May 3, 2020
నేను నా కథలతో మా ఇంట్లో కనిపించిన పుస్తకాన్నంతా నలుపు చేసేస్తున్నానని, ఈ రోజు మా అమ్మ నాకో మందపాటి పాత డైరీ ఇచ్చి, దీంతో రాసుకో, రాసుకొని ఎక్కడంటే అక్కడ పారేసుకోకుండా జాగ్రత్త పెట్టుకో అని చెప్పింది. ఆ పాత డైరీ తీసుకోగానే, ఏదైనా ఓ పాత మధురంతో వెంటనే నలుపు చేసెయ్యాలన్న కోరిక నన్నావహించింది. ఎవరి గురుంచి రాయాలబ్బా అని ఆలోచిస్తుంటే మా సత్యగాడు గుర్తొచ్చాడు.
ఇప్పగుంట వెంకట సత్యనారాయణ, మా స్నేహితులకందరికీ ఐ.వి.ఎస్ గా సుపరిచితుడు, కానీ నాకు మాత్రం సత్య గానే, మా ఇంట్లో వాళ్లకు సత్యంగా. జీవితం లో కష్టా...