Conversations on contemporary literature from across the world, in translation.

Author Episodes

Engaging discussions with authors about their writing processes, inspirations, and literary contributions.
221
Aug. 27, 2021

'ఎండమావుల్లో తిమింగలాల వేట'

కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా , నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు.

కథను మీకందించడానికి సహకరించిన శ్రీమతి రమణ గారికి కృతజ్ఞతలు.

ముక్కంటి సీమలో పెద్ద కాటకం వచ్చింది. క్షామ...
219
Aug. 21, 2021

'మనిషి లోపలి విధ్వంసం' - అల్లం రాజయ్య గారు

గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోపలి విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు.

ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3scvsxP
గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోని విధ్వంసం’ ఇప్పుడు మ...
218
Aug. 21, 2021

త్రిపుర గారి 'పాము'

‘త్రిపుర’ పేరు తో కథలు కవిత్వం రాసిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు గారు, తన విలక్షణమైన కథా శైలి తో ఎందరో అభిమానుల్ని సంపాదించుకోవటమే గాకుండా, అనేక మంది రచయితలకు ఆదర్శంగా నిలిచారు.

కథను మీకు పరిచయం చేయడానికి అనుమతినిచ్చిన త్రిపుర గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు.

కథను అనల్ప పబ్లిషర్స్ ప్రచురించిన ‘త్రిపుర కథలు ‘ నించి తీసుకోవటం జరిగింది.

పుస్తకం కొనాలంటే – https://bit.ly/3mAwFhN
శేషాచలపతిరావ్ అద్దంలో చూస్తూ దువ్వుకుంటూ “ఇవాళ నీ పేరు అలఖ్ నిరంజన్” అని చెప్పేడు అద్దంలోని శేషాచలపతిరావ్ తో. అద్ద...
217
Aug. 18, 2021

'సమాంతరాలు' - పతంజలి శాస్త్రి గారి కొత్త కథా సంపుటం

ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో .

ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో .

పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. (https://bit.ly/samantharaalu) .

ఆడియో వినడానికి మై ఆడియో బైట్స్ ఆప్ ని ఉపయోగించండి. (https://web.myaudiobits.com/#/audio-bits...
216
Aug. 14, 2021

'షరా' - గోపీచంద్ గారి రచన

‘షరా’ గోపీచంద్ గారు రాసిన కథ . కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.

గోపీచంద్ గారి కథలను మీకు అందించడానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు.

ఈ కథ ‘గోపీచంద్ రచనా సర్వస్వం – కథలు – 2 ‘ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3jTBgsb
ఆ మనిషిని ఎక్కడో చూశాననిపించింది. కాని ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు. కృష్ణలంకలో నాకు ఎవ్...
215
Aug. 14, 2021

అర్నాద్ గారి 'రిక్షా ప్రయాణం'

ప్రముఖ రచయిత అర్నాద్ గారి రచన ‘రిక్షా ప్రయాణం’. 1981 వ సంవత్సరంలో ఆంద్రజ్యోతి సంక్రాంతి కథల పోటీలో ప్రధమ బహుమతి పురస్కారం అందుకున్న కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అర్నాద్ గారికి కృతజ్ఞతలు.

“అమ్మా రిక్షా కావాలా” తైల సంస్కారం లేని ఉంగరాల జుట్టు, కోల ముఖంలో చురుకైన కళ్లు, సూది ముక్కు, బండ పెద వులు, మెడలో మురికి పట్టిన తాడు, దానికి వేళాడుతూ ఏడు కొండలవాడి ప్లాస్టిక్ బిళ్ళ, చిన్నచిన్న బొక్కల బనీను, రెండు పెద్ద పేలున్న బిగుతు ఆఫ్ ఫేంటు, బనీన్ని ఫేంటుని కలుపుతూ మురికి పట్టిన నల్లని తోలు బెల్టు, ...
214
July 31, 2021

'పేపర్ టైగర్' - ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచన

ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. ‘ఎన్నెస్ కథలు’ వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు.

ముందుగా ఈ కథ గురించి ‘ కథా’ నవీన్ గారు మాట్లాడతారు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి, ముందు మాటనందించిన నవీన్ గారికి కృతజ్ఞతలు.

“ఈ వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నారు నరసింహం గారు...
211
July 23, 2021

ది ఫ్రెండ్స్ - ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన

ది ఫ్రెండ్స్ - ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన

ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు.

కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి కృతజ్ఞతలు.

పుస్తకం కొనడానికి -

*************

ఇంకా తెల్లవారలేదు.

శీతాకాలం మంచు బాగా కురుస్తోంది. సముద్రపొడ్డునే వ...
198
June 3, 2021

'రెండురెళ్ళు నాలుగు' - చిలుకూరి దేవపుత్ర గారు.

'రెండు రెళ్ళ నాలుగు' చిలుకూరి దేవపుత్ర గారి రచన. అనంతపురం జిల్లాకి చెందిన ఆయన తన జీవిత కాలంలో , నాలుగు నవలలు, ఐదు కథాసంపుటాలను రచించారు. ఆయన నవల 'పంచమం' శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు ఎం.ఏ పాఠ్యాంశం గా చేర్చారు. దేవపుత్ర గారు అందుకున్న అనేక పురస్కారాలలో , చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం , విశాలాంధ్ర వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం వున్నాయి.

'రెండు రెళ్ళ నాలుగు', ఒక యదార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ.

దేవపుత్ర గారి కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన , అన్వేష్ గారికి , దీవెన గారికి కృతజ్ఞతలు.

ద...
196
May 28, 2021

'వార్తాహరులు' - ఉణుదుర్తి సుధాకర్ గారు

'వార్తాహరులు' అనే కథ, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు.

'తూరుపు గాలులు' అనే సంపుటం లోనిది.

మనదేశంలో బ్రిటిష్ వారు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఏర్పరచడానికి దారి తీసిన పరిస్థితులను ఆధారంగా తీసుకొని రాసిన కథ.

మెరైన్ ఇంజనీర్ గా పని చేసిన సుధాకర్ గారు రాసిన 'యారాడ కొండ' ఆటా నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల.

'హిస్టారికల్ ఫిక్షన్' రాస్తున్న అతి కొద్దిమంది రచయితల్లో సుధాకర్ గారు ముందు వరసలో వుంటారు.

కథను మీకందించడానికి అనుమతినిచ్చిన సుధాకర్ గారికి కృతజ్ఞతలు.

'తూరుపు గాలులు' పుస్తకం కొనడానికి ...
184
May 4, 2021

'మంత్రపుష్పం' - మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథ

హర్షణీయంలో ఇప్పుడు వినబోయే కథ - మంత్రపుష్పం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన.

తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది.

కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది.

ఈ కథను మీకందించడానికి ...
183
May 3, 2021

వాకాటి పాండురంగరావు గారి 'మందీ - మరొక్కడు'

హర్షణీయంలో వినబోయే కథ పేరు 'మందీ - మరొక్కడు' వాకాటి పాండురంగరావు గారి రచన. ఈ కథను అందించడానికి అనుమతినిచ్చిన అపరాజిత గారికి కృతజ్ఞతలు.

సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో జన్మించారు. ఆయన ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు. విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు.

పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత ...
179
April 24, 2021

'హెడ్ మాస్టారు ' పాలగుమ్మి పద్మరాజు గారి రచన!

న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘హెడ్ మాస్టారు ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది .

పుస్తకం కొనడానికి కావాల్సిన web link

Palagummi Padmaraju Rachanalu -Vol1
కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు.

ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.

హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/po...
177
April 23, 2021

వాకాటి పాండురంగరావు గారి పై శ్రీరమణ గారు , మధురాంతకం నరేంద్ర గారు!

సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో జన్మించారు. ఆయన ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు. విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు.

పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు.

ఈ ఎపిసోడ్ లో పాండురంగరావు గారి గురించి ప్రముఖ కథా రచయితలు శ్రీ రమణ గారు ,...
174
April 9, 2021

'అంటు కొమ్మ' - అక్కిరాజు భట్టిప్రోలు గారి రచన

‘అంటుకొమ్మ’ కథ శ్రీ అక్కిరాజు భట్టిప్రోలు గారు రాసిన ‘మూడు బీర్ల తర్వాత’ అనే పుస్తకం లోనిది. తన మూలాలను వెతుక్కుంటూ, ఒక మహిళ చేసే ప్రయాణమే ఈ కథ. కథను చాలా వాస్తవికంగా, ముగింపును హృద్యంగా చిత్రీకరించారు రచయిత.

విభిన్న అంశాలను స్పృశిస్తూ అక్కిరాజు గారు రాసిన ‘ మూడు బీర్ల తర్వాత’ ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన అతి చక్కని కథాసంపుటాల్లో ఒకటి.

పుస్తకం కొనడానికి కావాల్సిన web link …. https://bit.ly/3d4M0lv

కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అక్కిరాజు గారికి కృతజ్ఞతలు.

అంటుకొమ్మ

“అంటు కట్టడం” అంటే? ఈ...
173
April 7, 2021

'ఎందుకు పారేస్తాను నాన్నా!' చాగంటి సోమయాజులు గారి రచన

చాగంటి సోమయాజులు గారు 'చాసో' గా తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. ఆధునిక తెలుగు కథను ప్రగతి శీల భావాలతో సుసంపన్నం చేసిన చాసో ఎన్నో గొప్ప కథలను రచించారు. 1945 వ సంవత్సరంలో 'భారతి' మాస పత్రికలో ప్రచురితమైన ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చింది చాగంటి తులసి గారికి , కథకు ఆడియో ని అందించిన చాగంటి కృష్ణ కుమారి గారికి కృతజ్ఞతలు.

ఇదే పేజీలో ఈ కథపై, సారంగ వెబ్ మ్యాగజైన్ లో ప్రముఖ రచయిత శ్రీ అరిపిరాల సత్య ప్రసాద్ గారు చేసిన చక్కని సమీక్షను కూడ వెబ్ లింక్ ద్వారా మీరు చదవొచ్చు.



కథ :

చ...
170
April 2, 2021

'సీతా.....రాముడొస్తున్నాడోయ్ ' - యండమూరి గారి రచన !



నవలా రచయితగా, లక్షల కొద్దీ అభిమానుల ఆదరం చూరగొన్న యండమూరి వీరేంద్రనాథ్ గారు, గొప్ప నాటికలను రచించారు, అలాగే అతి చక్కటి కథలను కూడా . ఆయన రచించిన కథలలోనించి ఎంపిక చేసిన 25 కథలతో వచ్చిన పుస్తకం ' ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్' .

ఆ పుస్తకంలోని చివరి కథ ఇప్పుడు మీరు వినబోయే, 'సీతా... రాముడొస్తున్నాడోయ్'.

ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు.

ఈ పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండి

https://www.telugubooks.in/products/the-best-of-yandamoori-vee...
169
March 28, 2021

మందలపర్తి కిశోర్ గారి సమీక్ష - 'తోటి వేటగాళ్లు' కథపై

తోటి వేటగాళ్లపై మందలపర్తి కిషోర్ గారి సమీక్ష

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
168
March 28, 2021

'తోటి వేటగాళ్లు' కేఎన్వై పతంజలి గారి కథ!

'తోటి వేటగాళ్లు' కే ఎన్ వై పతంజలి గారు రాసిన , వేట కథలు అనే కథాసంపుటం లోనిది.

ఈ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి.

https://www.telugubooks.in/products/patanjali-sahityam-1

తోటి వేటగాళ్లు కథపై శ్రీ మండలపర్తి కిషోర్ గారి సమీక్ష కూడా ఆడియోలో మీరు వినవచ్చు.

తోటి వేటగాళ్ళు !

బండివేగిసచెట్టు చేతులెత్తి, జుత్తు విరబోసుకు నిల్చుని రాక్షసుడిలాగుంది ఆ చీకటిలో.

దానినీ , దానితో కొమ్మలు కలిపి నిల్చున్న పచ్చగాత చెట్టునీ అల్లుకుని పాకిన అడ్డతీగ పాదు కొసలు కొన్ని ఉరిత్రాళ్ళలాగ వేలాడు తున్నాయి. బండి...
166
March 20, 2021

'సచ్చి సాదించడం' - ఎండపల్లి భారతి గారు

'సచ్చిసాదించడం ' ఎండపల్లి భారతి గారు రాసిన ' ఎదారి బతుకులు' లోని కథ . ఈ కథలో వాళ్ళ పల్లెలో వుండే ఒక మూఢ ఆచారాన్ని గురించీ, దానివల్ల వాళ్ళ కుటుంబం పడిన ఇబ్బంది గురించి రాసారు భారతి గారు.

...............................................................................................................................................................................

మాయత్తకు, మొగుడు ఉండి గూడా అందరి ముందరా ముండమోపి బతుకు బతకాల్సి వచ్చింది.

మాది పెద్ద సంసారం. నాకు కొత్తగా పెండ్లయినబ్బుడు అందరం కూడా ...
157
March 6, 2021

ఎండపల్లి భారతి గారి 'ఎదారి బతుకులు' పై ప్రముఖ రచయిత ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష!

ఎండపల్లి భారతి గారి 'ఏదారి బతుకులు' పై ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష ను ఈ ఎపిసోడ్ లో వినవచ్చు.

ఉమామహేశ్వర రావు గారికి హర్షణీయం కృతజ్ఞతలు.

'ఎదారి బతుకులు పుస్తకం కొనడానికి ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి. http://bit.ly/3elxpDj

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
155
Feb. 27, 2021

'నారింజ రంగు సిరా మరకలు' పార్ట్ II -కథా -సమీక్ష

ఈ ఎపిసోడ్లో , 'నారింజ రంగు సిరా మరకలు ' కథ గురించి , లాయర్, సామాజిక కార్యకర్త అరుణాంక్ లత గారు, రచయిత్రి, మానస ఎండ్లూరి గారు, రచయితలు అరిపిరాల సత్యప్రసాద్ గారు, వెంకట్ శిద్ధా రెడ్డి గారు మాట్లాడతారు.

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
154
Feb. 27, 2021

'నారింజ రంగు సిరా మరకలు' - మహి బెజవాడ ! పార్ట్ - I

రచయిత పరిచయం:

వాక్యాలనూ రంగులనూ జమిలీగా సాధన చేస్తున్న రచయిత. స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. పుట్టింది 1981లో. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి మెడికల్ ఫార్మసీ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్షియో క్రియేటివ్ ఏజెన్సీ ద్వారా పబ్లిసిటీ వర్క్ చేస్తున్నారు. డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇప్పటికి ఏడెనిమిది కథలు రాశారు. 'డెడ్ మాన్ గోయింగ్ టు సింగ్' కథలో భిన్నమైన శిల్పంతో ఆకట్టుకున్నారు. 'ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్నర్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దానిని విజువలైజ్ చేయడాన...
149
Feb. 14, 2021

వేలు పిళ్లై రామచంద్ర రావు గారి గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు !

ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి - (వేలుపిళ్లై కథలకు ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన ముందు మాట)

'పొగడ పూలు':

గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు.

రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి.

యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు రాసినవి తొమ్మిది కథలే!

నల్లతోలు, వేలుపిళ్లై, ఏనుగులరాయి, టెన్నిస్ టూర్నమెంటు, గాళిదేవరు, కంపెనీ...
Talk to us!