Oct. 28, 2022

తిలక్ గారి కథారచన పై సుప్రసిద్ధ పాత్రికేయులు, రచయిత, కవి, మందలపర్తి కిషోర్ గారి విశ్లేషణ.

తిలక్ గారి కథారచన పై సుప్రసిద్ధ పాత్రికేయులు,  రచయిత, కవి, మందలపర్తి కిషోర్ గారి విశ్లేషణ.
Apple Podcasts podcast player iconSpotify podcast player iconYoutube Music podcast player icon
Apple Podcasts podcast player iconSpotify podcast player iconYoutube Music podcast player icon

తెలుగు సాహిత్యం లో గొప్ప కథలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా, హర్షణీయం సుప్రసిద్ధ పాత్రికేయులు , రచయిత, కవి, అనువాదకులు శ్రీ మందలపర్తి కిషోర్ గారిని, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథా రచనలపై తన అభిప్రాయాలను , 'నల్లజర్ల రోడ్డు', 'దేవుణ్ణి చూసిన వాడు', 'దొంగ' కథలపై విశ్లేషణలను, హర్షణీయం పాఠకులకు ప్రత్యేకంగా అందించామని కోరడం జరిగింది. కిషోర్ గారు వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి, వ్యాస రూపంలోనూ , ఆడియో రూపం లోనూ మనకు ఈ విశ్లేషణను ఆయన అందించడం జరిగింది. ఈ విశ్లేషణను అత్యంత ఆసక్తికరంగా , తిలక్ గారి రచనల గురించి అనేక చక్కటి విషయాలను వివరిస్తూ , కిశోర్ గారు నిర్వహించారు. వారికి హర్షణీయం హృదయ పూర్వక కృతజ్ఞతలు.

కిషోర్ గారు గత మూడున్నర దశాబ్దాలనించి తెలుగు లోనూ ఇంగ్లీష్ లోనూ కవిత్వం రాస్తున్నారు. పుస్తక అనువాదాలు చేస్తున్నారు. పత్రిక రంగంలో విశేష కృషి చేశారు. సిఫీ, ఇండియా టుడే-తెలుగు పత్రికల సంపాదకునిగా వ్యవహరించారు. 'కన్యాశుల్కం పలుకుబడి' (గురజాడ పదకోశం - 1), పడమటి కిటికీ (పాశ్చాత్య సాహిత్య పరిచయం) , పెరటి చెట్టు (వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర పరిచయం) అనే పుస్తకాలు ప్రచురించారు. 'అనువాదం - కవిత్వానువాదం' అనే పుస్తకాన్ని ప్రచురింపబోతున్నారు.

హర్షణీయంలో 'దేవుణ్ణి చూసిన వాడు' , 'దొంగ' కథలను ఇప్పటికే ప్రచురించడం జరిగింది. 'నల్లజర్ల రోడ్డు' కథ డిసెంబర్ మొదటి వారంలో ప్రచురింపబడుతుంది.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp