Conversations on contemporary literature from across the world, in translation.

Episodes

167
Feb. 14, 2023

'బేడమ్మ' - శ్రీరమణ గారి కథ

'బేడమ్మ' అనే ఈ కథ శ్రీరమణ గారు రచించింది.

శ్రీరమణ గారు రాసిన శ్రీ ఛానల్ - 2 అనే సంకలనం లోనిది. పుస్తకం కొనడానికి ఇదే వెబ్ పేజీ లో ఉన్న లింక్ ని ఉపయోగించండి.

https://www.telugubooks.in/products/sri-channel-2

బేడమ్మ ఆవిడ అసలు పేరేమిటో తెలియదు. పుట్టు పూర్వోత్తరాలూ తెలియవు. ఎవర్ని అడిగినా “మాకు గ్రాహ్యం వచ్చినప్పట్నించీ బేడమ్మ యిలాగే వుంది. గోగుకాడలా” అంటారు తప్ప వయసు చెప్పలేరు.

ఒంగిపోకపోయినా నిలువెల్లా వార్థక్యం తెలుస్తూనే ఉండేది.

బ్రాహ్మణ వీధిలో ఉన్న పది యిళ్లూ తనవే అనుకునేది బేడమ్మ. రోజుకో ...
114
Feb. 14, 2023

తిలక్ గారి 'దేవుణ్ణి చూసిన మనిషి'

తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.

తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.

ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.

ఇప్పుడు వినబోయే కథ 'దేవుణ్ణి చూసిన మనిషి' - 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు ప...
156
Feb. 13, 2023

'అహింస' దాదా హయత్ గారి కథ!

'అహింస' దాదా హయత్ గారి 'మురళి ఊదే పాపడు' అనే కథా సంపుటం లోనిది. వృత్తిరీత్యా లాయర్ ఐన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. దాదాపుగా డెబ్బై కథలు రాసారు. ఒక స్కూలు పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక విశ్లేషణనీ, పొందికైన పదాల కూర్పునీ మనం చూడొచ్చు.

కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన దాదా హయత్ గారికి కృతజ్ఞతలు.

ఈ పుస్తకం కొనాలంటే, ఈ లింకుపై క్లిక్ చెయ్యండి -
http://bit.ly/2Ok88yb

అహింస:

అది మోకాలి మీదికి పాకింది. అది ఒకసారి గంభీరంగా తన స్థితి గతులు' పరీక్ష...
152
Feb. 13, 2023

వంశీ గారి 'సొట్ట ఆదిగాడు' - 'మా దిగువ గోదారి కథలు' నుంచి

'సొట్ట ఆదిగాడు' అనే ఈ కథ, వంశీ గారి "మా దిగువ గోదారి కథలు' అనే కధాసంపుటి నించి.

పుస్తకం కొనడానికి - https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.)

'సొట్ట ఆదిగాడు':

ఆ వూళ్ళో వున్న అరవై ఎకరాల తోటలూ, వూరికి ఎదురుగా వున్న గోదావరి మధ్యలో వున్న వంద ఎకరాల లంకలు రావి కంపాడు రాజులవి.

ఆ రాజుల తాలూకు గుమాస్తాలే వూళ్ళో వుండి కూలోళ్ళనీ పాలేళ్ళనీ పెట్టి పంటలు పండిస్తున్నారు. అదీ ఈనాటి నించి కాదు ఏనాటి నించో.

అయితే, దొంగలుగానీ, దోచు...
142
Feb. 13, 2023

'నైట్ డ్యూటీ' - డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథ

“ తెరిచిన గుడిలాంటిది హాస్పటల్. బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్”

ఏమి జోక్ వేశారు సార్! కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్. పగిలిన సిరంలు, మొద్దుబారిన నీడిల్సూ, ఎక్స్పయిరీ డేటు అయిపోయి 'మృత్యువు నోట్లో పాలపీకలం' అన్నట్లుగా చూస్తున్న స్క్రిప్టో పెన్సి లిన్లూ, నైవేద్యపు చీరపై మెన్సెస్ మరకలా ఫంగస్ పట్టిన సెలైన్ బాటిల్సు- ఇది సార్ హాస్పటల్ అంటే. తుప్పు పట్టిన మంచాలూ, అన్ని రకాల బాక్టీరియాలకూ, వైరస్లకూ ఆహ్వానం పిలికే ముసలి వేశ్యల్లాంటి బెడ్లు, వాటి పై భగవంతుని కర్మాగారంలో పనికిరాక పారవేసిన యంత్రాల్లాంటి ...
200
Feb. 13, 2023

Part 2 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు

కేంపు సైటుకి మైలు దూరంలో వుంది “వర్క్ స్పాట్”, కారడవిలో కొత్తగా రైల్వే లైను వేస్తున్నారు. వేలాది పనివాళ్ళు శ్రమించి పని చేస్తున్నారు. సూర్యోదయం నుంచి తిరిగి సూర్యాస్తమయందాకా బుల్ డోజర్లు, డంపర్లు, కేసులు ధడ్ ధడ్ మని శబం చేస్తుంటాయి. అక్కడే ఒక పెద్ద బ్రిడ్జి కూడా కడుతున్నారు. రోజంతా గుబిలు గుభిలుమని కొండ రాళ్ళు పేలుతుంటాయి. హిందుస్తానీలు, బ్రిడ్జి పనులు చేసే మళయాళీ మోపలాలు, సర్దార్జీలు, బంగాళీ బాబులు, ఒకరేవిటీ అన్ని రకాల జాతుల వారినీ అక్కడ చూడొచ్చు. ఉత్తరాదినుండి వచ్చిన కంట్రాక్టర్లు, కేంపుని వర్...
199
Feb. 13, 2023

Part 1 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు

‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది.

పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.

బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.

ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.

అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. ...
148
Feb. 13, 2023

సి.రామచంద్ర రావు గారి 'ఏనుగుల రాయి'!

సి.రామచంద్ర రావు గారు రాసిన ఈ కథ ‘వేలుపిళ్లై’ అనే కథా సంపుటం లోనిది. కథను మీకు హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన రామచంద్ర రావు గారికి కృతజ్ఞతలు. వచ్చే వారం హర్షణీయంలో రామచంద్ర రావు గారితో ఇంటర్వ్యూ మీరు వినవచ్చు.

అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా , మార్చి రెండో వారంలో ‘వేలు పిళ్ళై కథలు ‘ కొత్త ఎడిషన్ రిలీజ్ అవుతోంది.

కథలోకి వెళ్లబోయ్యే ముందు ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి –

‘పొగడ పూలు’:

గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప...
207
Feb. 12, 2023

స వెం రమేష్ గారి 'ఉత్తర పొద్దు' - 'ప్రళయకావేరి కథలు' సంకలనం నుంచి

‘ప్రళయ కావేరి కథలు’ పుస్తకం కొనాలంటే - https://bit.ly/2TXhEub
ఉత్తర పొద్దు :

మా ఊరిని ఆనుకొనే ఉంది. ప్రళయకావేరి. సుమారు ముప్పై మైళ్ల పొడవు .. పది మైళ్ల వెడల్పు ఉన్న సరస్సు అది. ప్రళయ కావేట్లో నలభై వరకూ దీవులు న్నాయి. వాటికి రకరకాల పేర్లు. వాటిల్లో కొన్ని దీవుల్లో మాకు చుట్టాలున్నారు.

ఆ దీవుల్లో ఒకటి 'జల్లల దొరవు.' విసిరేసినట్లు ఒక మూలగా ప్రళయకావేరి ఒడిలో ఒదిగి ఉండేది. ఆ దీవిలో నాకు వరసకు మామ ఒకాయన ఉండేవాడు. వాళ్లింటికీ మా ఇంటికీ రాకపోకలు ఉండేవి. నేను కూడా అప్పుడప్పుడూ అక్కడకు పోతుండేవాడిని.

జ...
119
Oct. 31, 2022

శ్రీరమణీయం - నాలుగో భాగం : వారి కథా రచన

హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు .

సుప్రసిద్ధ కథకులు , పత్రికాసంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది.

శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు.

తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు.

ఆంధ్రజ్యోతి పత్రిక లో కాలమిస్టుగా , నవ్య పత్రికకు సంపాదకునిగా. ఒక గొప్ప కథా రచయితగ...
118
Oct. 30, 2022

శ్రీరమణీయం - మూడో భాగం : బాపురమణ గార్లు

హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు .

సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది.

శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు.

తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు.

ఆంధ్రజ్యోతి పత్రిక లో కాలమిస్టుగా , నవ్య పత్రికకు సంపాదకునిగా. ఒక గొప్ప కథా రచయిత...
117
Oct. 29, 2022

శ్రీరమణీయం - రెండోభాగం : కవిసామ్రాట్ విశ్వనాథ

116
Oct. 29, 2022

శ్రీరమణీయం - మొదటి భాగం: బాల్యం , రచనా జీవితానికి అంకురం

హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు .

సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది.

శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు.

తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు.

ఆంధ్రజ్యోతి పత్రిక లో కాలమిస్టుగా , నవ్య పత్రికకు సంపాదకునిగా. ఒక గొప్ప కథా రచయిత...
115
Oct. 28, 2022

తిలక్ గారి కథారచన పై సుప్రసిద్ధ పాత్రికేయులు, రచయిత, కవి, మందలపర్తి కిషోర్ గారి విశ్లేషణ.

తెలుగు సాహిత్యం లో గొప్ప కథలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా, హర్షణీయం సుప్రసిద్ధ పాత్రికేయులు , రచయిత, కవి, అనువాదకులు శ్రీ మందలపర్తి కిషోర్ గారిని, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథా రచనలపై తన అభిప్రాయాలను , 'నల్లజర్ల రోడ్డు', 'దేవుణ్ణి చూసిన వాడు', 'దొంగ' కథలపై విశ్లేషణలను, హర్షణీయం పాఠకులకు ప్రత్యేకంగా అందించామని కోరడం జరిగింది. కిషోర్ గారు వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి, వ్యాస రూపంలోనూ , ఆడియో రూపం లోనూ మనకు ఈ విశ్లేషణను ఆయన అందించడం జరిగింది. ఈ విశ్లేషణను అత్యంత ఆసక్తికరంగా , తిలక...
132
Oct. 27, 2022

సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం! - నాలుగవ భాగం

హర్షణీయానికి స్వాగతం. డాక్టర్ పతంజలి శాస్త్రి గారి రచనా జీవితం, రచనలను ప్రభావితం చేసిన అంశాల గురించి, గత వారం , హర్షణీయం ఆయనతో సంభాషించడం జరిగింది.

హర్షణీయం టీం తో బాటూ, ఛాయా మోహన్ బాబు గారు, బొలిమేరు ప్రసాద్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.

శాస్త్రి గారికి , మోహన్ గారికి , ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు.

ఆర్కియాలజీ లో డాక్టరేట్ తీసుకున్న తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు అరవైకి పైగా కథలు , మూడు నవలలు మనకందించారు.

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https...
131
Oct. 26, 2022

సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం! - మూడవ భాగం

హర్షణీయానికి స్వాగతం. డాక్టర్ పతంజలి శాస్త్రి గారి రచనా జీవితం, రచనలను ప్రభావితం చేసిన అంశాల గురించి, గత వారం , హర్షణీయం ఆయనతో సంభాషించడం జరిగింది.

హర్షణీయం టీం తో బాటూ, ఛాయా మోహన్ బాబు గారు, బొలిమేరు ప్రసాద్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.

శాస్త్రి గారికి , మోహన్ గారికి , ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు.

ఆర్కియాలజీ లో డాక్టరేట్ తీసుకున్న తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు అరవైకి పైగా కథలు , మూడు నవలలు మనకందించారు.

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https...
130
Oct. 25, 2022

సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం! - రెండవ భాగం

హర్షణీయానికి స్వాగతం. డాక్టర్ పతంజలి శాస్త్రి గారి రచనా జీవితం, రచనలను ప్రభావితం చేసిన అంశాల గురించి, గత వారం , హర్షణీయం ఆయనతో సంభాషించడం జరిగింది.

హర్షణీయం టీం తో బాటూ, ఛాయా మోహన్ బాబు గారు, బొలిమేరు ప్రసాద్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.

శాస్త్రి గారికి , మోహన్ గారికి , ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు.

ఆర్కియాలజీ లో డాక్టరేట్ తీసుకున్న తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు అరవైకి పైగా కథలు , మూడు నవలలు మనకందించారు.

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https...
129
Oct. 24, 2022

సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం! - మొదటి భాగం

హర్షణీయానికి స్వాగతం. డాక్టర్ పతంజలి శాస్త్రి గారి రచనా జీవితం, రచనలను ప్రభావితం చేసిన అంశాల గురించి, గత వారం , హర్షణీయం ఆయనతో సంభాషించడం జరిగింది.

హర్షణీయం టీం తో బాటూ, ఛాయా మోహన్ బాబు గారు, బొలిమేరు ప్రసాద్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.

శాస్త్రి గారికి , మోహన్ గారికి , ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు.

ఆర్కియాలజీ లో డాక్టరేట్ తీసుకున్న తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు అరవైకి పైగా కథలు , మూడు నవలలు మనకందించారు.

చర్చలోకి వెళ్లబోయే ముందు, ఛాయా మోహన్ గారి మాటల్లో శాస్త్రి గారి రచనల గురించి మనం వి...
128
Oct. 23, 2022

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో 'హర్షణీయం' ఇంటర్వ్యూ !

తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు.

ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది.

రెండు వారాల క్రితం 'హర్షణీయం' ఇనాక్ గారితో ఆయన రచనలు, జీవితాన్ని గురించి సంభాషించే అవకాశం కలిగింది. ఈ ఎపిసోడ్ లో ఆ ఇంటర్వ్యూ మీరు వినవచ్చు.

హర్షణీయం శ్రోతలకై తన సమయాన్ని వెచ్చిం...
140
Oct. 21, 2022

'మునికాంతపల్లి కథలు ' - సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.

ఒకే కథాసంకలనం లో 23 చిట్టి పొట్టి కథలు -

విఫలమైన ప్రేమ

సఫలమైన ప్రేమ

చిన్న చిన్న ఆనందాలూ

చిన్నతనాన్ని గుర్తు చేసే అందమైన స్నేహాలూ , అనుబంధాలూ

షాక్ ఇచ్చే ట్విస్టెడ్ ముగింపులు కొన్నీ, ఓపెన్ ఎండెడ్ బుర్ర తొలిచేసే ముగింపులు,

కొన్ని వ్యర్థాభరిత జీవితాలు , కొన్ని ఉత్సాహాన్నిచ్చే ముగింపులూ

ఒక్కోసారి నడిపిస్తూ , ఒక్కోసారి అడ్డుతగిలే మతమూ

అర్ధమయ్యే గొప్ప తాత్వికత

ఇవన్నీ -

ఇంతకు ముందెన్నడూ మనం చవిచూడని ఒక కొత్త నేపథ్యంలో , రచయిత తాను ఎక్కడా పాఠకుడికి , పాత్రల మధ్య అడ్డం రాకుండా , ఒక గుడి గోపురంలా...
144
Oct. 20, 2022

డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై , శ్రీ వాసిరెడ్డి నవీన్ గారి ప్రసంగం!

ఈ ఎపిసోడ్ లో , సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు ప్రసంగిస్తారు.

చంద్రశేఖర్ రావు గారి రచనాశైలిపై , రచనలపై చక్కని విశ్లేషణను అందించిన నవీన్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

వాసిరెడ్డి నవీన్ గారి గురించి:

'కథా నవీన్' గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. ఎన్నో సమీక్ష వ్యాసాలు , కథలూ , కవితలూ రాసారు. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసా...
146
Oct. 20, 2022

'నల్లగొండ కథలు' రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం! Part - II

నల్లగొండకు చెందిన వి.మల్లికార్జున్ గారు పత్రికా రంగంలో పనిచేసి, ఇప్పుడు సినీ పరిశ్రమ లో ప్రవేశిస్తున్నారు. 'నల్లగొండ కథలు' ఆయన రచించిన మూడో కథల సంపుటి. ఈ ఇంటర్వ్యూ లో తన రచనల గురించి, రచనా జీవితాన్ని గురించి మల్లికార్జున్ గారు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది.

https://harshaneeyam.in/2021/01/16/nallagonda/

https://harshaneeyam.in/2021/01/21/nalgonda-comments/

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
145
Oct. 19, 2022

'నల్లగొండ కథలు' రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం! Part - I

నల్లగొండకు చెందిన వి.మల్లికార్జున్ గారు పత్రికా రంగంలో పనిచేసి, ఇప్పుడు సినీ పరిశ్రమ లో ప్రవేశిస్తున్నారు. 'నల్లగొండ కథలు' ఆయన రచించిన మూడో కథల సంపుటి. ఈ ఇంటర్వ్యూ లో తన రచనల గురించి, రచనా జీవితాన్ని గురించి మల్లికార్జున్ గారు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది.

https://harshaneeyam.in/2021/01/16/nallagonda/

https://harshaneeyam.in/2021/01/21/nalgonda-comments/

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
147
Oct. 17, 2022

'కే ఎన్ వై పతంజలి' గారి కథా రచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు మందలపర్తి కిషోర్ గారు!

తెలుగు సాహిత్యం లోని గొప్ప రచయితలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా, హర్షణీయం సుప్రసిద్ధ పాత్రికేయులు , రచయిత, కవి, అనువాదకులు శ్రీ మందలపర్తి కిషోర్ గారిని, శ్రీ కే ఎన్ వై పతంజలిగారి గారి కథా రచనలపై తన అభిప్రాయాలను , 'మోటు మనిషి ', 'తోటి వేటగాళ్లు ', 'సీతమ్మ లోగిలి ' కథలపై విశ్లేషణలను, హర్షణీయం పాఠకులకు ప్రత్యేకంగా అందించమని కోరడం జరిగింది. కిషోర్ గారు వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి, ఆడియో రూపం లోనూ మనకు ఈ విశ్లేషణను ఆయన అందించడం జరిగింది. అత్యంత ఆసక్తికరంగా , పతంజలి గారి రచనల గురించి అనేక చక...
Talk to us!