Conversations on contemporary literature from across the world, in translation.

Episodes

247
Oct. 13, 2021

'వనవాసి' శబ్దరూపకం - సమీక్ష

వనవాసి ఆడియో ధారావాహిక ఇప్పటికి 15 భాగాలు ప్రసారం చెయ్యడం జరిగింది.

ఇంకొక 45 భాగాలు పూర్తి చెయ్యవలసి వుంది.

దాదాపు వందేళ్ల క్రితం ప్రచురింపబడ్డ ' వనవాసి' నవల, మానవుడికి ప్రకృతికి మధ్య , మారుతున్న సంబంధం గురించి, ఒక రచయిత స్పందన.

ఇందులో భాగంగా, దేశ వ్యాప్తంగా , పర్యావరణ సంరక్షణ కై కృషి చేస్తున్న కార్యకర్తలు , సామాజిక సంస్థల ప్రతినిధులు, వివిధ పర్యావరణ వ్యవస్థలపై పని చేస్తున్న నిపుణులు, ఇలా అనేకమందితో హర్షణీయం జరిపిన సంభాషణలు (నలభైకి పైగా ) ఈ శబ్ద రూపకం ద్వారా మీకు అందించడం జరుగుతుంది.

హర్షణీయ...
508
Oct. 9, 2021

Protecting our Rivers - Tarun Bharat Sangh Moulik Sisodia part II

వనవాసి ధారావాహిక లో భాగంగా పర్యావరణ సమస్యలపై 25 మంది పర్యావరణ వేత్తలతో సంభాషించి శ్రోతలకు అందించాలని హర్షణీయం సంకల్పించింది.

శ్రీ. మౌలిక్ సిసోదియా గారు ఈ ఎపిసోడ్లో పర్యావరణంలో వస్తున్న మార్పులు , నీటి కొరతను ఎదుర్కొనడం గురించి వివరించడం జరిగింది.

https://tarunbharatsangh.in/contact-us/

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
507
Oct. 9, 2021

Protecting our Rivers - Tarun Bharat Sangh's Moulik Sisodia Part I

వనవాసి ధారావాహిక లో భాగంగా పర్యావరణ సమస్యలపై 25 మంది పర్యావరణ వేత్తలతో సంభాషించి శ్రోతలకు అందించాలని హర్షణీయం సంకల్పించింది.

శ్రీ. మౌలిక్ సిసోదియా గారు ఈ ఎపిసోడ్లో రాజస్థాన్ తూర్పు ప్రాంత గ్రామాలలో నీటి కొరత తీర్చడానికి, శ్రీ రాజేంద్ర సింగ్ గారు (The water Man of India )స్థాపించిన 'తరుణ్ భారత్ సంఘ్' గురించి , సరిస్కా టైగర్ రిసర్వ్ లో మైనింగ్ నిలిపివేయడానికి చేసిన కృషి గురించి వివరించారు.

నదీజలాల పరిరక్షణకై , ‘ తరుణ్ భారత్ సంఘ్’ సభ్యులను సంప్రదించాలంటే – https://tarunbharatsangh.in/contact-us/
...
506
Oct. 8, 2021

పర్యావరణ వేత్త , కవి , శ్రీ సత్య శ్రీనివాస్ గారి విశ్లేషణ - వనవాసి నవలపై -2 వ భాగం

ఈ ఎపిసోడ్ లో అతిధి, ముప్ఫయి ఏళ్ల పైబడి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలకు పర్యావరణ విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ. జి.సత్య శ్రీనివాస్ గారు. వనవాసి నవలను సామాజిక, చారిత్రక, సాహిత్య, పర్యావరణ కోణాల్లో విశ్లేషిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు.

పర్యావరణ కవిత్వం , చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, పుస్తక పఠనం ఆయన ఇతర అభిరుచులు.

శ్రీనివాస్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Hars...
504
Oct. 8, 2021

పర్యావరణ వేత్త , కవి , శ్రీ సత్య శ్రీనివాస్ గారి విశ్లేషణ - వనవాసి నవలపై -1 వ భాగం

ఈ ఎపిసోడ్ లో అతిధి, ముప్ఫయి ఏళ్ల పైబడి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలకు పర్యావరణ విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ. జి.సత్య శ్రీనివాస్ గారు. వనవాసి నవలను సామాజిక, చారిత్రక, సాహిత్య, పర్యావరణ కోణాల్లో విశ్లేషిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు.

పర్యావరణ కవిత్వం , చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, పుస్తక పఠనం ఆయన ఇతర అభిరుచులు.

శ్రీనివాస్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Hars...
501
Sept. 5, 2021

Janabhigyan Alok Shukla on Hasdeo Deforestation and Coal Mining

వనవాసి ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకై, వివిధ రకాల సమస్యలపై కృషి చేస్తున్న వ్యక్తులను 25 మందిని ఇంటర్వ్యూ చేసి , తెలుగులోకి అనువదించి ప్రసారం చెయ్యాలని హర్షణీయం సంకల్పించింది.

ఇందులో భాగంగా

ఛత్తీస్గఢ్ రాష్త్రం లోని హస్దేవ్ అరణ్యం పరిరక్షణ కై , జనాభిగ్యాన్ అనే సంస్థను స్థాపించి, పోరాడుతున్న శ్రీ.ఆలోక్ శుక్లా ని ఇంటర్వ్యూ చెయ్యడం జరిగింది. అరణ్యంపై ఆధారపడిన గోండు ఆదివాసీ జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ' కోల్ మైనింగ్ ' , దాని వల్ల పర్యావరణం పై పడుతున్న దుష్ప్రభావం - వీటిపై ...
222
Sept. 4, 2021

ఛాయా రిసోర్సెస్ సెంటర్ - రచయితల , మిత్రుల సమావేశం.

రండి ఛాయ కుటుంబంతో కాసేపు మాట్లాడదాం.

నచ్చిన పుస్తకాలు కొనుక్కుందాం.

Venue : 11th September from 3PM to 8PM at Ravindra Bharathi

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
221
Aug. 27, 2021

'ఎండమావుల్లో తిమింగలాల వేట'

కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా , నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు.

కథను మీకందించడానికి సహకరించిన శ్రీమతి రమణ గారికి కృతజ్ఞతలు.

ముక్కంటి సీమలో పెద్ద కాటకం వచ్చింది. క్షామ...
219
Aug. 21, 2021

'మనిషి లోపలి విధ్వంసం' - అల్లం రాజయ్య గారు

గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోపలి విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు.

ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3scvsxP
గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోని విధ్వంసం’ ఇప్పుడు మ...
218
Aug. 21, 2021

త్రిపుర గారి 'పాము'

‘త్రిపుర’ పేరు తో కథలు కవిత్వం రాసిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు గారు, తన విలక్షణమైన కథా శైలి తో ఎందరో అభిమానుల్ని సంపాదించుకోవటమే గాకుండా, అనేక మంది రచయితలకు ఆదర్శంగా నిలిచారు.

కథను మీకు పరిచయం చేయడానికి అనుమతినిచ్చిన త్రిపుర గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు.

కథను అనల్ప పబ్లిషర్స్ ప్రచురించిన ‘త్రిపుర కథలు ‘ నించి తీసుకోవటం జరిగింది.

పుస్తకం కొనాలంటే – https://bit.ly/3mAwFhN
శేషాచలపతిరావ్ అద్దంలో చూస్తూ దువ్వుకుంటూ “ఇవాళ నీ పేరు అలఖ్ నిరంజన్” అని చెప్పేడు అద్దంలోని శేషాచలపతిరావ్ తో. అద్ద...
217
Aug. 18, 2021

'సమాంతరాలు' - పతంజలి శాస్త్రి గారి కొత్త కథా సంపుటం

ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో .

ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో .

పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. (https://bit.ly/samantharaalu) .

ఆడియో వినడానికి మై ఆడియో బైట్స్ ఆప్ ని ఉపయోగించండి. (https://web.myaudiobits.com/#/audio-bits...
216
Aug. 14, 2021

'షరా' - గోపీచంద్ గారి రచన

‘షరా’ గోపీచంద్ గారు రాసిన కథ . కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.

గోపీచంద్ గారి కథలను మీకు అందించడానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు.

ఈ కథ ‘గోపీచంద్ రచనా సర్వస్వం – కథలు – 2 ‘ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3jTBgsb
ఆ మనిషిని ఎక్కడో చూశాననిపించింది. కాని ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు. కృష్ణలంకలో నాకు ఎవ్...
215
Aug. 14, 2021

అర్నాద్ గారి 'రిక్షా ప్రయాణం'

ప్రముఖ రచయిత అర్నాద్ గారి రచన ‘రిక్షా ప్రయాణం’. 1981 వ సంవత్సరంలో ఆంద్రజ్యోతి సంక్రాంతి కథల పోటీలో ప్రధమ బహుమతి పురస్కారం అందుకున్న కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అర్నాద్ గారికి కృతజ్ఞతలు.

“అమ్మా రిక్షా కావాలా” తైల సంస్కారం లేని ఉంగరాల జుట్టు, కోల ముఖంలో చురుకైన కళ్లు, సూది ముక్కు, బండ పెద వులు, మెడలో మురికి పట్టిన తాడు, దానికి వేళాడుతూ ఏడు కొండలవాడి ప్లాస్టిక్ బిళ్ళ, చిన్నచిన్న బొక్కల బనీను, రెండు పెద్ద పేలున్న బిగుతు ఆఫ్ ఫేంటు, బనీన్ని ఫేంటుని కలుపుతూ మురికి పట్టిన నల్లని తోలు బెల్టు, ...
214
July 31, 2021

'పేపర్ టైగర్' - ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచన

ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. ‘ఎన్నెస్ కథలు’ వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు.

ముందుగా ఈ కథ గురించి ‘ కథా’ నవీన్ గారు మాట్లాడతారు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి, ముందు మాటనందించిన నవీన్ గారికి కృతజ్ఞతలు.

“ఈ వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నారు నరసింహం గారు...
211
July 23, 2021

ది ఫ్రెండ్స్ - ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన

ది ఫ్రెండ్స్ - ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన

ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు.

కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి కృతజ్ఞతలు.

పుస్తకం కొనడానికి -

*************

ఇంకా తెల్లవారలేదు.

శీతాకాలం మంచు బాగా కురుస్తోంది. సముద్రపొడ్డునే వ...
208
July 16, 2021

హర్షణీయంలో స వెం రమేష్ గారి ఇంటర్వ్యూ నించి కొన్ని భాగాలు

స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు. ఈ వారాంతం హర్షణీయం ద్వారా ప్రసారం అవబోయే ఆయన ఇంటర్వ్యూ నించి కొన్ని భాగాలను ఇప్పుడు మనం వినొచ్చు.

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
206
July 10, 2021

స వెం రమేష్ గారి 'ప్రళయకావేరి కథలు' ఒక పరిచయం

'ప్రళయకావేరి కథలు'రచయిత స.వెం.రమేశ్ ఎం.ఎ. (ఆంత్రొపాలజీ,)ఎం.ఎ. (తెలుగు) చదివారు. తెలుగు భాషకోసం అంకితమై పనిచేస్తున్న కార్యకర్త స.వెం.రమేశ్. తమిళనాడులోని తెలుగుభాషా సంస్కృతుల పరిరక్ష, ణ, అభివృద్ధి ఆయన కార్యక్రమం. తెలుగు భాషోద్యమ స్ఫూర్తితో చెన్నై కేంద్రంగా తమిళనాడులో తెలుగు భాషాపరిశోధన, బోధన, ప్రచారాల కోసం ప్రారంభమైన 'తెలుగువాణి' (ట్రస్టు) సభ్యుడుగా, పూర్తి సమయ కార్యకర్తగా వున్నారు.

'ప్రళయకావేరి' అందమైన పేరుగల అందమైన సరస్సు, ఆంధ్రప్రదేశ్‍లోని నెల్లూరు జిల్లాలో ఎక్కువగా, తమిళనాడు తిరువళ్ళూరు జిల్ల...
205
July 2, 2021

మా ఊరి నీళ్ల పురాణం:

పైన చెరువు, మధ్యలో వూరు, వూరికింద పొలాలు, పొలాల క్రింద, ఎంత ఎండాకాలం లో అయినా ఒక్క పాయన్నా పారే వాగులతో, అద్భుతమైన గ్రావిటీ నీటి పారుదల వ్యవస్థ వున్న మా వూళ్ళో, తవ్వితే పడేది మాత్రం ఉప్పునీళ్ళే.

నీళ్లు పడ్డం అయితే ఇరవై ముప్పై అడుగుల్లోపలే పడతాయి, నోట్లో పోసుకుంటే కానీ తెలీదు ఎంత ఉప్పగా వుంటాయో. రాక రాక వచ్చిన జామ చెట్టు కాయలు, బాదం కాయలు, సపోటా కాయలు కూడా జవ్వ బారిపోయుంటాయి.

అందుకు వచ్చిందేమో ‘ఉప్పలపాడు’ అని మా వూరికి పేరు.

మా వూళ్ళో మూడు రకాల బావులు. ఊరికి దూరంగా ఉండేది చెరువు అవతల వైపు ఒక మ...
204
July 1, 2021

తడిసిన నేల - అనిల్

తడిసిన నేల:

ముందు ఉన్న సీట్లు , ఊతంగా పట్టుకు నడుస్తూ, బస్సులో వెనకనించీ ముందుకెళ్తున్నాడు రెడ్డి.

లైట్లన్నీ ఆర్పేసున్నాయి బస్సులో. బస్సులో కూర్చున్న పది పన్నెండు మందీ, రక రకాల భంగిమల్లో, నిద్రలో మునిగున్నారు. రోడ్డు మీద చిందుతున్న వాన చినుకులు హెడ్ లైట్ వెలుగు లో మెరుస్తున్నాయి. గతుకుల్లోంచీ బస్సు తనను తాను ఈడ్చుకుంటూ ముందుకెళ్తోంది.

డ్రైవర్ సీట్ దాకా వచ్చి అడిగాడు, “కందుకూరు ఇంకా ఎంతసేపు ”?

“ వానలు గదా …. రోడ్డుగూడా, బాగా దెబ్బతినుంది. ఓ మూడుగంటలు వేస్కో.“ అన్నాడు డ్రైవర్ , తల తిప్పకుండా.
...
203
June 30, 2021

'ఒక వైపు సముద్రం' - నవలాపరిచయం

కన్నడ రచయిత వివేక్ శానభాగ రాసిన " ఒందు బది కడలు" నవల, తెలుగు అనువాదంలోని కొన్ని భాగాలు మీరిప్పుడు వింటారు . ఈ నవలను 'ఒక వైపు సముద్రం' పేరుతో తెలుగులోకి రంగనాథ రామచంద్ర రావు గారు అనువదించారు. ఈ పుస్తకం అమెజాన్ లో ఛాయా రిసోర్సెస్ సెంటర్ ద్వారా లభ్యమౌతోంది.(https://bit.ly/okaviaipusamudram).

నవల కొన్న మొదటి యాభై మంది పాఠకులకు, 'సంచారి బుర్రకథ ఈరమ్మ' పుస్తకం ఉచితంగా లభిస్తుంది.

ఉత్తర కన్నడ జిల్లా తీర ప్రాంతంలో చాలా నదులొచ్చి సముద్రంలో కలుస్తాయి. ఎంతో అందం గా వుండే ఈ ప్రదేశంలో నివసించే మనుషుల జీవిత...
202
June 18, 2021

నిర్మల మొగుడు - తిలక్ గారి కథ

నిర్మల మొగుడు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.

తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya
కథను –

‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
(Harshaneeyam on Gaana app)

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam
(Harshaneeyam on Spoti...
201
June 18, 2021

సిక్స్ ప్యాక్ అనబడే నా కౌపీనం : హర్ష

అబ్బా నా చేతిలో సైకిల్ వుంటే, పొట్ట యిలా పెరిగిపోయేనా, రాకుండా ఆగున్న సిక్స్ ప్యాక్ ఈ పాటికి వచ్చి పొడి పొయ్యేనా , అని జోరీగలా పోరగా పోరగా, యిక వీడిని యిలా ఉపేక్షిస్తే కందిరీగలా కుడతాడు అని డిసైడ్ అయ్యి ఓ నెల కిందట మా ఆవిడ నాకు ఓ పదమూడు వేలు పెట్టి ఓ హైబ్రిడ్ సైకిల్ కొనిచ్చింది. అదే చేతితో, ఒక బెల్, గాలి కొట్టుకొనే పంప్, మెత్తగా వుండే సీట్, అలాగే రాత్రిళ్ళు కూడా తొక్కేస్తా అనే ఉత్సాహం చూపి, ఒక నైట్ లాంప్, రెండు రిఫ్లెక్టర్స్ కూడా కొనిపిచ్చేసుకున్నా.

మా ఆవిడ తరవాత రోజు ఆ సైకిల్ కి పసుపు పూసి, కు...
503
June 8, 2021

విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి శ్రీ E.A.S శర్మ గారితో సంభాషణ - రెండో భాగం

హర్షణీయం ‘వనవాసి’ ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది.

ఈ ఎపిసోడ్లో విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారు , మనతో మాట్లాడతారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న , ఆయన ఎనర్జీ ప్లానింగ్ లో డాక్టరేట్ తీసుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో సైంటిస్ట్ గా పని చేశారు. తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఐ ఏ ఎస్ అధికారి గా విశేషమైన సేవలందించిన ఆయన , ఎనర్జీ , ఫ...
502
June 8, 2021

విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి శ్రీ E.A.S శర్మ గారితో సంభాషణ - మొదటి భాగం

హర్షణీయం ‘వనవాసి’ ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది.

ఈ ఎపిసోడ్లో విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారు , మనతో మాట్లాడతారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న , ఆయన ఎనర్జీ ప్లానింగ్ లో డాక్టరేట్ తీసుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో సైంటిస్ట్ గా పని చేశారు. తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఐ ఏ ఎస్ అధికారి గా విశేషమైన సేవలందించిన ఆయన , ఎనర్జీ , ఫ...
Talk to us!