115
Oct. 28, 2022
తెలుగు సాహిత్యం లో గొప్ప కథలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా, హర్షణీయం సుప్రసిద్ధ పాత్రికేయులు , రచయిత, కవి, అనువాదకులు శ్రీ మందలపర్తి కిషోర్ గారిని, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథా రచనలపై తన అభిప్రాయాలను , 'నల్లజర్ల రోడ్డు', 'దేవుణ్ణి చూసిన వాడు', 'దొంగ' కథలపై విశ్లేషణలను, హర్షణీయం పాఠకులకు ప్రత్యేకంగా అందించామని కోరడం జరిగింది. కిషోర్ గారు వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి, వ్యాస రూపంలోనూ , ఆడియో రూపం లోనూ మనకు ఈ విశ్లేషణను ఆయన అందించడం జరిగింది. ఈ విశ్లేషణను అత్యంత ఆసక్తికరంగా , తిలక...