Conversations on contemporary literature from across the world, in translation.

Telugu Katha Episodes

Audio of Telugu Short Stories.
104
Oct. 10, 2020

'పీవీ తో నేను' - శ్రీరమణ గారి రచన 'వెంకట సత్య స్టాలిన్' నించి.

తెలుగు వారు గర్వపడే కథలు రచించిన రచయితల మొదటి వరుసలో శ్రీ శ్రీరమణ గారు వుంటారు. ఇది గాక వారు తెలుగు ప్రసార మాధ్యమాలన్నిటిలోనూ గత యాభై ఏళ్లపైబడి విమర్శ, సమీక్ష , సంపాదకీయం లాంటి అనేక రంగాల్లో పని చేస్తూ ఎంతోమందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు.

అతి సున్నితమైన హాస్యం తో రచనలు చేయడంలో ఆయన సిద్దహస్తులు. తెలుగులో పేరడీ ప్రక్రియకు , ఒక గౌరవ ప్రదమైన సాహితీ స్థాయి కల్పించిన రచయిత గా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఆయన కథా రచన 'మిధునం' మలయాళం లో వాసుదేవన్ నాయర్ గారి దర్శకత్వంలో , తెలుగు లో భరణి గారి ...
100
Sept. 27, 2020

హర్షణీయంలో పెద్దిభొట్ల వారి 'ఇంగువ'!

https://harshaneeyam.in/2020/09/27/peddibhotla/

హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు కథా నీరాజనం శీర్షికలో మీరు వినబోతున్న కథ పేరు 'ఇంగువ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన ఆయన , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా.

(ఈ పుస్తకం మొదటి రెండో భాగాలు డిజిటల్ ఎడిషన్, ప్రింటెడ్ వెర్షన్, కొనడానికి కింద లింక్స్ ఇవ్వడం జరి...
99
Sept. 22, 2020

'ఓ హెన్రీ స్టోరీ' - వెంకట్ శిద్ధారెడ్డి గారి 'సోల్ సర్కస్' కథాసంకలనం లోంచి!

హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు వినబోతున్న కథ శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారు రాసిన , కథాసంకలనం 'సోల్ సర్కస్' లోనిది.

వెంకట్ శిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి,కోరుకొండ సైనిక్ స్కూల్ , తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించి , దేశ విదేశాల్లో పని చేసిన ఆయన 'సోల్ సర్కస్' అనే కథ తో , రచయితగా పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు.

2019 వ సంవత్సరంలో తన మిత్రులతో కలిసి , 'అన్వీక్షికి పబ్లిషర్స్' అనే సంస్థని స్థాపించి, ప్రపంచ...
98
Sept. 20, 2020

సుప్రసిద్ధ సినీ దర్శకులు 'వంశీ' గారి కథ 'ఏకాదశి చంద్రుడు'

హర్షణీయానికి స్వాగతం. ఈరోజు 'కథా నీరాజనం' శీర్షికన, 'ఏకాదశి చంద్రుడు' అనే కథ మీరు వినబోతున్నారు. ఈ కథ వంశీ గారు ' ఖచ్చితంగా నాకు తెలుసు అనే కథా సంపుటి నించి స్వీకరించ బడింది.

(ఈ కథ ఆడియో పై మీ వ్యాఖ్యలకు ఈ వెబ్ పేజీ ని సందర్శించండి https://harshaneeyam.in/2020/09/20/ekadasi/)

కథలోకెళ్లే ముందర వంశీ గారి గురించి ఓ రెండు మాటలు. వంశీ గారు ఎంత గొప్ప సినీ దర్శకుల్లో, అంత గొప్ప కథారచయిత కూడా.

నేను చూసిన వంశీ గారి మొదటి సినిమా 'సితార'. ఆ సినిమాలో వంశీ గారి ఫ్రేములకి , ఇళయరాజా గారి సంగీతం తోడై, తెలుగు...
96
Sept. 19, 2020

'వంశీ' గారి 'శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్'

ఈ వారం 'కథా నీరాజనం' లో సుప్రసిద్ధ సినీ దర్శకులు , కథా రచయిత , వంశీ గారి ' శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ' అనే కథను పరిచయం చేస్తున్నాం. ఆడియోలో ముందుగా హర్షా, గిరి, ఇంకో మిత్రుడు బాలాజీ, వంశీ గారి రచనల గురించి. ప్రత్యేకంగా ఈ కథ పై తమ అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది.

(ఈ కథపై మీ వ్యాఖ్యలకు ఈ వెబ్ పేజీ ని సందర్శించండి. https://harshaneeyam.in/2020/09/19/vamsi-1/)

ఈరోజున మనకున్న గొప్ప తెలుగు కథారచయితల్లో నిస్సందేహంగా వంశీ గారొకరు.

ఆయనదైన ట్రేడ్ మార్క్ హాస్యంతో, అతిసుందరమైన గోదావరి తీరం నేపధ్యం...
94
Sept. 13, 2020

సాబువ్వ

సాబువ్వ

మబ్బులు కమ్మిన ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న వరదయ్యను చూసి "ఏందయ్యా.. పైన మోడం గట్టిందెప్పుడూ సూళ్ళేదా" అని భార్య భూదేవమ్మ నవ్వుతోంది.

"కాదే దేవమ్మా .. ఎప్పుడూ ఓ సుక్క గూడా రాల్చని మబ్బులు గూళ్ళు గూళ్ళుగా ఔపిస్తూ ఎందుకే ఆశల్లేపుతాయి.. మనం గూడా మనుసులమే కదా!! ఓ రెండు సినుకులు రాలిస్తే పైన నీళ్ళు ఆవిరైపోతాయా" అని దేవమ్మను చూసి అంటూంటే..

నువ్వు రమ్మని పిలిసి సూడు వత్తాయ్.. నే పోతాండా, ఆడ ఎండుగెడ్డి పీకాల, నువ్వు ఆ మూలంతా సదను సేసి రా.. క్యారీరు చింతచెట్టుకు ఏలాడ గట్టినా, నువ్వొచ్చినంక బు...
92
Sept. 11, 2020

డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారి 'కాకులు గ్రద్దలు' కథ సంక్షిప్త రూపంలో

'కథా నీరాజనం' శీర్షికన, హర్షణీయం లో మొట్టమొదటి గా సంక్షిప్తీకరించిన కథ, 'కాకులు గ్రద్దలు'

కథా రచన: సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు.

ఈ కథ వారి పాత్రల సహజ చిత్రీకరణ కు , రచనా చాతుర్యానికి ప్రతీక.

కథలో నాలుగు అంకాలు , ప్రతి అంకంలో రెండు పాత్రలు. ఏ అంకంలోని ప్రధాన పాత్రలు కూడా, మిగతా అంకాల్లోని , ప్రధాన పాత్రలను కలపకుండా , కథ గొప్పగా ముగించడం, శ్రీ నరేంద్ర గారి కథ శిల్పవిశిష్టతను మనకు తెలియజేస్తుంది.

ఈ కథ పై మా ప్రశ్నలకు, నరేంద్రగారిచ్చిన సమాధానాలను , అంతేకాకుండా నరేంద్ర గారి...
90
Aug. 14, 2020

బెల్లం టీ

A Story by Sri.Murali from his Blog 'Nemali Kannu"

http://nemalikannu.blogspot.com/2009/12/blog-post_17.html
yikKeWfiPocxqEy9L858

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
86
Aug. 8, 2020

అతిథి దేవోభవ!

కేరళ - ఒక కేళీరవం, కళల మౌక్తికం..

ప్రపంచమంతా ప్రేమగా పిలిచే " గాడ్స్ ఓన్ కంట్రీ "

ఎలా వర్ణిద్దాం ఈ అద్భుతాన్ని!!

పర్యాటకులను కట్టిపడేసే వాయనాడ్ లో ఉదయించే సూర్యుడిని తాకే చల్లటి మబ్బుల్లా, మున్నార్ టీ తోటల్లో వీచే పిల్లగాలుల్లా, జారే జలపాతాల్లా, సోయాగాల సాగర తీరాల్లా, బ్యాక్ వాటర్స్ లా, రబ్బర్ తోటల్లా, వంద శాతం అక్షరాస్యతలా..

దేవుళ్ళంతా ఆనంతపద్మనాభుడిలా, గురువాయూర్ కృష్ణుడిలా, శబరిమల మణికంఠుడిలా మాకు రక్ష.

మాది ఒక వ్యవసాయం కుటుంబం. వరి మా ఇంటి సిరి.

కాస్త డబ్బు వెనకేసి నాన్న మున్నార్ లో ఓ ...
July 31, 2020

ప్రణవం ప్రణయం పరిణయం

చక్కగా టేపు వేసున్న కవర్ కొరియర్ లో వస్తే వెనక్కి తిప్పి చూశాను. పంపిన ఊరు అందరికీ తెలిసిన మదనపల్లె అయినా పంపివాయన పేరు నాకు తెలియని ఆనందరావు. ఆ ఊళ్ళో మనకు ఎవరూ పరిచయం లేరే అనుకుని వచ్చిన అడ్రస్ చూస్తే నా పేరు మీద కరెక్టుగానే ఉంది.

ఎవరబ్బా అనుకుంటూ జాగ్రత్తగా టేపులన్నీ దాటి కవర్ మెల్లగా తెరిస్తే లోపల ఒక ఫోటోలో బాటు ఏదో లెటర్ ఉంది. ఫోటోలో ఓ అమ్మాయి!! మస్తిష్కంలో ఏవేవో ఆలోచనలు. అలా చూస్తూ ఉండాలనిపించే అందం నన్ను ఓ తెలియని ఏకాంతానికి తీసుకెళ్ళింది.

ఇంతలో పక్కనే ఉన్న రెడ్డినాయుడు 'ఏందియ్యో' కధ అంట...
July 26, 2020

లీలా కాలనీ

తలుపులు దబదబా బాదుతున్న శబ్దం .

గడియారం చూస్కుంటే సాయంత్రం ఆరున్నర అయ్యింది..

డోర్ ఓపెన్ చేస్తే, బయట నిలబడున్నాడు నీటు గా డ్రెస్సు అయ్యి తన స్టాండర్డ్ నిశాచర వస్త్రాలు - బ్లాక్ జీన్సు, బ్లాక్ టీషర్ట్ లో రామకృష్ణ.

"మంచి నిద్ర పాడుచేశావ్ ! కొంపలేంమునిగాయనీ" ?

"బైకు తాళాలిస్తావా, ఇప్పటికే లేట్ అయిపోయింది." ?

తాళాలు ఇస్తూ చెప్పాను , " పొద్దున్నే ఫ్యాక్టరీ నించి వస్తూంటే రిజర్వు లోకి వచ్చింది , పెట్రోల్ చూసుకో" అని.

సమాధానం గూడ చెప్పకుండా తాళాలు తీస్కొని పరిగెత్తాడు రావకృష్ణ.

వెనకనించి అరిచాను...
July 18, 2020

చిన్నీ వాళ్ళ చంద్రత్త!

"చిన్నీ ! నీ పెళ్ళికి చంద్రత్త వాళ్ళు రావట్లేదు, ఇందాక నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు, మావ ఫోన్ చేశారు, చంద్రత్త కి ఒంట్లో బాగాలేదు అనిచెప్పి" అన్నారు నాన్న.

"నా పెళ్ళికి చంద్రత్త లేకపోతే, ఎలా ! అయినా క్రితం వారమే కదా, మీరు ఢిల్లీ కి ఎదో పని మీద వెళ్లి , అత్తా వాళ్ళను చూసొచ్చింది. అప్పుడు బాగానే వుంది కదా అత్తకి ?" అడిగాను నేను నాన్నని.

నా ప్రశ్న కు ఏమీ సమాధానం చెప్పకుండా, నాన్న అమ్మ వైపు చూసారు.

అమ్మ చెప్పింది, "అత్తకి, నెక్ పెయిన్ వల్ల, బాగా ఇబ్బందిగా ఉంది, చిన్నీ! మాట్లాడితే ఇంకా ఎక్కువ అ...
July 12, 2020

పిన్ని అనబడే వరలక్ష్మి గారు, అనే పిచ్చి రాముడి కథ!

మన పిచ్చి రాముడు గారు రాసిన, 'అమ్మ గురించి' చదవగానే, ఆయన్ని ఆయన ఒక అమాయకుడి గా చిత్రీకరించు కొని, వాళ్ళ అమ్మ గారు "నా పిచ్చి తండ్రి" అని ఎలా పిలుచుకునేదో, ఎలా కాపాడుకొని కడుపులో దాచుకొనేదో అని రాసిన విధానం నా మనస్సుకు చాలా హత్తుకున్నది.

అలాగే ఉమ్మడి కుటుంబం లో పెరిగిన నాకు నా పిన్నమ్మతో అనుబంధం చాలా ఎక్కువ. ఎంత అంటే ఆవిడ జ్ఞాపకాలు అన్నిటా గుది గ్రుచ్చి, "మన జీవితాల్లో కథ నాయికా నాయకులు" అని ముచ్చటలు చెప్పుకునేంత.

నాకు ఆయన రాసిన "పిన్ని అనే వరలక్ష్మి గారు" గురించి ఆవిడ కథానాయకుడికి ఏవిధంగా పిన్...
July 12, 2020

నెల్లూరు ట్రంక్ రోడ్డు నందలి నా 'జాతక' కథ!

ఆ రోజు, ఒంగోల్లో ఏదో పెళ్లి ఉందని, వారం రోజులు కని, మా ఆవిడ బయలు దేరుతూంటే, ఆవిణ్ణి, రైలు ఎక్కించి, ట్రంకు రోడ్డుకొచ్చాను.

మా రోజు వారీ సమావేశానికి నేను ఓ అరగంట లేటు.

అప్పటికే, మా వాళ్ళు, విశ్వనాధం, సుబ్బారాయుడు, వెంకటరామన్ సర్, ట్రంకు రోడ్డు, సదాశివ మెడికల్ హాల్ మెట్ల మీద, చేరి పోయి వున్నారు.

మా విశ్వనాధం ఎదో విషయం సీరియస్ గా చెపుతూంటే, వెంకట రామన్ గారు, సుబ్బారాయుడు ఆసక్తిగా వింటున్నారు.

నేను రావడం చూసి మా విశ్వనాథం సడన్ గా మాట్లాడ్డం ఆపేసాడు.

"ఏవయ్యింది" అడిగాన్నేను విశ్వనాధాన్ని.

సమాధా...
June 28, 2020

మా విజయ్ - "అన్న"

చేతి లో ఒక చిన్న బాగు తో, నా రూం బయట, కుర్చీలో కూర్చుని వెయిట్ చేస్తున్నాడాయన.

అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి.

ఆయన్ని చివరి సారి నేను చూసింది నేను 10th క్లాస్ లో వున్నప్పుడు, ఇదే వూర్లో .

నా ముందున్న ఫైల్ మీద రాసుంది ఆయన పేరు, సంజీవరావు అని.

కావాలని ఒక రెండు గంటలనించి ఆయనని, నా గురించి వెయిట్ చేయిస్తున్నా.

నవంబర్ నెల కావడంతో, పెన్షన్ తీసుకొనే సీనియర్ సిటిజన్స్, "లైఫ్ సర్టిఫికెట్' కోసం మా ఆఫీస్ కి వస్తారు, ఫిసికల్ వెరిఫికేషన్ గురించి.

వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసి మేం సర్టిఫై చేస్తేనే, పెన్షన్ కంటిన్యూ...
June 21, 2020

తరలి రాద తనే వసంతం

'తరలి రాద తనే వసంతం' అనే నా పాట తోనే ఆ రోజు ఇళయరాజా లైవ్ కన్సెర్ట్ మొదలయ్యింది.

నేను పాడుతుంటే ఇళయరాజా చేతులూపడం మానేసి నా వైపే తన్మయత్వంతో చూస్తున్నారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ముందు వరసలో కూర్చుని తల తెగ ఊపేస్తున్నారు.

ఇంతలో ఎక్కడో కోరస్ మధ్య లోంచి, మా ఆవిడ గొంతు, ఇంక పాడింది చాలు నిద్ర లోంచి లెమ్మని.

కళ్ళు తెరిచి చూస్తే, అప్పుడే పూజ గదిలోంచి వచ్చిన మా ఆవిడ , ఆ పక్కనే ఆ రింగ్ టోన్ తో మొబైల్ లోంచి నన్ను దీనం గా చూస్తున్న మా వెంకటరమణ మొహం కనపడ్డాయి.

ఇంత పొద్దున్నే వీడు నాకెందుకు ఫ...
June 16, 2020

కలడు కలం డనెడు వాడు?

తారీఖు నవంబర్ 7 , సంవత్సరం 1990 .

నెల్లూళ్ళో మా టౌన్ హాల్ అంతా నిండిపోయింది . రెండువేల కి మించి ప్రజానీకం.
వాళ్లలో ఎక్కువమంది నెల్లూరు జిల్లా లో పని చేసిన , చేస్తున్న ఉపాధ్యాయులు.

హాల్లో అంతా పండగ వాతావరణం.

ఇంతమంది ఉపాధ్యాయులు ఒక ప్రజా నాయకుడి సన్మానానికి రావడం బహుశా జిల్లా చరిత్ర లోనే మొదటి సారి అయివుండవచ్చు.

ఆ రోజు, మేమంతా 'మా రెడ్డి గారు' అని, ప్రేమగా పిల్చుకునే భక్త వత్సల రెడ్డి గారి షష్టి పూర్తి మహోత్సవం.

ఇంకా సమావేశం ప్రారంభం కావడానికి ఇరవై నిముషాలుంది. నేను స్టేజి కిందనే నిల్చుని వున...
June 13, 2020

ఆధునిక తెలుగు సాహిత్యంలో ట్రావెలాగ్!

ఆధునిక తెలుగు సాహిత్యం లో అన్ని ప్రక్రియలకంటే ముందు వచ్చినది యాత్రా సాహిత్యమే.

ఆత్మకథ లేక స్వీయ చరిత్రను ఆంగ్లములో మొదటగా వ్రాసిన తెలుగువారు శ్రీ వెన్నెలకంటి సుబ్బారావు గారు.

వారి జీవ యాత్రా చరిత్రలో భాగం గానే వారి కాశీ యాత్రను గురించి వ్రాశారు.

దాదాపు అదే దశాబ్దం లోనే వారి బంధువైన, శ్రీ ఏనుగుల వీరాస్వామి గారు తన కాశీ యాత్ర చరిత్రను లేఖలు రూపంలో తన చెన్నపట్నం స్నేహితులైన శ్రీ కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై కు తెలిపారు.

ఇరవయ్యవ శతాబ్దపు మొదటి పాతికేళ్లలో, తెలుగునాట అక్షరాస్యత చాలా తక్కువైనప్ప...
June 11, 2020

సన్నిధానం!

ఇన్ని రకాల జనాలు, వీళ్ళందరూ ఎందుకొచ్చారో అనుకున్నా చుట్టూ చూస్తూ.

లాల్చీ పైజామాలు, పంచెలు, చీరలు, పంజాబీ డ్రెస్సులలో రక రకాల వయస్సుల వాళ్ళు.

ముందు వరుసలో అప్పుడే పెళ్లి అయిన ఓ జంట పసుపు బట్టలలో కూర్చోనున్నారు.

క్యూ కాంప్లెక్స్ నుండి మసక మసకగా కనపడుతుంది బంగారు గోపురం.

వేకువ ఝాము ఐదున్నర అవుతుంది. డిసెంబర్ నెల, మంచు కురుస్తుంది బయట.

అప్పుడు నేను బెంగుళూరు లో ఉండేవాడిని. ముందురోజు తిరుపతొచ్చి ఫ్రెండ్ ని కల్సి దర్శనం చేసుకుందామని కొండకి వచ్చాను.

ఆ ముందు వారం రాసిన సెమిస్టరు ఎండ్ ఎగ్జామ్స్ లో ...
June 7, 2020

మా జి.వి.ఎస్ మాస్టారు గారు!

జి.వి.ఎస్ మాస్టారు గారు ఒంగోలు P.V.R.మునిసిపల్ హై స్కూల్ లో నా టీచర్. పూర్తి పేరు గాలి వెంకట సుబ్బారావు గారు. ఆరడుగుల మనిషి, స్ఫురద్రూపి, లెక్కలు మరియు సైన్స్ అయన స్పెషాలిటీ. ఇదికాక ఆయన అద్భుతమైన వక్త, విషయం ఏదైనా తెలుగు లో చాలా అందంగా, అనర్గళంగా మాట్లాడగలరు.

నాకున్న తెలుగు తెగులు ఆయన నుంచే తగులుకుంది అని నా అనుమానం. బడిలో విన్నది చాలక ఆయన గొంతు విందామని ఆయన దగ్గరకి ట్యూషన్ కూడా వెళ్ళేవాడిని. మొదటి నుండి ఆయనకు నేనంటే ఎందుకో ప్రత్యేకమైన అభిమానం.

ఏరా, అబ్బాయి అంటూ ప్రేమగా పలకరించే వారు. ఒకసారి మ...
June 1, 2020

ప్రపంచ సాహిత్యంలో ట్రావెలాగ్!

ప్రాచ్య భారత దేశానికి మహా ఇతిహాస జాతీయ కావ్యాలైన రామాయణ, భారత, భాగవతాలు ఎట్లో, ప్రాచీన పాశ్చాత్య సంస్కృతికి మూల స్తంభమైన గ్రీకు నాగరికతకు వారి చరిత్రలు అయిన ఇలియడ్ మరియు ఒడిస్సీలు అలానే అని చెప్పవచ్చు.

మనకు వాల్మీకి, వ్యాసుడు ఎట్లనో వారికి హోమర్ అట్ల. అంతే కాదు ఆయా ఇతిహాస కావ్యాలలో కూడా దేశ, కాలములు వేరు అయినప్పటికీ కొన్ని పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వచ్చిన తర్వాత మధ్యధరా సముద్ర ప్రాంతములో హోమర్ మహాకవి కృతమైన కావ్యాల సంఘటనలు జరిగినట్లు గా ఋజువులు లభించాయి.
...
May 30, 2020

తెలుగులో ట్రావెలాగ్ సాహిత్యం!

అందరికి నమస్కారము. ఈ వేదిక ద్వారా నేను, తెలుగులో ట్రావెలాగ్ సాహిత్యం అనే శీర్షిక పేరుతో మూడు వ్యాసాలు మీకు అందించ దలచుకున్నాను.

ట్రావెలాగ్ అంటే యాత్రావివరణము అని మనము తెనిగీకరించ వచ్చునేమో!. ఓ రచయిత ట్రావెలాగ్ ద్వారా తాను ప్రయాణించిన కొత్త ప్రదేశములు, ఆ ప్రదేశాలలో కొంత కాలము గడపటం వలన ప్రోదిచేసుకున్న అనుభవాలను పాఠకులకు తామే ఆ ప్రదేశాలలో సంచరించినంత అనుభూతిని అందిస్తాడు.

ఓ ట్రావెలాగ్ రాసేటప్పుడు రచయిత మిగిలిన విషయాలతో పాటు, అప్పటి దేశ కాలమాన పరిస్థితులు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కలిసిన వ్యక్త...
May 28, 2020

హర్షణీయంలో సాహితీవనం !

హర్షణీయం వయస్సు రెండు మాసాలు. ఈ రెండు మాసాల్లోనే నేను, నా మిత్ర బృందం దాదాపు 1800 మంది అతిథులను, వారిచే 9000 దర్శనాలను మరియు పునర్దర్శనాలను సంపాదించుకున్నాము. మొదట మా గిరిగాడి సలహాకు నవ్వుకున్నాము, మా కథలను ఆడియో రూపంలో కూడా పెట్టమన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆశ్చర్యం గా మా కథలు ఆడియో రూపంలో రమారమి 5000 మార్లు దిగుమతి అయ్యాయి.

ఎంతో మంది స్నేహితులు, బంధువులు, సన్నిహితులు వారి సందేశాల ద్వారా ప్రోత్సహిస్తూ మా ఉత్సాహాన్ని ద్విగుణీకృతం కావిస్తున్నారు. మీ ప్రోత్సాహం ద్వారా మా ఉత్సాహాన్ని పెంపొందిస్తున్న మ...
Talk to us!