Telugu Episodes
All Episodes in Telugu.
64
Aug. 13, 2023
'గరికపాటోడి కథలు' - పుస్తక పరిచయం
ఈ ఎపిసోడ్ లో గూండ్ల వెంకట నారాయణ గారు రాసిన ‘గరికపాటోడి కథలు’ పుస్తకం గురించి అందులో తనకు నచ్చిన ఒక కథ గురించి పాఠకులు శ్రీ హర్ష మాట్లాడతారు. శ్రీహర్ష హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో మూడో సంవత్సరం ఇంటిగ్రేటెడ్ ఎం ఏ కోర్సు చేస్తున్నారు.ఇంగ్లీష్ , తెలుగు పుస్తకాలు చదవడం ఆయన హాబీ.
పుస్తకం కొనడానికి లింక్ తో పాటూ, రచయిత గూండ్ల వెంకట నారాయణ గారిని పరిచయం చేసిన ఎపిసోడ్ లింక్ కూడా షో నోట్స్ లో వుంది.
రచయిత గూండ్ల వెంకట నారాయణ గారితో పరిచయం -
https://bit.ly/3YuCbmR
‘గరికపాటోడి కథలు’ పుస్తకం కొనడాన...

62
July 29, 2023
ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి గురించి ఉప్పులూరి కామేశ్వర రావు గారు
మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఆంధ్రీకరించిన వాల్మీకి రామాయణానికి తెలుగులో ప్రత్యేకమైన స్థానం వుంది. రామాయణంపై తెలుగులో వచ్చిన గ్రంథాలలో శ్రీరామచంద్రుడు గారు చేసిన అనువాదం ప్రామాణికంగా చెప్పబడుతుంది. సంస్కృతం, తెలుగు , హిందీ లలో విశేషమైన ప్రతిభ కలిగిన శ్రీరామచంద్రుడు 1966 లో సంస్కృతంలో పీహెచ్డీ పట్టా పొందారు. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో రెండువందల పైగా రచనలు చేశారు. 2011 లో పద్మశ్రీ అవార్డును స్వీకరించారు.
ఈ ఎపిసోడ్ లో ఆయనతో ప్రత్యేకమైన సాన్నిహిత్యం కలిగిన ఉప్పులూరి కామేశ్వర రావ...

54
June 23, 2023
'ప్రపంచ సినిమా చరిత్ర' - అరిపిరాల సత్యప్రసాద్ గారితో సంభాషణ
అరిపిరాల సత్యప్రసాద్ గారు , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ రూరల్ మానేజ్మెంట్, ఆనంద్ లో చదువుకున్నారు. గుంటూరు స్వస్థలం. ప్రస్తుతం ఐ డీ ఎఫ్ సీ ఫస్ట్ భారత్ లిమిటెడ్ లో, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ కి జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. జరుగుతున్నది జగన్నాటకం' , 'రూపాయి చెప్పిన బేతాళ కథలు' ఆయన రచనలు. కథల మీద, నవల మీద సమీక్షావ్యాసాలు రాస్తుంటారు. కొన్ని కథా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. లఘుచిత్రాలను తీశారు. సినిమాలపై ఆయనకున్న ఆసక్తితో, ఐదేళ్ళ పై విషయ సేకరణ చేసి, 'ప్రపంచ సినిమా చరిత్ర' పుస్తకాన్ని ...
52
June 16, 2023
నిత్య యాత్రీకుడు ఆదినారాయణ గారితో పరిచయం
ప్రకాశం జిల్లాకు చెందిన ఆదినారాయణ గారు ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. గత నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు సందర్శించి, తన యాత్రల గురించి పుస్తకాలను రాస్తున్నారు. భారతదేశం అంతా తన కాలినడకన తిరిగి 'భ్రమణ కాంక్ష' అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆరు ఖండాలలోని ముప్ఫయి ఐదు దేశాలలో తిరిగి 'భూ భ్రమణ కాంక్ష' అనే పుస్తకాన్ని రాసారు. తెలుగులో మొదటి యాత్రా సాహిత్యం గా ప్రసిద్ధికెక్కిన 'కాశీ యాత్రా చరిత్ర' ను ఆధునీకరించి ప్రచురించారు.
ఎపిస...
ఎపిస...
50
June 6, 2023
సాహిత్యంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) - వి బి సౌమ్య గారు.
ఈ ఎపిసోడ్ లో సంభాషించిన వి.బి. సౌమ్య గారు Natural Language Processing (NLP) లో PhD చేసారు. ప్రస్తుతం కెనడాలోని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లో పని చేస్తున్నారు. అనువాదకురాలు, రచయిత.
కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ "నిర్జన వారధి" ని "ది షార్ప్ నైఫ్ ఆఫ్ మెమరీ" గా ఆంగ్లంలోకి - సత్యజిత్ రే వ్రాసిన Our Films, Their Films ను తెలుగులోకి అనువదించారు. pustakam.net అనే వెబ్సైటు నిర్వహిస్తున్నారు. ఈ సంభాషణలో భాగంగా, తాను రాసిన పుస్తకాల గురించి, సాహిత్యంలో ‘Artificial Intelligence’ వాడకం గురించి, చాట్ జీపీటీ...

49
June 3, 2023
నవోదయ బుక్ హౌస్ - హర్షణీయంలో
నవోదయ బుక్ హౌస్ ని సాంబశివరావు గారు , కోటేశ్వర రావు గారు కలిసి, కాచిగూడ హైదరాబాద్ లో స్థాపించి, గత మూడు దశాబ్దాల పైబడి తెలుగు పుస్తకాలను పాఠకులకు అందచేస్తున్నారు. నవోదయ పబ్లిషింగ్ ద్వారా మంచి సాహిత్యాన్ని ప్రచురిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో సాంబశివరావు గారు పుస్తకాలతో తన కున్న దాదాపు యాభై ఏళ్ళ సాన్నిహిత్యాన్ని, అమ్మకంలో , ప్రచురణలో తన అనుభవాలను మనతో పంచుకున్నారు. గొంతు పూర్తిగా సహకరించకపోయినా ఈ సంభాషణలో పాల్గొని తమ ఆలోచనలను పంచుకున్నందుకు సాంబశివరావు గారికి కృతజ్ఞతలు. ఎపిసోడ్ చివరన కోటేశ్వర రావు గార...
47
May 27, 2023
తెలుగు వారి తమిళ కతలు - 'తెన్నాటి తెమ్మెర' కథాసంకలనం గురించి స.వెం. రమేష్ గారితో...
ఈ ఎపిసోడ్ లో శ్రీ. స. వెం. రమేశ్ తాను సేకరించి సంపాదకీయం వహించిన 'తెన్నాటి తెమ్మెర' కథాసంకలనాన్ని మనకు పరిచయం చేస్తారు. ఈ కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు.
స. వెం. రమేశ్ తెలుగు భాషాభిమాని, తెలుగు భాషా పరిరక్షణ సమితిలో చుఱుకైన సభ్యులు. వీరు వ్రాసిన ప్రళయ కావేరీ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా వ్యవహరింపబడుతున్న ప్రళయకావేరీ తీరాన రచయిత గడిపిన బాల్యంలోని కొన్ని సన్నివేశాలను రచయిత కథలుగా మలిచి చదువరులకు అంద...

45
May 19, 2023
అనిల్ అట్లూరి గారితో సంభాషణ - రెండవ భాగం
ఈ ఎపిసోడ్ లో రచయిత, అనువాదకులు, కాలమిస్ట్ అనిల్ అట్లూరి గారు తన సాహితీ జీవితం గురించి, పుస్తక ప్రచురణ రంగంలో వస్తున్న అనేక మార్పుల గురించి విస్తారంగా హర్షణీయంతో మాట్లాడారు. అనిల్ అట్లూరి గారి తండ్రి ప్రముఖ సినీ రచయిత, కథా రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు గారు. తల్లి చౌదరాణి గారు స్థాపించిన 'రాణి బుక్ సెంటర్' ద్వారా అనిల్ అట్లూరి తెలుగు పుస్తకాలను అనేక దశాబ్దాలు మద్రాసులోని పుస్తక ప్రేమికులకు అందించారు. అనిల్ గారి మాతామహులు కవి రాజు త్రిపురనేని రామస్వామి గారు. ప్రస్తుతం కథాసాహిత్యంపై ప్రతి నెలా రెండ...
44
May 19, 2023
అనిల్ అట్లూరి గారితో సంభాషణ - మొదటి భాగం
ఈ ఎపిసోడ్ లో రచయిత, అనువాదకులు, కాలమిస్ట్ అనిల్ అట్లూరి గారు తన సాహితీ జీవితం గురించి, పుస్తక ప్రచురణ రంగంలో వస్తున్న అనేక మార్పుల గురించి విస్తారంగా హర్షణీయంతో మాట్లాడారు. అనిల్ అట్లూరి గారి తండ్రి ప్రముఖ సినీ రచయిత, కథా రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు గారు. తల్లి చౌదరాణి గారు స్థాపించిన 'రాణి బుక్ సెంటర్' ద్వారా అనిల్ అట్లూరి తెలుగు పుస్తకాలను అనేక దశాబ్దాలు మద్రాసులోని పుస్తక ప్రేమికులకు అందించారు. అనిల్ గారి మాతామహులు కవి రాజు త్రిపురనేని రామస్వామి గారు. ప్రస్తుతం కథాసాహిత్యంపై ప్రతి నెలా రెండ...
43
May 14, 2023
'కూటి ఋణం' అవినేని భాస్కర్ గారి అనువాద కథపై సమీక్ష
ప్రసిద్ధ తమిళ రచయిత జెయమోహన్ గారి తమిళ కథ సోట్ఱు కణక్కు , 'కూటి ఋణం' అనే పేరుతో అవినేని భాస్కర్ గారు చక్కగా అనువదించారు. ఈ ఎపిసోడ్ లో, చాలా కాలంగా హర్షణీయం పాడ్కాస్ట్ ని ఫాలో అవుతున్న అర్చన గారు ఈ కథపై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అర్చన గారు సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తారు. తెలుగు ఇంగ్లీష్ కథాసాహిత్యం పై ఆసక్తి వుంది.
ఈ కథ ఈమాట వెబ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది. కింది లింక్ వుపయోగించి కూటి ఋణం కథను చదువుకోవచ్చు.
https://bit.ly/avineni
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ...

37
May 6, 2023
మూడవ భాగం : కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు శ్రీ ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ
అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు ...... కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట కవితల్ని అనువదిస్తూ ‘నోబెల్ కవిత్వం’ ప్రకటించారు. భరతవర్షం - సీతాకాంత మహాపాత్ర ఒరియా ...
36
May 6, 2023
రెండవ భాగం : కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు శ్రీ ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ
అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు ...... కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట కవితల్ని అనువదిస్తూ ‘నోబెల్ కవిత్వం’ ప్రకటించారు. భరతవర్షం - సీతాకాంత మహాపాత్ర ఒరియా ...
35
May 6, 2023
మొదటి భాగం : కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు శ్రీ ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ
అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు ...... కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట కవితల్ని అనువదిస్తూ ‘నోబెల్ కవిత్వం’ ప్రకటించారు. భరతవర్షం - సీతాకాంత మహాపాత్ర ఒరియా ...
34
May 5, 2023
ఔత్సాహిక యువ రచయిత , షార్ట్ ఫిలిం మేకర్ దినేష్ గారితో సంభాషణ
బాసర IIIT లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుకున్న దినేష్ , రామానాయుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఫిలిం మేకింగ్ పై కోర్స్ చేశారు . మంచి చదువరి. బ్రేక్ అప్ స్టోరీస్, మహానుభావులు అనే లఘు చిత్రాలకు స్క్రీన్ ప్లే , ఛాయాగ్రహణం, దర్శకత్వం వహించారు. ఈ ఎపిసోడ్ లో ఇష్టమైన పుస్తకాల గురించి, తన సినీ ప్రస్థానంపై పుస్తకాల ప్రభావం గురించి దినేష్ మాట్లాడారు.
కింది లింక్ ద్వారా యూట్యూబ్ లో దినేష్ దర్శకత్వం వహించిన లఘు చిత్రాలను చూడొచ్చు.
https://www.youtube.com/@TwoWheelEntertainment
*హర్షణీయం ప...

32
April 30, 2023
రచయిత అజయ్ ప్రసాద్ గారితో సంభాషణ
తెలుగులో మనకున్న అత్యంత ప్రతిభావంతులైన రచయితలలో అజయ్ ప్రసాద్ గారు ఒకరు. హర్షణీయంతో చేసిన ఈ సంభాషణలో తన రచనా జీవితం గురించి , ఈ మధ్యే వచ్చిన ఆయన కథా సంపుటం 'గాలి పొరలు' గురించి ఆయన వివరించారు.
ప్రకాశం జిల్లా అద్దంకి వారి సొంత వూరు.
ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. గాలి పొరలు ఆయన రెండో కథా సంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్ ను ఉపయోగించండి.
https://bit.ly/3HpeTre
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండ...

28
April 19, 2023
హర్షణీయం శ్రోతలకు ( To Harshaneeyam Listeners)
హర్షణీయం పాడ్కాస్ట్ పై మీ అభిప్రాయం ( feedback form) -
https://forms.gle/FiYgAbqjqncYUiqo7
హర్షణీయం టీం తో ఇంటర్వ్యూ సారంగ పత్రికలో -
https://bit.ly/harsharanga
హర్షణీయం పాడ్కాస్ట్ మొదలు పెట్టి ముప్ఫయి మూడు మాసాలయింది. తెలుగు కథల్లో మాకు నచ్చిన యాభై కథలకు పైగా పరిచయం చెయ్యడమే కాక , ముప్ఫయి ఐదు మంది తెలుగు కథా రచయితలను, ప్రచురణ కర్తలను, తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న ప్రముఖులను హర్షణీయం పాడ్కాస్ట్ ద్వారా పరిచయం చేసాము. ఈ మధ్యకాలంలో అనువాద కథలతో పాటు, ఇతర దక్షిణాది భాషా రచయితలను , ప్రచురణ...

24
March 31, 2023
జెయమోహన్ గారి 'యాత్ర' కథా సమీక్ష
ప్రసిద్ధ తమిళ రచయిత శ్రీ జెయమోహన్ రచించిన ‘అరం’ అనే కథా సంపుటంలోని ‘పెరువలి’. తెలుగులో యాత్ర అనే పేరుతో అనువదించబడింది.
*ఈ కథ గురించి రచయిత అజయ్ ప్రసాద్ గారి అభిప్రాయాన్ని ఈ ఎపిసోడ్ లో విందాం. ఈ మాట వెబ్ మ్యాగజైన్ ఏప్రిల్లో సంచికలో ఈ కథ తెలుగు అనువాదం చదవొచ్చు.
https://eemaata.com/em/issues/202304/30953.html
‘అరం’ లోని కథలన్నీ నిజజీవితంలో ఆయనకు తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించి జెయమోహన్ గారు రాసినవి.
కథలో ముఖ్య పాత్రధారి ప్రముఖ తమిళ నాటక రచయిత, కళాకారుడు కోమల్ స్వామినాథన్. వెన్నెముక కాన్సర్ తో...

22
March 10, 2023
యువ రచయిత వెంకట నారాయణ గారితో పరిచయం
ఇరవై మూడేళ్ళ వెంకటనారాయణ పల్నాడు జిల్లా గరికపాడు గ్రామానికి చెందిన వారు. ఎం ఏ తెలుగు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పూర్తి చేశారు. 'భూమి పతనం' అనే నవల, 'ఇయ్యాల మా వూళ్ళో' అనే కవితా సంకలనం గత సంవత్సరం ప్రచురితమయ్యాయి. మంచి చదువరి.
ఈ రచయితలా రాసేదానికంటే ఎక్కువ చదువుతూ , తాను చదివిన పుస్తకాల గురించి చక్కగా అర్థవంతంగా మాట్లాడే రచయితలు చాలా అరుదు. ప్రస్తుతం 'గరికపాటోడి కథలు' అనే కథా సంపుటి ని, 'కాపలాదారుల పాటలు' అనే కవితాసంపుటిని ప్రచురించే పనిలో వున్నారు.
భూమి పతనం నవల కొనడానికి -
https://bi...

20
March 5, 2023
‘చిలుకంబడు దధికైవడి’ - మూలం తమిళ రచయిత జెయమోహన్ రచన ‘మత్తుఱు తయిర్’
ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ. జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన వ్యక్తుల గురించి మనకు చెబుతూ రచయిత రాసిన కథలు.
ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. (https://tamil.wiki/wiki/Professor_Jesudasan) కన్యాకుమారి జిల్లాలో ఒక నీరుపేద కుటుంబంలో జన్మించారు. ‘కంబ రామాయణం’ ...

21
March 4, 2023
‘చిలుకంబడు దధికైవడి’ కథాసమీక్ష - ఉణుదుర్తి సుధాకర్ గారు
‘చిలుకంబడు దధికైవడి’ అనే కథకు మూలం, రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ, ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
ఈ కథను ప్రముఖ కథా రచయిత శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు ఈ ఎపిసోడ్ లో సమీక్షిస్తారు.
వారికి కృతజ్ఞతలు.
ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ. జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన వ్యక్తుల గుర...

19
Feb. 25, 2023
'ఇసుక అద్దం' శ్రీ వూహ గారితో సంభాషణ
శ్రీ వూహ గారి మొదటి కథా సంపుటం 'ఇసుక అద్దం'డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో తన కథారచన గురించి, తనను ప్రభావితం చేసిన విషయాల గురించి శ్రీ వూహమాట్లాడారు.
ఇసుక అద్దం కొనడానికి క్రింది లింక్ ను ఉపయోగించండి.
https://bit.ly/isukaaddam
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

17
Feb. 17, 2023
మధురాంతకం రాజారాం గారి కథలు, రచనా జీవితం పై మధురాంతకం నరేంద్ర గారు
1993 వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారాం గారు తెలుగులో సుప్రసిద్ధ కథారచయిత. చిత్తూరు జిల్లాకు చెందిన రాజారాం గారు మూడు వందలకు పైగా కథలు రాసారు. వారి సమగ్ర కథాసంకలనం కిందటి వారం ఎమెస్కో పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఇందులో 295 కథలు ఐదు భాగాలలో ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మధురాంతకం నరేంద్ర గారు వారి నాన్న గారి కథల గురించి , రచనా జీవితం గురించి మాట్లాడటం జరిగింది.
పుస్తకం కొనడానికి పల్లవి పబ్లిషర్స్ వెంకట నారాయణ గారిని 9866115655 ద్వారా వాట్స...

16
Feb. 11, 2023
'రామగ్రామ నుంచి రావణలంక దాకా' రచయిత సీతారామరాజు గారితో పరిచయం.
'రామగ్రామ నుంచి రావణలంక దాకా' నవల రచయిత సీతారామ రాజు గారి సొంత వూరు, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయి గూడెం. రియల్ ఎస్టేట్ రంగంలో వున్నారు. నివాసం హైదరాబాద్. ఆరు వారాల క్రితమే రిలీజ్ అయిన ఈ నవల 800 ప్రతుల మించి అమ్మకాలు సాధించి పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది.
పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి -
https://amzn.to/3EoRIMn
Harshaneeyam on apple podcast
https://apple.co/3K1vMdw
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy...

15
Feb. 5, 2023
'East Wind' పుస్తక పరిచయం - ఉణుదుర్తి సుధాకర్ గారితో
ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన 'తూరుపు గాలులు' పుస్తకం సౌత్ సైడ్ బుక్స్ పబ్లిషింగ్ ద్వారా ఇంగ్లీష్ లో 'East Wind' పేరుతో అనువదించబడింది. ఈ అనువాద ప్రక్రియలో తన అనుభవాన్ని సుధాకర్ గారు మనతో పంచుకున్నారు, ఈ ఎపిసోడ్లో. త్వరలో ఈ పుస్తకం Hyderabad book trust వెబ్సైటు ద్వారా, ఇతర పుస్తక విక్రేతల ద్వారా లభ్యం అవుతుంది.
ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన 'తూరుపు గాలులు' ' చలిచీమల కవాతు' కథాసంపుటాలు కూడా విశేష ఆదరణ పొందాయ...