్రుడు.
"నా రాజ్యం లో, నా రాకుమారుడి కి భోజనం లో ఎండు చేప అందలేదు. మేము దీన్ని ఎంత మాత్రమూ సహింప జాలము. నా దృష్టిలో ఇది ఒక అత్యయిక ఘటన. వెంటనే మన సర్వ సైన్యాధ్యక్షుల వారైన రామానుజాన్నీ మూలకారణాన్ని శోధించి, నివారణోపాయాన్ని పంపమనండి"
"చిత్తం మహారాజా" అంటూ అక్కడనుండి నిష్క్రమించి, సర్వ సైన్యాధ్యక్షుల వారి భవనానికి వచ్చి రామానుజాన్ని నిద్ర లేపాడు భద్రుడు.
"ఏమయ్యింది రా! భద్రా" అన్నాడు రామ...

94
Sept. 13, 2020
సాబువ్వ
సాబువ్వ
మబ్బులు కమ్మిన ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న వరదయ్యను చూసి "ఏందయ్యా.. పైన మోడం గట్టిందెప్పుడూ సూళ్ళేదా" అని భార్య భూదేవమ్మ నవ్వుతోంది.
"కాదే దేవమ్మా .. ఎప్పుడూ ఓ సుక్క గూడా రాల్చని మబ్బులు గూళ్ళు గూళ్ళుగా ఔపిస్తూ ఎందుకే ఆశల్లేపుతాయి.. మనం గూడా మనుసులమే కదా!! ఓ రెండు సినుకులు రాలిస్తే పైన నీళ్ళు ఆవిరైపోతాయా" అని దేవమ్మను చూసి అంటూంటే..
నువ్వు రమ్మని పిలిసి సూడు వత్తాయ్.. నే పోతాండా, ఆడ ఎండుగెడ్డి పీకాల, నువ్వు ఆ మూలంతా సదను సేసి రా.. క్యారీరు చింతచెట్టుకు ఏలాడ గట్టినా, నువ్వొచ్చినంక బు...

93
Sept. 13, 2020
అమ్మూరు
1976 వ సంవత్సరం - చిన్నా :
" అమ్మా ! నేనొచ్చేసా " అంటూ పుస్తకాల సంచీని ఒక మూలకి, చేతి లోని క్యారేజీ ని ఇంకో మూలకి విసిరేస్తూ వచ్చి అమ్మకి అతుక్కు పోయాడు చిన్నా. స్కూల్ నుండి వొచ్చేటప్పటికి అమ్మ ఎదురుచూస్తూ కనపడితే వాడి ఆనందం పట్టనలివి కాదెవ్వరికీ.
" అబ్బో! మా చిన్న ఐదు ఊర్లు ఏలేసి వచ్చాడమ్మా" అంటూ ఒక ముద్దు పెట్టుకుంది చిన్నాని, అమ్మ.
"అమ్మా ! ఈ రోజు స్కూల్ నుంచి వస్తుంటే ఏం జరిగిందో తెలుసా. ఊర్లోకి రెండు కార్లు వస్తూ కనపడ్డాయమ్మా. ఎవరింటికో తెలుసా నీకు"
" రాఘవన్న వొచ్చాడ్రా అమెరికా నించి, శ...

90
Aug. 14, 2020
బెల్లం టీ
A Story by Sri.Murali from his Blog 'Nemali Kannu"
http://nemalikannu.blogspot.com/2009/12/blog-post_17.html
yikKeWfiPocxqEy9L858
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

89
Aug. 12, 2020
ఓ అన్నార్థి గోల!
రేయ్! కిరణు రాత్రికి, నేను మన గొట్ల పాలెం గౌతమి టాకీస్ లో పాండవ వనవాసం సినిమా కి వెళ్తున్నా"
"ఎవరితో వెళ్తున్నావు రా! గిరి బావ"
"ఇంకెవరి తో రా మా అన్న శుంఠ తో"
"నిన్ననే కదరా! ఇద్దరు కొట్టుకున్నారు"
"అలా అనిపించిందా మీ అందరికీ, ఎక్కడ కొట్టుకున్నాం రా , వాడు కొట్టటమే కానీ నన్ను"
"సర్లే రా! మళ్ళీ వాడితోనే సిగ్గులేకుండా వెళ్తున్నావా మళ్ళీ"
"రేయ్! కిరణ్ గా, నువ్వెవడివిరా మా అన్నని వాడితో గీడీతో అనడానికి. అయినా మా అన్న దార్లో పది దొంగలొచ్చినా కొట్టేస్తాడురా"
"సరే రా గిరిబావ, మా అన్న, మీ అన్న కొ...

88
Aug. 9, 2020
పిల్లల్ని కనాలంటే?
పిల్లల్ని కనాలంటే పెళ్ళి చేసుకోవాలా? పెళ్ళి చేసుకోవాలంటే తాళిబొట్టు కట్టాలా ? :-)
80 వ దశకంలో తొలి సంవత్సరాలవి. ఇప్పటిలాగా కాకుండా మాకప్పుడు ఐదు తరగతుల లోపునే తెలుగు చాలా బాగా నేర్పేవారు. అంటే బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం ఇలాంటివి ధారాళంగా చదవ గలగడానికి, చదివి అర్థం చేసుకోవడాని ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరి సహాయం కానీ అవసరం లేనంతగా నేర్పించేవారు. అలాంటి ప్రాధమిక పాఠశాలల్లో అంబవరం పాఠశాల ఒకటి. ఈ ఊరికి నాలుగు మైళ్ళ దూరంలో భైరవకోన. ప్రకృతి మధ్యన వెలసిన శైవ క్షేత్రం. ఒక కొ...

86
Aug. 8, 2020
అతిథి దేవోభవ!
కేరళ - ఒక కేళీరవం, కళల మౌక్తికం..
ప్రపంచమంతా ప్రేమగా పిలిచే " గాడ్స్ ఓన్ కంట్రీ "
ఎలా వర్ణిద్దాం ఈ అద్భుతాన్ని!!
పర్యాటకులను కట్టిపడేసే వాయనాడ్ లో ఉదయించే సూర్యుడిని తాకే చల్లటి మబ్బుల్లా, మున్నార్ టీ తోటల్లో వీచే పిల్లగాలుల్లా, జారే జలపాతాల్లా, సోయాగాల సాగర తీరాల్లా, బ్యాక్ వాటర్స్ లా, రబ్బర్ తోటల్లా, వంద శాతం అక్షరాస్యతలా..
దేవుళ్ళంతా ఆనంతపద్మనాభుడిలా, గురువాయూర్ కృష్ణుడిలా, శబరిమల మణికంఠుడిలా మాకు రక్ష.
మాది ఒక వ్యవసాయం కుటుంబం. వరి మా ఇంటి సిరి.
కాస్త డబ్బు వెనకేసి నాన్న మున్నార్ లో ఓ ...