April 19, 2023

హర్షణీయం శ్రోతలకు ( To Harshaneeyam Listeners)

హర్షణీయం శ్రోతలకు ( To Harshaneeyam Listeners)
Apple Podcasts podcast player iconSpotify podcast player iconYoutube Music podcast player icon
Apple Podcasts podcast player iconSpotify podcast player iconYoutube Music podcast player icon

హర్షణీయం పాడ్కాస్ట్ పై మీ అభిప్రాయం ( feedback form) -

https://forms.gle/FiYgAbqjqncYUiqo7

హర్షణీయం టీం తో ఇంటర్వ్యూ సారంగ పత్రికలో -

https://bit.ly/harsharanga


హర్షణీయం పాడ్కాస్ట్ మొదలు పెట్టి ముప్ఫయి మూడు మాసాలయింది. తెలుగు కథల్లో మాకు నచ్చిన యాభై కథలకు పైగా పరిచయం చెయ్యడమే కాక , ముప్ఫయి ఐదు మంది తెలుగు కథా రచయితలను, ప్రచురణ కర్తలను, తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న ప్రముఖులను హర్షణీయం పాడ్కాస్ట్ ద్వారా పరిచయం చేసాము. ఈ మధ్యకాలంలో అనువాద కథలతో పాటు, ఇతర దక్షిణాది భాషా రచయితలను , ప్రచురణ కర్తలను కూడా పరిచయం చేస్తున్నాము.

ఇరవై మంది శ్రోతలతో మొదలైన ఈ పాడ్కాస్ట్ ని ఇప్పుడు , ఇరవై దేశాలనుంచి 2500 మంది శ్రోతలు ప్రతి నెలా వింటున్నారు.

ఈ సందర్భంగా , హర్షణీయం టీం మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ని ఇంకా మీకు చేరువ చేసేటందుకు మీ అభిప్రాయాన్ని కోరుతోంది. ఇందుకోసం ఈ ఎపిసోడ్ షో నోట్స్ లో ఒక ఫీడ్ బ్యాక్ ఫార్మ్ కి లింక్ ఇస్తున్నాము. మీ గూగుల్ అకౌంట్ నించి లాగిన్ అయ్యి ఫీడ్బ్యాక్ ఫార్మ్ ని మీరు పూర్తి చేయవచ్చు. ఆ ఫార్మ్ ద్వారా మీ అభిప్రాయాలను మాకు తెలుపవచ్చు.

మీరు ఏ ఆప్ ద్వారా హర్షణీయం పాడ్కాస్ట్ ని వింటున్నారో, ఆ ఆప్ లో రేటింగ్ ఇస్తే హర్షణీయం పాడ్కాస్ట్ ని కథాసాహిత్యం మీద అభిమానం వుండే ఇంకొంత మంది శ్రోతలకు ఈ పాడ్కాస్ట్ దగ్గరయ్యే అవకాశం కలుగుతుంది.

మీరు మాకు ఇస్తున్న ప్రోత్సాహానికి మరో మారు ధన్యవాదాలు.






This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp