Conversations on contemporary literature from across the world, in translation.

Episodes

25
March 26, 2023

ప్రసాదం : కథా మూలం - ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు

ప్రసాదం - ఈ కథకు మూలం ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు.

కథలోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న గమనిక - హర్షణీయం స్పాటిఫై ఆప్ ద్వారా వినే శ్రోతలు ఇప్పుడు కథపై తమ అభిప్రాయాన్ని తెలియచేసే అవకాశం వుంది. మీ అభిప్రాయాలు వెంటనే ఆప్ ద్వారా ప్రచురితం అవుతాయి.

స్పాటిఫై ద్వారా హర్షణీయం ను వినడానికి, కొత్తగా వచ్చే ఎపిసోడ్స్ ని వెంటనే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ ఇచ్చిన లింక్ ని వాడి , ఆప్ లోని ఫాలో బటన్ ని నొక్కండి.

https://bit.ly/harshspot

**************

ప్రసాదం (1958): తమిళ మూలం - సుందర రామస్...
22
March 10, 2023

యువ రచయిత వెంకట నారాయణ గారితో పరిచయం

ఇరవై మూడేళ్ళ వెంకటనారాయణ పల్నాడు జిల్లా గరికపాడు గ్రామానికి చెందిన వారు. ఎం ఏ తెలుగు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పూర్తి చేశారు. 'భూమి పతనం' అనే నవల, 'ఇయ్యాల మా వూళ్ళో' అనే కవితా సంకలనం గత సంవత్సరం ప్రచురితమయ్యాయి. మంచి చదువరి.

ఈ రచయితలా రాసేదానికంటే ఎక్కువ చదువుతూ , తాను చదివిన పుస్తకాల గురించి చక్కగా అర్థవంతంగా మాట్లాడే రచయితలు చాలా అరుదు. ప్రస్తుతం 'గరికపాటోడి కథలు' అనే కథా సంపుటి ని, 'కాపలాదారుల పాటలు' అనే కవితాసంపుటిని ప్రచురించే పనిలో వున్నారు.

భూమి పతనం నవల కొనడానికి -

https://bi...
20
March 5, 2023

‘చిలుకంబడు దధికైవడి’ - మూలం తమిళ రచయిత జెయమోహన్ రచన ‘మత్తుఱు తయిర్’

ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ. జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన వ్యక్తుల గురించి మనకు చెబుతూ రచయిత రాసిన కథలు.
ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. (https://tamil.wiki/wiki/Professor_Jesudasan) కన్యాకుమారి జిల్లాలో ఒక నీరుపేద కుటుంబంలో జన్మించారు. ‘కంబ రామాయణం’ ...
21
March 4, 2023

‘చిలుకంబడు దధికైవడి’ కథాసమీక్ష - ఉణుదుర్తి సుధాకర్ గారు

‘చిలుకంబడు దధికైవడి’ అనే కథకు మూలం, రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ, ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
ఈ కథను ప్రముఖ కథా రచయిత శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు ఈ ఎపిసోడ్ లో సమీక్షిస్తారు.
వారికి కృతజ్ఞతలు.
ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ. జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన వ్యక్తుల గుర...
19
Feb. 25, 2023

'ఇసుక అద్దం' శ్రీ వూహ గారితో సంభాషణ

శ్రీ వూహ గారి మొదటి కథా సంపుటం 'ఇసుక అద్దం'డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో తన కథారచన గురించి, తనను ప్రభావితం చేసిన విషయాల గురించి శ్రీ వూహమాట్లాడారు.

ఇసుక అద్దం కొనడానికి క్రింది లింక్ ను ఉపయోగించండి.

https://bit.ly/isukaaddam

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
18
Feb. 18, 2023

'సత్యలింగం' - పతంజలి శాస్త్రి గారి రచన (గుప్తా'91 సంపుటం నించి)

సత్యలింగం’ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘గుప్తా’91’ సంపుటం లోనిది. పుస్తకం కొనడానికి కింద ఇచ్చిన లింక్ వాడొచ్చు. గత సంవత్సరం చదివిన నేను చదివిన కథల్లో నిస్సందేహంగా సత్యలింగం అత్యుత్తమైన కథ.

కథలోకెడితే 'టీటీ' అని పిలవబడే రైల్వే టికెట్ కలెక్టర్ కాంతారావు స్నేహితుడు స్వామి. తన ఇంట్లో అద్దెకుండే కూర్మయ్య నాయుడి గురించి స్వామికి చెప్పుకుంటూ ఉంటాడు కాంతారావు. నాయుడు విపరీతమైన కోపిష్టి. ఒళ్ళూపైతెలీని కోపంతో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. తన జీవితంలో ప్రశాంతత నెలకొనేటందుకు, కాంతారావును సలహా అడుగుతాడు నాయ...
17
Feb. 17, 2023

మధురాంతకం రాజారాం గారి కథలు, రచనా జీవితం పై మధురాంతకం నరేంద్ర గారు

1993 వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారాం గారు తెలుగులో సుప్రసిద్ధ కథారచయిత. చిత్తూరు జిల్లాకు చెందిన రాజారాం గారు మూడు వందలకు పైగా కథలు రాసారు. వారి సమగ్ర కథాసంకలనం కిందటి వారం ఎమెస్కో పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఇందులో 295 కథలు ఐదు భాగాలలో ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మధురాంతకం నరేంద్ర గారు వారి నాన్న గారి కథల గురించి , రచనా జీవితం గురించి మాట్లాడటం జరిగింది.

పుస్తకం కొనడానికి పల్లవి పబ్లిషర్స్ వెంకట నారాయణ గారిని 9866115655 ద్వారా వాట్స...
167
Feb. 14, 2023

'బేడమ్మ' - శ్రీరమణ గారి కథ

'బేడమ్మ' అనే ఈ కథ శ్రీరమణ గారు రచించింది.

శ్రీరమణ గారు రాసిన శ్రీ ఛానల్ - 2 అనే సంకలనం లోనిది. పుస్తకం కొనడానికి ఇదే వెబ్ పేజీ లో ఉన్న లింక్ ని ఉపయోగించండి.

https://www.telugubooks.in/products/sri-channel-2

బేడమ్మ ఆవిడ అసలు పేరేమిటో తెలియదు. పుట్టు పూర్వోత్తరాలూ తెలియవు. ఎవర్ని అడిగినా “మాకు గ్రాహ్యం వచ్చినప్పట్నించీ బేడమ్మ యిలాగే వుంది. గోగుకాడలా” అంటారు తప్ప వయసు చెప్పలేరు.

ఒంగిపోకపోయినా నిలువెల్లా వార్థక్యం తెలుస్తూనే ఉండేది.

బ్రాహ్మణ వీధిలో ఉన్న పది యిళ్లూ తనవే అనుకునేది బేడమ్మ. రోజుకో ...
114
Feb. 14, 2023

తిలక్ గారి 'దేవుణ్ణి చూసిన మనిషి'

తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.

తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.

ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.

ఇప్పుడు వినబోయే కథ 'దేవుణ్ణి చూసిన మనిషి' - 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు ప...
156
Feb. 13, 2023

'అహింస' దాదా హయత్ గారి కథ!

'అహింస' దాదా హయత్ గారి 'మురళి ఊదే పాపడు' అనే కథా సంపుటం లోనిది. వృత్తిరీత్యా లాయర్ ఐన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. దాదాపుగా డెబ్బై కథలు రాసారు. ఒక స్కూలు పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక విశ్లేషణనీ, పొందికైన పదాల కూర్పునీ మనం చూడొచ్చు.

కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన దాదా హయత్ గారికి కృతజ్ఞతలు.

ఈ పుస్తకం కొనాలంటే, ఈ లింకుపై క్లిక్ చెయ్యండి -
http://bit.ly/2Ok88yb

అహింస:

అది మోకాలి మీదికి పాకింది. అది ఒకసారి గంభీరంగా తన స్థితి గతులు' పరీక్ష...
152
Feb. 13, 2023

వంశీ గారి 'సొట్ట ఆదిగాడు' - 'మా దిగువ గోదారి కథలు' నుంచి

'సొట్ట ఆదిగాడు' అనే ఈ కథ, వంశీ గారి "మా దిగువ గోదారి కథలు' అనే కధాసంపుటి నించి.

పుస్తకం కొనడానికి - https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.)

'సొట్ట ఆదిగాడు':

ఆ వూళ్ళో వున్న అరవై ఎకరాల తోటలూ, వూరికి ఎదురుగా వున్న గోదావరి మధ్యలో వున్న వంద ఎకరాల లంకలు రావి కంపాడు రాజులవి.

ఆ రాజుల తాలూకు గుమాస్తాలే వూళ్ళో వుండి కూలోళ్ళనీ పాలేళ్ళనీ పెట్టి పంటలు పండిస్తున్నారు. అదీ ఈనాటి నించి కాదు ఏనాటి నించో.

అయితే, దొంగలుగానీ, దోచు...
142
Feb. 13, 2023

'నైట్ డ్యూటీ' - డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథ

“ తెరిచిన గుడిలాంటిది హాస్పటల్. బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్”

ఏమి జోక్ వేశారు సార్! కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్. పగిలిన సిరంలు, మొద్దుబారిన నీడిల్సూ, ఎక్స్పయిరీ డేటు అయిపోయి 'మృత్యువు నోట్లో పాలపీకలం' అన్నట్లుగా చూస్తున్న స్క్రిప్టో పెన్సి లిన్లూ, నైవేద్యపు చీరపై మెన్సెస్ మరకలా ఫంగస్ పట్టిన సెలైన్ బాటిల్సు- ఇది సార్ హాస్పటల్ అంటే. తుప్పు పట్టిన మంచాలూ, అన్ని రకాల బాక్టీరియాలకూ, వైరస్లకూ ఆహ్వానం పిలికే ముసలి వేశ్యల్లాంటి బెడ్లు, వాటి పై భగవంతుని కర్మాగారంలో పనికిరాక పారవేసిన యంత్రాల్లాంటి ...
200
Feb. 13, 2023

Part 2 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు

కేంపు సైటుకి మైలు దూరంలో వుంది “వర్క్ స్పాట్”, కారడవిలో కొత్తగా రైల్వే లైను వేస్తున్నారు. వేలాది పనివాళ్ళు శ్రమించి పని చేస్తున్నారు. సూర్యోదయం నుంచి తిరిగి సూర్యాస్తమయందాకా బుల్ డోజర్లు, డంపర్లు, కేసులు ధడ్ ధడ్ మని శబం చేస్తుంటాయి. అక్కడే ఒక పెద్ద బ్రిడ్జి కూడా కడుతున్నారు. రోజంతా గుబిలు గుభిలుమని కొండ రాళ్ళు పేలుతుంటాయి. హిందుస్తానీలు, బ్రిడ్జి పనులు చేసే మళయాళీ మోపలాలు, సర్దార్జీలు, బంగాళీ బాబులు, ఒకరేవిటీ అన్ని రకాల జాతుల వారినీ అక్కడ చూడొచ్చు. ఉత్తరాదినుండి వచ్చిన కంట్రాక్టర్లు, కేంపుని వర్...
199
Feb. 13, 2023

Part 1 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు

‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది.

పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.

బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.

ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.

అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. ...
148
Feb. 13, 2023

సి.రామచంద్ర రావు గారి 'ఏనుగుల రాయి'!

సి.రామచంద్ర రావు గారు రాసిన ఈ కథ ‘వేలుపిళ్లై’ అనే కథా సంపుటం లోనిది. కథను మీకు హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన రామచంద్ర రావు గారికి కృతజ్ఞతలు. వచ్చే వారం హర్షణీయంలో రామచంద్ర రావు గారితో ఇంటర్వ్యూ మీరు వినవచ్చు.

అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా , మార్చి రెండో వారంలో ‘వేలు పిళ్ళై కథలు ‘ కొత్త ఎడిషన్ రిలీజ్ అవుతోంది.

కథలోకి వెళ్లబోయ్యే ముందు ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి –

‘పొగడ పూలు’:

గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప...
207
Feb. 12, 2023

స వెం రమేష్ గారి 'ఉత్తర పొద్దు' - 'ప్రళయకావేరి కథలు' సంకలనం నుంచి

‘ప్రళయ కావేరి కథలు’ పుస్తకం కొనాలంటే - https://bit.ly/2TXhEub
ఉత్తర పొద్దు :

మా ఊరిని ఆనుకొనే ఉంది. ప్రళయకావేరి. సుమారు ముప్పై మైళ్ల పొడవు .. పది మైళ్ల వెడల్పు ఉన్న సరస్సు అది. ప్రళయ కావేట్లో నలభై వరకూ దీవులు న్నాయి. వాటికి రకరకాల పేర్లు. వాటిల్లో కొన్ని దీవుల్లో మాకు చుట్టాలున్నారు.

ఆ దీవుల్లో ఒకటి 'జల్లల దొరవు.' విసిరేసినట్లు ఒక మూలగా ప్రళయకావేరి ఒడిలో ఒదిగి ఉండేది. ఆ దీవిలో నాకు వరసకు మామ ఒకాయన ఉండేవాడు. వాళ్లింటికీ మా ఇంటికీ రాకపోకలు ఉండేవి. నేను కూడా అప్పుడప్పుడూ అక్కడకు పోతుండేవాడిని.

జ...
16
Feb. 11, 2023

'రామగ్రామ నుంచి రావణలంక దాకా' రచయిత సీతారామరాజు గారితో పరిచయం.

'రామగ్రామ నుంచి రావణలంక దాకా' నవల రచయిత సీతారామ రాజు గారి సొంత వూరు, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయి గూడెం. రియల్ ఎస్టేట్ రంగంలో వున్నారు. నివాసం హైదరాబాద్. ఆరు వారాల క్రితమే రిలీజ్ అయిన ఈ నవల 800 ప్రతుల మించి అమ్మకాలు సాధించి పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది.

పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి -

https://amzn.to/3EoRIMn

Harshaneeyam on apple podcast

https://apple.co/3K1vMdw

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy...
15
Feb. 5, 2023

'East Wind' పుస్తక పరిచయం - ఉణుదుర్తి సుధాకర్ గారితో

ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన 'తూరుపు గాలులు' పుస్తకం సౌత్ సైడ్ బుక్స్ పబ్లిషింగ్ ద్వారా ఇంగ్లీష్ లో 'East Wind' పేరుతో అనువదించబడింది. ఈ అనువాద ప్రక్రియలో తన అనుభవాన్ని సుధాకర్ గారు మనతో పంచుకున్నారు, ఈ ఎపిసోడ్లో. త్వరలో ఈ పుస్తకం Hyderabad book trust వెబ్సైటు ద్వారా, ఇతర పుస్తక విక్రేతల ద్వారా లభ్యం అవుతుంది.

ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన 'తూరుపు గాలులు' ' చలిచీమల కవాతు' కథాసంపుటాలు కూడా విశేష ఆదరణ పొందాయ...
14
Feb. 4, 2023

'తెలుగు కథ స్థాయి' - పాత్రికేయులు, రచయిత మందలపర్తి కిషోర్ గారితో సంభాషణ

మందలపర్తి కిషోర్ గారు గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు లోనూ ఇంగ్లీష్ లోనూ కవిత్వం రాస్తున్నారు. పుస్తక అనువాదాలు చేస్తున్నారు. తెలుగు కథను , ఇంగ్లీష్ కథను విస్తృతంగా చదివారు. పత్రికా రంగంలో విశేష కృషి చేశారు. సిఫీ, ఇండియా టుడే-తెలుగు పత్రికల సంపాదకునిగా వ్యవహరించారు. 'కన్యాశుల్కం పలుకుబడి' (గురజాడ పదకోశం - 1), పడమటి కిటికీ (పాశ్చాత్య సాహిత్య పరిచయం) , పెరటి చెట్టు (వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర-పరిచయం) అనే పుస్తకాలు ప్రచురించారు.

This podcast uses the following third-party services for analysis:
...
13
Jan. 21, 2023

'డిస్టోపియా' కథలు - రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం

గుంటూరు జిల్లాకి చెందిన శ్రీసుధ మోదుగు, వైద్యరంగంలో పనిచేస్తున్నారు. జమైకాలో నివాసం. 'అమోహం', 'విహారి', వీరి కవితా సంకలనాలు. రెక్కల పిల్ల, డిస్టోపియా అనే కథాసంపుటాలను ప్రచురించారు. 'అంతర్హిత' అనే నవల ఈ మధ్యనే విడుదల అయింది.

'డిస్టోపియా' కొనడానికి కింది లింక్ ఉపయోగించండి.

http://bit.ly/3wg2nUW

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
12
Jan. 20, 2023

'ఆట' - శ్రీసుధ గారు రాసిన 'డిస్టోపియా' నించి

'ఆట' అనే ఈ కథ శ్రీసుధ మోదుగు గారు రాసిన 'డిస్టోపియా' అనే కథా సంపుటం నించి. రచయిత్రి, కవయిత్రి అయిన శ్రీసుధ గారు వృత్తి రీత్యా వైద్యులు. జమైకాలో నివాసం. వారికి కృతజ్ఞతలు.

పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి.

http://bit.ly/3wg2nUW

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
11
Jan. 6, 2023

'దేవుడమ్మ మరో పది కథలు' - రచయిత్రి ఝాన్సీ గారితో సంభాషణ

ఝాన్సీ గారు రాసిన మొదటి కథల పుస్తకం 'దేవుడమ్మ మరో పది కథలు' ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చింది. 'లా' లో డిగ్రీ తీసుకున్న ఝాన్సీ గారు, మాస్టర్స్ ఇన్ జర్నలిజం , మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేశారు. కొన్నాళ్ళు తిరుపతి లో ఆంధ్రజ్యోతి - స్టాఫ్ రిపోర్టర్ గా పని చేసి, ప్రస్తుతం ఒక ఐటీ కంపెనీని నడుపుతూ బెంగుళూరులో నివాసం వుంటున్నారు.

అమెజాన్ ద్వారా పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండి. - https://harshaneeyam.captivate.fm/devudamma

హర్షణీయం స్పాటిఫై ఛానల్ -

https://harshaneeyam.captiva...
10
Dec. 29, 2022

'పార్వేట' రచయిత సురేంద్ర శీలంతో సంభాషణ

కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన, ఇంజనీరింగ్ చదివిన, ఇరవై తొమ్మిదేళ్ళ సురేంద్ర శీలం రాసిన కథల పుస్తకం - పార్వేట’. గత మూడేళ్ళ క్రిందటే తెలుగు కథలు చదవడం రాయడం మొదలు పెట్టిన ఈ రచయిత మొదటి పుస్తకం ఇది.

కథలన్నీ ఆ ప్రాంతపు మాండలికంలో రాసినవే. మాండలికం వాడిన పద్ధతి చదువుకోడానికి ఎక్కడా అడ్డం రాలేదు, అందాన్నిచ్చింది. అక్కడి గ్రామీణ జీవితాన్ని, సమస్యలనీ చక్కటి పాత్రలను సృష్టించడం ద్వారా మన ముందుకు తెచ్చారు రచయిత.

పుస్తకం కొనడానికి -

https://www.amazon.in/Parveta-Kathalu-Surendra-Seelam/d...
9
Dec. 29, 2022

బతుకు సేద్యం నవలాపరిచయం

బతుకు సేద్యం - జహీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న గ్రామీణ మహిళల గురించి, ఒక ప్రభుత్వేతర సంస్థ సహాయంతో వారి జీవితాలను వారు కష్టపడి ఎలా సరిదిద్దుకున్నారో, వివరిస్తూ రాసిన పుస్తకం. యదార్థ సంఘటనలనాధారం చేసుకుని రాసిన కాల్పనిక నవల. ఎపిసోడ్ లో ముందుగా ఛాయా మోహన్ గారు మాట్లాడతారు. తర్వాత రచయిత శాంతి ప్రభోదిని గారు నవల గురించి మరిన్ని వివరాలు అందిస్తారు.

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Talk to us!