299
Dec. 24, 2021
‘గేట్’ ఖదీర్ బాబు గారి రచన. ‘ గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయితగా మనల్ని అలరిస్తున్న శ్రీ ఖదీర్ బాబు నెల్లూరు జిల్లా కావలి లో జన్మించారు. బి.ఎస్. సీ కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రులు. పత్రికా రంగంలో, సినీ రంగంలో తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. . వారు రాసిన పుస్తకాలలో కొన్ని ‘ దర్గామిట్ట కథలు ‘ , ‘ న్యూ బాంబే టైలర్స్ ‘ , ‘ పోలేరమ్మ బండ కథలు’ , ‘ కథలు ఇలా కూడా రాస్తారు’. వీరు రాసిన ‘ న్యూ బాంబే టైలర్స్’ ప్రతిష్టాత్మకమైన ‘కథ’ అవార్డు ను గెలుచుకోవడమే కాక, నాటకంగా రూపాంతరం చెంది అనేక ప...