Conversations on contemporary literature from across the world, in translation.

Translator Episodes

In-depth conversations with translators exploring their work and insights into the art of translation.
27
Sept. 3, 2023

Conversation with Suchitra Ramachandran (Tamil)

Suchitra Ramachandran is the Translator of the novel 'The Abyss'. It's a translation of the Tamil novel 'Ezham Ulagam' Written by Jeyamohan.

In this conversation, she spoke about her literary influences, the book, and the translation effort.

She has published a limited-edition volume of illustrated English translations of Tamil Sangam-era poems (Kuruntokai—Love, Loss, Landscapes, Mulligatawny Books, Chennai, 2016). Suchitra has a doctoral degree in biological sciences from Carnegie Mellon Univ...
53
Sept. 3, 2023

In conversation with Aniruddhan Vasudevan (Tamil)

Aniruddhan Vasudevan is a sociocultural anthropologist who writes and translates between Tamil and English. Vasudevan holds a Ph.D. in Anthropology from the University of Texas at Austin and now teaches at Princeton University, New Jersey.

His translations include One Part Woman, A Lonely Harvest, and Trial by Silence by Perumal Murugan, and A Night with a Black Spider by Ambai.

His area of research is 'how people form structures of care, outside of traditional forms of family and community'. ...
62
July 29, 2023

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి గురించి ఉప్పులూరి కామేశ్వర రావు గారు

మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఆంధ్రీకరించిన వాల్మీకి రామాయణానికి తెలుగులో ప్రత్యేకమైన స్థానం వుంది. రామాయణంపై తెలుగులో వచ్చిన గ్రంథాలలో శ్రీరామచంద్రుడు గారు చేసిన అనువాదం ప్రామాణికంగా చెప్పబడుతుంది. సంస్కృతం, తెలుగు , హిందీ లలో విశేషమైన ప్రతిభ కలిగిన శ్రీరామచంద్రుడు 1966 లో సంస్కృతంలో పీహెచ్డీ పట్టా పొందారు. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో రెండువందల పైగా రచనలు చేశారు. 2011 లో పద్మశ్రీ అవార్డును స్వీకరించారు.

ఈ ఎపిసోడ్ లో ఆయనతో ప్రత్యేకమైన సాన్నిహిత్యం కలిగిన ఉప్పులూరి కామేశ్వర రావ...
59
July 16, 2023

'ఏర్పాట్లు ' - ఇందిరా పార్థసారథి

తమిళ రచయిత ఇందిరా పార్థసారధి రాసిన ‘ఏర్పాట్లు’ అనే ఈ కథ ను తెలుగులోకి అనువదించింది జిల్లెళ్ళ బాలాజీ గారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన ‘నీళ్ళ కోడి’ కథాసంకలనం లోనిది.

ఇందిరా పార్థసారధి సుప్రసిద్ధ తమిళ రచయిత. తన రచనలకు, సరస్వతీ సమ్మాన్, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, పద్మశ్రీ లాంటి ఎన్నో పురస్కారాలను పొందారు.

‘నీళ్ళ కోడి’ కొనడానికి -

https://amzn.to/44Jov9x
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback ...
57
July 1, 2023

కథ : యంత్ర విజయం - వీబీ సౌమ్య గారు.

ఈ ఎపిసోడ్ లోని కథ ‘యంత్ర విజయం’ రాసింది, వి.బి. సౌమ్య గారు. Natural Language Processing (NLP) లో PhD చేసారు. ప్రస్తుతం కెనడాలోని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లో పని చేస్తున్నారు. అనువాదకురాలు, రచయిత. జులై నెల – సంచిక వెబ్ మ్యాగజైన్ లో ప్రచురించారు.

కథను చదువుకోడానికి వెబ్ లింక్ – షో నోట్స్ లో వుంది.

https://bit.ly/yantrav
కృత్రిమ మేధ అంటే?

https://bit.ly/AItelugu
కర్బన పాదముద్రలంటే?

https://bit.ly/carbonfprint
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండ...
50
June 6, 2023

సాహిత్యంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) - వి బి సౌమ్య గారు.

ఈ ఎపిసోడ్ లో సంభాషించిన వి.బి. సౌమ్య గారు Natural Language Processing (NLP) లో PhD చేసారు. ప్రస్తుతం కెనడాలోని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లో పని చేస్తున్నారు. అనువాదకురాలు, రచయిత.

కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ "నిర్జన వారధి" ని "ది షార్ప్ నైఫ్ ఆఫ్ మెమరీ" గా ఆంగ్లంలోకి - సత్యజిత్ రే వ్రాసిన Our Films, Their Films ను తెలుగులోకి అనువదించారు. pustakam.net అనే వెబ్సైటు నిర్వహిస్తున్నారు. ఈ సంభాషణలో భాగంగా, తాను రాసిన పుస్తకాల గురించి, సాహిత్యంలో ‘Artificial Intelligence’ వాడకం గురించి, చాట్ జీపీటీ...
48
May 27, 2023

అచ్చ తెనుగు కథ, 'తలుపు' : తమిళ మూలం - కి. రాజనారాయణన్

ఈ ఎపిసోడ్ లోని కథ 'తలుపు' - తమిళ మూలం రచయిత కి. రాజనారాయణన్. తెలుగు వారైన రాజనారాయణన్ తమిళంలో సుప్రసిద్ధ రచయిత. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత. ఈ కథను స. వెం రమేశ్ గారు తెలుగులోకి అనువదించారు. ఈ కథ 'తెన్నాటి తెమ్మెర' కథా సంకలనంలో చోటు చేసుకుంది. ఈ సంకలనంలోని కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. అన్ని తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు. 'తెన్నాటి తెమ్మెర' - కథాసంకలనం గురించి స. వెం రమేశ్ గారు హర్షణీయంతో చేసిన సంభాషణను మునుపటి ఎపిసోడ్ లో వినవచ్చు. (

'తలుపు' ఈ నాటి తమ...
47
May 27, 2023

తెలుగు వారి తమిళ కతలు - 'తెన్నాటి తెమ్మెర' కథాసంకలనం గురించి స.వెం. రమేష్ గారితో...

ఈ ఎపిసోడ్ లో శ్రీ. స. వెం. రమేశ్ తాను సేకరించి సంపాదకీయం వహించిన 'తెన్నాటి తెమ్మెర' కథాసంకలనాన్ని మనకు పరిచయం చేస్తారు. ఈ కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు.

స. వెం. రమేశ్ తెలుగు భాషాభిమాని, తెలుగు భాషా పరిరక్షణ సమితిలో చుఱుకైన సభ్యులు. వీరు వ్రాసిన ప్రళయ కావేరీ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా వ్యవహరింపబడుతున్న ప్రళయకావేరీ తీరాన రచయిత గడిపిన బాల్యంలోని కొన్ని సన్నివేశాలను రచయిత కథలుగా మలిచి చదువరులకు అంద...
43
May 14, 2023

'కూటి ఋణం' అవినేని భాస్కర్ గారి అనువాద కథపై సమీక్ష

ప్రసిద్ధ తమిళ రచయిత జెయమోహన్ గారి తమిళ కథ సోట్ఱు కణక్కు , 'కూటి ఋణం' అనే పేరుతో అవినేని భాస్కర్ గారు చక్కగా అనువదించారు. ఈ ఎపిసోడ్ లో, చాలా కాలంగా హర్షణీయం పాడ్కాస్ట్ ని ఫాలో అవుతున్న అర్చన గారు ఈ కథపై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అర్చన గారు సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తారు. తెలుగు ఇంగ్లీష్ కథాసాహిత్యం పై ఆసక్తి వుంది.

ఈ కథ ఈమాట వెబ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది. కింది లింక్ వుపయోగించి కూటి ఋణం కథను చదువుకోవచ్చు.

https://bit.ly/avineni

*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ...
37
May 6, 2023

మూడవ భాగం : కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు శ్రీ ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ

అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు ...... కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట కవితల్ని అనువదిస్తూ ‘నోబెల్ కవిత్వం’ ప్రకటించారు. భరతవర్షం - సీతాకాంత మహాపాత్ర ఒరియా ...
36
May 6, 2023

రెండవ భాగం : కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు శ్రీ ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ

అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు ...... కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట కవితల్ని అనువదిస్తూ ‘నోబెల్ కవిత్వం’ ప్రకటించారు. భరతవర్షం - సీతాకాంత మహాపాత్ర ఒరియా ...
35
May 6, 2023

మొదటి భాగం : కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు శ్రీ ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ

అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు ...... కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట కవితల్ని అనువదిస్తూ ‘నోబెల్ కవిత్వం’ ప్రకటించారు. భరతవర్షం - సీతాకాంత మహాపాత్ర ఒరియా ...
26
April 8, 2023

'యాత్ర' కథ ఆడియో రూపంలో - మూలం: జెయమోహన్ గారి 'పెరువలి'

ప్రసిద్ధ తమిళ రచయిత శ్రీ జెయమోహన్ రచించిన 'అఱం’ అనే కథా సంపుటంలోని ‘పెరువలి’. తెలుగులో యాత్ర అనే పేరుతో అనువదించబడింది. ఈ కథ ను కింది లింక్ ను వుపయోగించి, ఈమాట వెబ్ మ్యాగజైన్ ఏప్రిల్ 23 సంచికలో చదువుకోవచ్చు.

https://eemaata.com/em/issues/202304/30953.html

‘అఱం’ లోని కథలన్నీ నిజజీవితంలో ఆయనకు తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించి జెయమోహన్ గారు రాసినవి.

కథలో ముఖ్య పాత్రధారి ప్రముఖ తమిళ నాటక రచయిత, కళాకారుడు కోమల్ స్వామినాథన్. వెన్నెముక కాన్సర్ తో బాధ పడుతున్న కోమల్ మానస సరోవర యాత్రకు పూనుకోవడం ఈ కథాం...
25
April 3, 2023

Kannan Sundaram in conversation with Harshaneeyam

మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న శ్రీ కణ్ణన్ సుందరం ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారి కుమారుడు. కాలచ్చువడు పబ్లికేషన్స్ అనే సంస్థను నాగర్ కోయిల్ పట్టణంలో స్థాపించి గత పాతికేళ్ళుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా వెయ్యికి పైగా పుస్తకాలను ప్రచురించారు. తమిళ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు అందుకున్నారు. 2021 సంవత్సరంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆయనకు చెవాలియర్ అవార్డును ప్రదానం చేసింది. ఈ సంభాషణలో భాగంగా , పుస్తక ప్రచురణ గురించి, పుస్తకాలను పాఠకులకు దగ్గరగా చేర్చడం ...
24
March 31, 2023

జెయమోహన్ గారి 'యాత్ర' కథా సమీక్ష

ప్రసిద్ధ తమిళ రచయిత శ్రీ జెయమోహన్ రచించిన ‘అరం’ అనే కథా సంపుటంలోని ‘పెరువలి’. తెలుగులో యాత్ర అనే పేరుతో అనువదించబడింది.

*ఈ కథ గురించి రచయిత అజయ్ ప్రసాద్ గారి అభిప్రాయాన్ని ఈ ఎపిసోడ్ లో విందాం. ఈ మాట వెబ్ మ్యాగజైన్ ఏప్రిల్లో సంచికలో ఈ కథ తెలుగు అనువాదం చదవొచ్చు.

https://eemaata.com/em/issues/202304/30953.html

‘అరం’ లోని కథలన్నీ నిజజీవితంలో ఆయనకు తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించి జెయమోహన్ గారు రాసినవి.

కథలో ముఖ్య పాత్రధారి ప్రముఖ తమిళ నాటక రచయిత, కళాకారుడు కోమల్ స్వామినాథన్. వెన్నెముక కాన్సర్ తో...
15
Feb. 5, 2023

'East Wind' పుస్తక పరిచయం - ఉణుదుర్తి సుధాకర్ గారితో

ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన 'తూరుపు గాలులు' పుస్తకం సౌత్ సైడ్ బుక్స్ పబ్లిషింగ్ ద్వారా ఇంగ్లీష్ లో 'East Wind' పేరుతో అనువదించబడింది. ఈ అనువాద ప్రక్రియలో తన అనుభవాన్ని సుధాకర్ గారు మనతో పంచుకున్నారు, ఈ ఎపిసోడ్లో. త్వరలో ఈ పుస్తకం Hyderabad book trust వెబ్సైటు ద్వారా, ఇతర పుస్తక విక్రేతల ద్వారా లభ్యం అవుతుంది.

ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన 'తూరుపు గాలులు' ' చలిచీమల కవాతు' కథాసంపుటాలు కూడా విశేష ఆదరణ పొందాయ...
7
Dec. 21, 2022

'చెఖోవ్ కథలు - 1' పుస్తకం, అనువాదకులు అరుణ గారితో పరిచయం

'Father of Modern short story' అని చెప్పబడే రష్యన్ రచయిత చెఖోవ్ , 1880 - 1905 ప్రాంతంలో ఆరువందలకు పైగా కథలను రాసారు. ఈయన కథలు ప్రపంచ వ్యాప్తంగా. అనేక భాషల్లో అనువదించబడి ప్రాచుర్యాన్ని పొందాయి. ఇంగ్లీష్ నించి చెఖోవ్ కథలను తెలుగులోకి అనువదించి మన ముందుకు తెస్తున్నారు శ్రీమతి అరుణ గారు. ఈ పుస్తకం గురించి ఈ ఎపిసోడ్ లో ఆమె మనకు వివరిస్తారు.

ఎపిసోడ్లో ముందుగా ఈ పుస్తకాన్ని మనకు అందిస్తున్న పాత్రికేయులు, రచయిత కుమార్ కూనపరాజు గారు చెఖోవ్ గురించి మాట్లాడతారు.

This podcast uses the following third-par...
1
Sept. 24, 2022

'నాన్నతో ఒక్క రోజు' - తమిళ మూలం - సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు

‘నాన్న తో ఒక్క రోజు’
తమిళ మూలం: సుప్రసిద్ధ కథా రచయిత సుందర రామస్వామి గారు
నాన్నతో ఒక్కరోజు అనే కథకు తమిళ మూలం సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు. కథను మీ కందించడానికి అనుమతినిచ్చిన కణ్ణన్ గారికి, సహకరించిన గీతారామస్వామి గారికి కృతజ్ఞతలు.
నాన్నకున్న ఒకే ఒక దాయాది రాజు పెదనాన్న. పేరుకు దాయాదులన్న మాటే గానీ , ఇద్దరూ, ఒకే కడుపున, పుట్టిన వాళ్ళ కంటే కూడా, ప్రేమగా సఖ్యంగా వుంటారు.

నాన్న అమ్మలకు పెళ్ళైన కొన్నాళ్ళకే , ఆస్తులన్నీ కరిగిపోయాయి. బతకడానికి ఏ ఆధారమూ లేక, నిస్సహాయంగా మా కుటుంబం నిలబడుంట...
313
May 14, 2022

సద్గతి - శ్రీ మధురాంతకం నరేంద్ర

రచయిత తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.ఇది గాక , ఆయన ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి , అధ్యాపక వృత్తిలో ప్రవేశించి, నలభై ఏళ్ల పైన, వేలమంది విద్యార్థులకి విద్యా దానం చేశారు.మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి సుతారమైన తనదైన శైలిలో , అత్యంత సహజంగా చిత్రీకరించడమే ఆయన రచనలలో వుండే ప్రత్యేకత.ఒక సకారాకాత్మకమైన మార్పు , కథ...
306
Jan. 22, 2022

‘తెరిచున్న కిటికీ’: మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki) రాసిన ‘The Open window’

‘తెరిచున్న కిటికీ’: మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki) రాసిన ‘The Open window’

(https://americanliterature.com/author/hh-munro-saki/short-story/the-open-window)

“అత్తయ్య ఇప్పుడే వచ్చేస్తుందండీ, ఈలోపల నా కంపనీ భరించాలి మీరు” అంది ఆ పదిహేనేళ్ల యువతి నవ్వుతూ, కొత్త మనిషిని కలుస్తున్నాను అన్న బెరుకేవీ లేకుండా.

వాళ్ళ అత్త రాక ప్రాముఖ్యతని తక్కువ చేయకుండా, ఈ అమ్మాయిని పొగుడుదామని కొంత ఉత్సాహపడ్డాడు, ఫ్రాంటన్ నట్టెల్.

నిజానికి, ఇలా ఒకరి తర్వాత ఒకర్ని, కొత్తవాళ్ళని కలవడం అతనికంత గొప్ప ఐడియాలా అనిపిం...
305
Jan. 8, 2022

కూపే (ఆంగ్ల మూలం : రేమండ్ కార్వర్ రాసిన 'Compartment')

ae30HCvSxkXmzvGvXUuL

‘కూపే’ ( మూలం: రేమండ్ కార్వర్ కథ ‘కంపార్ట్మెంట్’)

అమెరికన్ రచయిత రేమండ్ కార్వర్ కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన రచనల్లో ‘Compartment’ ఒకటి. కథాంశం ఎనిమిదేళ్లుగా దూరమైన కొడుకుని కలవడం కోసం మేయర్స్ అనే వ్యక్తి చేసే ప్రయాణం.

సంభాషణల ద్వారా లేదా రచయిత జోక్యం ద్వారా కాకుండా, మేయర్స్ మనసులో ఆలోచనలూ, అతని చుట్టూ కనపడుతున్న వాతావరణం లో అతను గమనించే విషయాలూ వీటి గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తూ కథను ముందుకు తీసుకెళ్తారు రచయిత. మేయర్స్ వ్యక్తిత్వాన్ని తేటతెల్లంగా మన ముందుంచడానికి ర...
304
Jan. 8, 2022

వర్షంలో పిల్లి : (ఆంగ్లమూలం 'Cat in the Rain' by Ernest Hemingway)

‘ వర్షంలో పిల్లి’ , ఈ కథకు అనువాదకులు శ్రీ పతంజలి శాస్త్రి గారు. కథకు ఆంగ్ల మూలం ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ‘Cat in the Rain’. కథకు అనువాదంతో పాటూ , కథ గురించి వారు ఇచ్చిన వివరణ కూడా ఇదే పేజీలో చదవవొచ్చు.

‘వర్షంలో పిల్లి’: తెలుగు అనువాదం – పతంజలి శాస్త్రి

(‘Cat in the Rain’: ఆంగ్ల మూలం – ఎర్నెస్ట్ హెమింగ్వే)

ఆ హోటల్లో ఇద్దరే అమెరికన్లు దిగేరు. వాళ్ళ గదిలోకి వెళ్తూ, మెట్లెక్కి దిగుతున్నప్పుడు తారసపడే వాళ్ళెవ్వరూ తెలీదు వాళ్ళకి. ఎదురుగా సముద్రం కనిపించే రెండో అంతస్థులో గది వాళ్ళది. పార్కు, వార్ ...
303
Jan. 1, 2022

నల్లజర్ల రోడ్డు (3/3) - తిలక్ గారి కథ

నల్లజర్ల రోడ్డు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది.

ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.

తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya


This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
302
Jan. 1, 2022

నల్లజర్ల రోడ్డు (2/3) - తిలక్ గారి కథ

నల్లజర్ల రోడ్డు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది.

ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.

తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya


This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Talk to us!